Saturday, October 31, 2015

మానవుని హృదయం అంటే ఏది ?

మానవుడు సత్వగుణంతో జీవిస్తున్నప్పుడు, మంచి నడవడిక కలిగి, నీతినియమాలతో అంచరిస్తున్నప్పుడు, అతడు ప్రదర్శిస్తున్న కరుణ, దయ, జాలి, ప్రేమ, త్యాగం, ఆనందం, తృప్తి వంటి గుణాలతో అలరారుతున్నప్పుడు అతని మనస్సు ఉన్న స్థితినే హృదయం అంటారు. ఆ విధంగా హృదయం అంటే మానవుని శుద్దమైన మనస్సే కాని అతనిలో రక్త ప్రసారం కావించే గుందేకాయ కాదు. ఆత్మానుభూతిని కలిగించే స్థానాన్నే హృదయం అంటున్నారు. అది రెండు కన్నుల మధ్య మూడవ నేత్రం ఉండే స్థానం వద్ద ఉంది. మూడవ నేత్రం ఉండే స్థానాన్నే ఆజ్ఞాచక్రం అని అంటారు.  సామాన్య మానవుల మనస్సు విషయవాంఛనలతో కూడి ఉండడం వలన వారి హృదయం లోకవాంచలతో కూడి అజ్ఞానంతో సంచరిస్తూ ఉంటుంది. అదే సాధకుని మనస్సు లౌకిక ప్రవృత్తికి మరలి, ధార్మికతతో, నైర్మల్యంతో గడుపుతున్నప్పుడు వారి హృదయం ఆత్మ జ్ఞానంతో సంచరిస్తూ ఉంటుంది. అటువంటి ఉన్నత స్థానం నుంచి సాధకునికి జ్ఞానమనే(పరమాత్మా) సూర్యుడు ప్రకాశిస్తే అతనికి అజ్ఞానమనే చీకటి సంపూర్ణంగా తొలగిపోతుంది.

దేహమే దేవాలయం ఎలా ?


ఓ మిత్రులారా! మనం అందరం చిన్నప్పటి నుండి మన పెద్ద వాళ్ళు చెప్పారని దేవాలయాలకు పోతున్నాము. అక్కడ గర్బగుడిలో వున్న ఈశ్వర లింగాన్ని లేక అక్కడ వున్నా దేవత ప్రతిమని చూసి మనసార మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి ఈరోజు గుడికి వెళ్లి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకోని మనం సంతృప్తి పడతాము. కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్నీ గ్రహించాలి.అది ఏమిటంటే దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం అందులో (గర్భ గుడిలో) అంటే అంతరంలో ఈశ్వరుడు . అతని దర్శనం.
నిజానికి పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటే మానవశరీరం. ఇక్కడ “తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము. దేవాలయ ప్రాచీనత :
భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడనీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టదనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.
“దేహమే దేవాలయం” అవును నీ దేహమే, పంచభూతాలతో నిర్మితమైన నీ శరీరమే దేవాలయం. ఈ శరీరానికి, మనస్సుకు, బుద్దికి, ప్రాణానికి, జీవానికి (అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు) అన్నిటికి శక్తిని ఇచ్చే ఆ పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ శరీరపు అంతరంలో హృదయంలోనే స్వయం ప్రకాశితమై దేదీప్యమానంగా వున్న ఆ చిదానంద స్వరూపుడు అయిన ఆ దేవదేవుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిర్గుణుడు, సమస్త లోకాలకు సృష్టి కర్తయైన ఆ సర్వేశ్వరుడు ఈ శరీరపు అంతరంలోనే వుండి తను ఏమి చేయక తన శక్తి చేత ఈ శరీరాన్ని ముందుకు నడుపుతున్నాడు. 
నీ శరీరపు అంతరంలో వున్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితమై వెలుగుచున్నాడు అక్కడ ఏ సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. ఆయనే స్వయం ప్రకాశి. సూర్య చంద్రులు కూడా అయన యొక్క శక్తి చేతనే ప్రకాశింపబడుతున్నారు.
మీ హృదయాంతరాలంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవదేవునిని మీద మనస్సు ఉంచి సాధన (అంటే ధ్యానం) ద్వార మీ హృదయాంతరంలోనే దర్శించుకొని మీరు పొందిన ఈ మానవ జన్మకు సార్ధకతను ఇవ్వండి. అదియే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
అదియే దేవాలయం యొక్క విశిష్టత. దేవాలయానికి వెళ్లి గుడిలో వున్న లింగాన్ని దర్శించడం అంటే మనం మన హ్రుదయాన్తరంలో వున్న ఆ సర్వేస్వరున్ని ధ్యానం ద్వార పరిపూర్ణ (సంపూర్ణ) దర్సనం చేసుకోవాలి అని ఆ
విధంగా మనం దానిలోని వేదాంతాన్ని గ్రహించడానికి మన పెద్దలు అలోచించి అలా చేయవలసి వచ్చింది.


 sudhakar o     at  3:56 PM

ప్రకృతే భగవంతుని విరాట్ స్వరూపం:

ఓం నమో పరమాత్మయే నమః


మనం అందరం భగవంతునిని ఒక విగ్రహ ప్రతిమ రూపంలో భావిస్తూ కొలుస్తుంటాం. ఆ విగ్రహానికి పూజలు చేస్తాం, దానినే దైవారాధన అని అంటాం. అదేలాగు నైవేద్యం కూడ సమర్పిస్తాం. దీనినే భగవంతునిని ఒక విరాట్ స్వరూపంగా భావించి కొలవడం. కాని దీనినే జ్ఞానంతో ఒక మంచి భావంతో అదే విధానాన్ని వేరేగా అలోచించి చేస్తే మన మనస్సు ఇంకా త్వరగా భగవంతుని కోసం ఆరాటపడుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు. చాల ఆధ్యాత్మిక పుస్తకాలో వ్రాసినేదే.


నిజానికి భగవంతుని రూపం లేదు. భగవంతుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిత్యుడు, సర్వాంతర్యామి మరియు కనిపించే ఈ నశ్వర ప్రకృతి మొత్తం తానే అయినాడు. కావున మనకు కనిపించే ప్రకృతే ఆ భగవంతుని విరాట్ స్వరూపంగా భావించాలి. మనం ప్రతిరోజూ చేసే పనులు (కర్మలు) అన్నియును దైవారాధనగా భావించి చేయాలి. మనం చేసిన పనుల యొక్క కర్మఫలాలను భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇదియే నిజానికి భగవంతునిని మనస్పూర్తిగా ఆరాదించడం అవుతుంది. భగవంతుడు కోరుకునేది కూడ నీ కర్మ ఫలాలను నాకు సమర్పించు. భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునకు తెలియజేసేది కూడ ఇదే.

పైన తెలిపిన విషయం చదవడానికి చాల సాధారణంగా ఉన్న. అది నిత్య జీవితంలో అమలుచేస్తే, మనం ఆధ్యాత్మికంగా చాల చాల ముందుకు వెళతాము. ఈ విధంగా మనం ప్రకృతిని భగవంతుని విరాట్ స్వరూపంగా ద్వైత భావంతో భావించి మనం ప్రతి దినము నడుచుకుంటే, మన మనసు తొందరగా కుదుట పడుతుంది. అదే విధంగా ఆ దేవదేవుడైన పరమాత్ముడు మనకు తొందరగా మన హృదయంలో దర్శనమిస్తాడు.

నిర్వచనాలు & ప్రతి మనిషి కలిగిఉండవలసిన లక్షణాలు

నిర్వచనాలు:
తపస్సు : భగవంతున్ని(పరమాత్ముణ్ణి) నిరంతరం తపించడాన్నే ‘తపస్సు’’ అంటారు. (భగవద్గీత)
ధ్యానం : ఒంటరిగా కూర్చొని భ్రుమధ్యమున ద్రుష్టి నిలిపి మనసులో మరియు మనసుతో పరమాత్ముణ్ణి ధ్యానించడాన్నే ‘‘ధ్యానం’’ అంటారు. (భగవద్గీత)
సన్యాసం : బాహ్యంగా అన్ని పనులు చేస్తూ, అంతరంగా మనసులో సమస్తాన్ని త్యజించడాన్నే ‘‘సన్యాసం’’ అంటారు. (భగవద్గీత)
వైరాగ్యం : ప్రతి పనిని చేస్తూ (ఆచరిస్తూ) దాని మీద అనురాగాన్ని మరియు మమకారాన్ని మనసులో వదిలి వేయడాన్ని ‘‘వైరాగ్యం’’ అంటారు. (భగవద్గీత)
జ్ఞానం : భగవంతుడు నిరాకారుడు మరియు నేను ఆత్మను (జ్యోతిని లేక శక్తిని) అని గ్రహించి మరియు కనిపించే ఈ ప్రక్రుతి అంతా కూడ భగవంతుని యొక్క మాయచే నిర్మితమై భగవంతుడే అయి ఉన్నాడు. ప్రళయ సమయంలో కనిపించే ప్రకృతి అంటా తిరిగి మరల శక్తిగా మారుతుంది అని తెలుసుకోవడమే ‘‘జ్ఞానం’’ అంటారు. (భగవద్గీత)
బ్రహ్మచర్యం: ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ సన్నిధిలో జీవనము గడపడమే ‘బ్రహ్మచర్యం’ అంటారు. (రమణ మహర్షి)





ప్రతి మనిషి కలిగిఉండవలసిన లక్షణాలు:
·         మదర్ థెరిస్సా లాంటి సమభావం (అంటే అందరిని సమానంగా భావించడం)
·         సాయిబాబా లాగ నిదానత్వం, నిబ్బర మరియు శ్రద్ధ.
·         రామకృష్ణ పరమహంస లాగ భగవంతుని దర్శనం పొందాల అన్న పట్టుదల.
·         రమణ మహర్షి లాగ ఆత్మానాత్మ వివేకం.
·         వివేకానంద స్వామి లాగ ఏకాగ్రత.
·         అర్జునుని
 మాదిరి గురువు(శ్రీకృష్ణుడు) పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి 
·         గౌతమ బుద్దుని లాగ ప్రశాంతంగా ఉండడం.
·         మహాత్మాగాంధీ గారిలా అహింసావాదిగా మరియు శాంతీయుతంగా ఉండడం.
·         భక్త ప్రహ్లాదుడిలా భగవంతుని మీద సంపూర్ణ మరియు పరిపూర్ణ విశ్వాసం .
·         భగవంతున్ని హృదయంలో దర్శించాలని ధ్రువుడి మాదిరి కఠోరమైన దీక్ష మరియు తపన కలిగి ఉండాలి.
·         ఆంజనేయ స్వామి మాదిరి భగవంతుని మీద భక్తిని కలిగి ఉండాలి.
·         ఏసుక్రీస్తు లాగ కరుణ, దయ మరియు జాలి.

పూజ చేస్తున్నప్పుడు ఆసనానికి ఉన్న ప్రాముఖ్యత :

పూజ చేస్తున్నప్పుడు ఆసనానికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ నిర్విఘ్నముగ జరిగేందుకు ఆసనం యొక్క ఆవశ్యక్త ఎంతో ఉంటుంది. అందుకే ఆసనం గురించి ఈ క్రింద విధముగా చెప్పారు-
ఆత్మ సిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం
నవసిద్ధి ప్రదానశ్చ ఆసనం పరికీర్తితం.
ఆత్మ ఙ్ఞాన్ని కలిగించడానికి, సర్వరోగాలను నివారించడానికి,నవసిద్ధులను ప్రాప్తింపజేయడానికి, " ఆసనం" అత్యంతావశ్యకమైనదని చెప్పబడుతోంది.
ఇక " ఆ" అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తూ, " స" అంటే సర్వరోగాలను హరిస్తూ, "నం" అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్ధం.

మానవ శరీరంలోని చక్రాల వివరణ :

మానవ శరీరంలో ఆరు చక్రాలు అమరి ఉంటాయి. అవి మూలాధార, స్వాదిష్టాన
వీనిలో మొట్టమొదటిది మూలాధారం. గుద స్థానము నందు వుండే నాలుగు రేకుల ఎరుపు రంగుతో వెలుగుచుండును. ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరు వేల జపములు జరుగును.  మూలధార చక్రమునకు విఘ్నేశ్వరుడు అధిదేవత.
రెండవది స్వాథిష్టాన చక్రము. ఆధార చక్రమునకు రెండు అంగుళములపై గుహ్యమందున నాలుగు రేకులు కలిగి,మూడు కోణములతో తెల్లని రంగుతో, ప్రకాశవంతంగా, నిర్మలంగా వుంటుంది. ఇది జల తత్త్వాన్ని కలిగి వుంటుంది. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగును. ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు అధిదేవత.
మూడవది మణిపూరకము. స్వాధిష్ఠాన చక్రమునకు పైన మూడంగులములలో నాభి నందున ఒక అగ్ని నిలయమై మణివలె ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం పది రేకులతో వుంటుంది. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత.
నాలుగవది అనాహత చక్రము హృదయ స్థానములో పన్నెండు రేకులతో వుంటుంది. స్వర్ణ కాంతులను వెదజల్లుతూంటుంది .ఇది వాయు స్వభావం కలిగి వుంటుందని యోగుల భావన. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత.
విశుద్ధ అనేది ఐదవ చక్రము. అనాహిత చక్రమునకు పైన  పన్నెండు అంగులములలో కంఠం నందున  వుంటుంది. పదహారు దళములుంటాయి. రెండు ఘడియల నలభై అయిదు విఘడియలకు వేయి హంస జపములు జరుగుతుంది. అధినాయకుడు జీవుడు.
ఆజ్ఞేయ చక్రము ఆరవది. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళములపైన భ్రూ మధ్య స్థానంలో (త్రికూట స్థానము) ఉంటుంది. రెండు రేకులు కలిగి వుంటుంది. ఎరుపు, పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతుంటుంది. రెండు ఘడియల నలభై విఘడియలకు వేయి హంస జపములు జరుగును. దీనికి సర్వేశ్వరుడు అధిష్టాన దేవత.
సహస్రారము అనునది ఆజ్ఞా చక్రానికి పైన కపాలంలో, నడి నెత్తిన బ్రహ్మరంథ్రము వద్ద వుంటుంది. ఎనిమిది దళాలుంటాయి. వేయి రేకులు కలిగి వుంటుంది. ఓంకారము ధ్వనించుచుండును. రెండు ఘడియల ఆరు విఘడియలకు వేయి హంసల జపము జరుగును. గురుమూర్తి అధిష్టాన దేవత.
ప్రాణ వాయువునకు కుడి ఎడమ వేపుల ఇడ పింగళులు అనే నాడులు వున్నాయి. ఇడ పింగళులు సహస్రారము మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి వుంటాయి. వీటిమధ్య సుషుమ్ననాడి వుంటుంది. ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి వుంటుంది. ఈ నాడుల యందు ప్రవహించే జీవ శక్తి జీవుని చలనంతో వుంచుతుంది''
ఏకాగ్రతతో మనసు నిలిపివింటే ఓంకారము వినిపిస్తుంది. అదే విధముగా భ్రూమధ్యమున ద్రుష్టి నిలిపితే పరంజ్యోతి కనిపిస్తుంది. ఆ చిదానంద మూర్తిని దర్శించితే ముక్తి ప్రాప్తిస్తుంది.


పైన తెలిపిన చక్రాలు ముఖ్యమైనవి ఇవికాక శరీరమంతా విశ్వశక్తి నిరాటంకంగా ప్రసరించేందుకు ఉపయోగపడేవి'చక్ర'లు. అరచేతి వేళ్ల చివర్లలో సైతం చక్రాలు వుంటాయి. అరచేతిలో రెండు చక్రాలుంటాయి. శరీరంలో 31 ప్రధానమైన చక్రాలు వుంటాయి.
బహిర్గతంగా వుండే చెడుశక్తుల నుంచి శరీరంలోని ప్రాణశక్తిని ఇవి కాపాడతాయి. రోగనిరోధక వ్యవస్థ చురుకుగా పనిచేసేందుకు ఈ చక్రాలే కారణం . ఇవి బలహీనపడితే వ్యాధులు ప్రబలుతాయి. ఏ భాగంలో వుండే చక్ర బలహీనపడితే అక్కడ 6వుండే శరీరభాగం దెబ్బతింటుంది. సాధారణంగా ఏ వ్యక్తిలోనైనా కేవలం రెండు లేక మూడు చక్రాలు మాత్రమే బాగా క్రియాశీలకంగా వుంటాయి. మిగిలినవి సాధారణస్థితిలో వుంటాయి. ఏయే చక్రాలు చురుకుగా వుంటే ఆ శక్తులు మరింత ఎక్కువగా పని చేసి కొన్ని రంగాలలో బాగా రాణిస్తారు.
శరీరంలో వుండే ఏడు ప్రధాన చక్రాలలో మొట్టమొదటిది మూలస్థానంలో వుంటుంది. మొత్తం ఈ ఏడు చక్రాలు శక్తి తరంగాలను శరీరంలోని నిరంతరం పంపటం ద్వారా జీవశక్తిని అందిస్తాయి. ఈ ఏడు చక్రాలలో ఏ ఒక్కటి పూర్తిగా పనిచేయకపోయినా మరణం తప్పదు.
కాలివేళ్ళు, చేతివేళ్ళలో ఏడు చిన్న చక్రాలున్నాయి. ఏడు చక్రాలు శక్తిమయ దేహంలోవున్న ఏడు పొరలతో అనుసంధానం కలిగివుంటాయి. విశ్వంలోని విశ్వశక్తి
శరీరంలోకి ప్రవేశించేందుకు ఏడు ప్రధానచక్రాలు కూడా ముఖ ద్వారాలుగా వ్యవహరిస్తాయి. చేప శరీరంలో మొప్పలు ఏ విధంగా అయితే ఆక్సిజన్‌ను గ్రహించి శరీరానికి అందిస్తాయో ఈసప్త చక్రాలు కూడా విశ్వమంతటా ఆవరించివున్న విశ్వశక్తిని గ్రహించి భౌతిక శరీరానికి అందించటం ద్వారా శరీరాన్ని సజీవంగా నిలుపుతున్నాయి. చక్రాలు మూలస్థానం నుంచి చివరివరకు చూస్తే ఒక శంఖు ఆకారాన్ని పోలి వుంటాయి. చక్రం చివరి భాగం శరీరం బైటకు వుండి శక్తి మయ శరీరంలోని ఏదో ఒక అంశతో అనుసంధానాన్ని కలిగివుంటుంది.
శరీరంలోని నేత్రాలు, మెదడు, హృదయం, జీర్ణవ్యవస్థ, ఎండోక్రైన్‌ వ్యవస్థ, జననాంగ వ్యవస్థలతో చక్రాలు సంబంధాన్ని కలిగివుంటాయి. భౌతిక శరీరం మనుగడ సాధించేందుకు ఇవి అత్యంత ఆవశ్యకాలు. ఏయే చక్రాలు అత్యంత క్రియాశీలంగా వున్నాయో తెలుసుకోవటం ద్వారా ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని పూర్తిగా అంచనా వేయవచ్చు. వ్యక్తిత్వ లక్షణాలను, ప్రవర్తనా తీరును నిర్దేశించేవి ఆయా భాగాలకు అనుసంధానం చేయబడిన చక్రాలు. ఏదైనా 'చక్ర' బలహీనపడినట్టైతే సంబంధిత శరీరభాగం కూడా బాగా దెబ్బతింటుంది.
ఇది బాగా క్షీణ దశకు చేరుకున్న సమయంలో వ్యాధి రూపంలో భౌతిక శరీరంలో బహిర్గతమవుతుంది. నిజానికి వ్యాధి మూలం భౌతిక శరీరంలో వుండదు. సంబంధిత 'చక్ర'కు విశ్వశక్తిని అందించటం ద్వారా రక్షణ వ్యవస్థను మరింత శక్తిమంతం చేస్తుంది. ఫలితంగా భౌతిక శరీరం వ్యాధిని నిర్మూలించటమే కాకుండా చురుకుగా పనిచేస్తుంది.

నాడీ చక్రము :

నాడీ చక్రము నెరింగినవారు ప్రాణస్వరూపమును, తద్ద్వారా హృదయాంతర్గతుడైన్ పరమాత్మ స్వరూపమును గ్రహింపగలరు. నాభికి క్రిందుగా నాడుల మాలకందము ఉండును. అక్కడినుండియే నాడుల ప్రారంభము. నాభి మధ్యమున 72౦౦౦ నాడులుండును. ఈ శరీరమంతయు, నిలువుగాను ,అడ్డముగాను, ఊర్ధ్వముగాను వ్యాపించిన నాడులలో నిండియుండును.వీనిమధ్య ప్రధాన నాడులు పడి యున్నవి. ఇడ, పింగల, సుషుమ్ను, గాంధారి, హస్తిజిహ్వ, ప్రధ, యశ, ఆలంబున, హుహు, మరియు శంఖిని అని వాని పేరులు. వాయువులు గూడ పది. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, నాగము, కూర్మము, క్రుకరము, దేవదత్తము మరియు ధనంజయము అని వాని నామములు. ఈ పదివాయువులలో ప్రాణము మొదటిదియు ప్రదానమైనదియు అయి యున్నది. ప్రాణవాయువు ప్రాణమును నిలబెట్టుచున్నది. హృదయ స్థానమున నుండి, ఉచ్ఛ్వాస నిశ్వాసములతో జీవనాధారమై యుండును. జీవిని ఇట్లు లోకములో ప్రయాణము చేయించుచున్నది కనుకనే ప్రాణమనబడును. తిన్న ఆహారమును జీర్ణము చేసి మలముత్ర శుక్ర రూపములో క్రిందికి త్రోయునది అపానవాయువు.త్రాగిన వానిని, తిన్నవానిని రక్తముగా, పిత్తముగా, శ్లేషముగా, వాయువుగా (వాతముగా) మార్చి, శరీరమునకు సమానముగా అందజేయునది సమానవాయువు. కంఠ ప్రదేశమున నుండి ముఖమునకు, పెదవులకు, కన్నులకు అదురునట్లు చేయుచు కామక్రోధములను ఉత్తేజ పరచునది ఉదానవాయువు. శరీరమును ఎటూ కావలసిన అటు వంగునట్లు (కదలునట్లు) చేయుచు, కంఠముదాక వ్యాపించియుండి, ఆహార విహారాదులలో ఏమాత్రము తేడా వచ్చినను వ్యాధులు గలిగించునది వ్యానవాయువు. వామనము కలిగించునది నాగావాయువు. కన్నులు తెరచునట్లు చేయునది కూర్మవాయువు.మ్రింగుటలో సహాయపడునది క్రుకరవాయువు. ఇంద్రియములను విజ్రుమ్భించునట్లు చేయునది దేవదత్తవాయువు. ప్రాణఘోషయందు నిలుచుచు, ప్రాణము పొయినను శరీరమును దహనమగు వరకును అంటిపెట్టుకొని యుండునది ధనంజయవాయువు. (చెవులలో వ్రేళ్ళు పెట్టుకున్నచో గుంయి మను శబ్దము వినబడును. అదే ప్రాణఘోషము). సుషుమ్ను నాది శరీరమధ్యమున (వెన్నెముకలో) ఉండును. ఇడానాడి యెడమ భాగములోను, పింగళనాడి కూడి భాగములోను ఉండును. గాలిని పీల్చి పొట్టనుబ్బించుటనే ప్రాణాయామ మందరు. ఇడానాడి ద్వారా గాలిని లోనికి పీల్చుట పూరక మనబడును. ఆ గాలిని శక్తిమేరకు లోపల బందించుట కుంభక మనబడును. పింగళనాడి ద్వారా గాలిని విడుచుట రేచక మనబడును. ఇది ఒక ప్రాణాయామ విధానము. ప్రాణాయామము చెయపొయినను మనము నిత్యము గాలిని పీల్చి వదలుచునే యుందుము. గాలిని పీల్చునప్పుడు ‘సో’ అను శబ్దము వచ్చును. విడుచుచున్నప్పుడు ‘హం’ అను శబ్దము వచ్చును. “సోహం” అనుదానికి “ఆ పరమాత్ముడను నేను” అని యర్ధము. అనగా మనము తెలిసియో తెలియకయో పరమాత్మను నిత్యము స్మరించుచున్నా మన్నమాట. “సోహం” అన్నదానిని తిరుగావేసిన “హంసః” అగును. హంస యనగా పరమాత్మ లేదా పరమాత్మ స్వరూపమైన ప్రాణము. దీనినే హంసగాయత్రి అందురు. గాయత్రి యనగా ప్రాణములను రక్షించునది అని యర్ధము. ఈ పరమార్ధము గ్రహించి (తెలిసికొని) ఎవ్వరీ హంస గాయత్రిని జపింతురో వారికి పునర్జన్మ ఉండదు. “హంస హంసేతి యోబ్రుయా ద్దంసో దేవ స్సదాశివః”.
ప్రణవము (ఓంకారము):     
వేదములు ప్రణవముతో మొదలై ప్రణవముతో ముగియును. ప్రణవము సర్వ వాజ్మయ రూపము. కావున ప్రణవము నభ్యసించవలెను. అకారము ఉకారము మకారములోని అర్ధమాత్రయు గలసి “ఓమ్” అను ప్రణవ స్వరూప మేర్పడినది.అకార, ఉకార, మాకారములు మూడును, మూడు వేదములు, మూడు లోకములు (భూః – భువః – సువః) ‘బ్రహ్మవిష్ణు శంకరులు, సత్వరజస్తమో గుణములు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు, ప్రద్యుమ్న – శ్రీ (లక్ష్మి)  - వాసుదేవ లనెడి అర్చామూర్తులు అని భావింపబడుచున్నవి. ఇట్టి ఓంకార స్వరూపమును దేలిసికొన్నవాడే ముని, తురీయ (4వ) మాత్ర గాంధారి యనబడును. శిరస్స్థానమున నుండును.అది ఘటము నందలి దీపమువలె దేహమధ్యమున హృదయపద్మములో పరబ్రహ్మ జ్యోతి రూపమున ప్రకాశించుచుండును. దానిని నిత్యము జపించుచు ధ్యానించవలెను. ప్రణవము ధనుస్సు. ఆత్మయే బాణము. లక్ష్యము పరబ్రహ్మము. ఉపాసకుడు జాగ్రత్త గలిగినవాడై లక్ష్యమును కొట్టవలెను. కొట్టినచో జీవాత్మ పరమాత్మ దగ్గరకు చేరుటే కాదు. పరమాత్మలో లయమగును. మొదటనే, నామరూప రహితమైన పరబ్రహ్మమును ధ్యానించుట సాధ్యము కాదు. అందుకే విగ్రహారాధన. ఆరూపము మనసులో హత్తుకొన్న తరువాత క్రమముగా జ్ఞాన సిద్దికలుగును. ఆ పైన నిర్గుణ బ్రహ్మో పాసనము సాధ్య మగును. ప్రణవ స్వరూపమైన ఈ ఒక్క అక్షరమే బ్రహ్మము. అదే సర్వశ్రేష్టము అదే అందరకును గమ్యస్థానము. “ఓమిత్యేకాక్షరం బ్రహ్మ”.

భగమన్నామస్మరణ

మారణాయుధం ఉపయోగించిన కొద్దీ ఉపయోగించే వాడి శక్తి తగ్గుతుంది. అందువల్ల త్వరగా నాశనమవుతాడు. కానీ దైవశక్తి (మంత్ర శక్తి) ఉపయోగించిన కొద్దీ ఉపయోగించే వాడి శక్తి పెరుగుతూనే ఉంటుంది. అందువలన చెడు నశిస్తుంది. ఇతని శక్తి రెట్టింపవుతుంది. మొదటిది హింస, రెండోది అహింస. ఆధ్యాత్మికత వలన సమాజము, వ్యక్తి కూడా ఉద్ధరింపబడతారు. సాధన వలన సాధ్యంకానిది లేదు. ఎటువంటి సాధనలు (పనిముట్లు) అవసరం లేకుండానే ఎంతో ఎత్తుకు ఎదగడమే ఆధ్యాత్మికత రహస్యం. శ్రద్ధతో చేసే సాధన వలన మాత్రమే విజయాన్ని పొందగలము.
సాధన : భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని చేసే ప్రయత్నాన్నే సాధన అంటాము. అనగా సంస్కారాల మార్పుకు చేసే తీవ్రమైన ప్రయత్నము భగవంతునికి దగ్గర చేస్తుంది. మానవజన్మ సర్వశ్రేష్ఠమైన సంపద. భగవంతుడిచ్చిన అమూల్యమైన కానుక. మనిషి సృష్టికి శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలము శ్రేష్ఠమైనది, అమూల్యమైనది.
ప్రాణము కొనలేనిది, కొలువలేనిది. కర్మతో జన్మ ఎత్తివచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము. పాప, పుణ్యములే సుఖ, దు:ఖములకు మూలము. తెలుసుకుని చేస్తే సాధన. లేదంటే యాతన.కులము అనగా సమూహము. సామూహిక ప్రయత్నం ప్రధానంగా సాధన చేయడం ఆనందదాయకం. అంత:కరణాన్ని శుద్ధం చేసేది సత్సంగమే. ఒంటరిగా కూడా సాధన చేయడం మంచిది. కర్మలలో శ్రేష్ఠమైనది భగవత్కార్యము.
మనిషి సృష్టికి శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలము శ్రేష్ఠమైనది. అమూల్యమైనది. ప్రాణము కొనలేనిది. కొలువలేనిది. కర్మతో జన్మనెత్తి వచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము.
భగవత్కార్యము : కృతయుగమున తపము, త్రేతాయుగమున జ్ఞానము, ద్వాపర యుగమున యజ్ఞము, కలియుగమున నామముల వలన భగవదనుగ్రహం పొందవచ్చును అని తెలుపబడి ఉన్నది. కలియుగంలో అత్యంత ప్రభావము కలిగినది, సులభమైనది భగవన్నామస్మరణ. దైవం నామాన్ని పదే పదే ఉచ్ఛరించడాన్ని నామ జపము అంటారు.
అసలు ఏ నామాన్ని జపించాలి? భగవంతుడి రూపము ఏది? భగవంతుని నామము ఏది? ఇంతమంది దేవుళ్లలో ఎవరికి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఇంతమందికీ చేయకపోతే ఏమౌతుందో, ఎవరేమనుకుంటారో యిన్ని సందిగ్ధాలతో అయోమయంలో పడిపోయి ఇటూ అటూ పరిగెడుతూ, కాలాన్ని వ్యర్థం చేయనవసరం లేదు. తెలుసుకుంటూ చేసేది సాధన. ప్రయత్నము. మన కోసం మనం చేసేదే రుూ కార్యసాధన. నిశ్చయంగా సత్యస్వరూపుడు, పరమాత్ముడు. భగవంతుడు శ్రీ మహావిష్ణువు. సర్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలనెడి ఐదు విధములుగా వేంచేసియున్నాడు.
వైష్ణవ అవతారతత్త్వము :
1. పరస్వరూపము : శుద్ధ సత్త్వమయమగుటచే కోటి సూర్య ప్రకాశమానమై, వైకుంఠ లోకాలను కల్పవృక్షం కింద రత్న ఖచిత సింహాసనంపై శ్రీ, భూ, నీలా సమేతుడై, నిత్య ముక్తానుభావ్యుడై, నిరతిశయానంద యుక్తుడై వేంచేసియుండు స్వామి -పరస్వరూపము.
2. వ్యూహ స్వరూపము : క్షీరసాగరాన, జగత్సృష్టికి మూలకందమై, జ్ఞానశక్తి, బలైశ్వర్య వీర్య తేజస్సులతో కూడుకొనియుండు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవాది నామాలచే వ్యవహరించబడే భగవత్స్వరూపం -వ్యూహ స్వరూపము.
3. విభవ స్వరూపం : దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ ధర్మసంస్థాపన అప్రాకృత దివ్యమంగళ స్వరూపం తోడనే, ఈ లీలా విభూతికి విచ్చేసి, సకల మనుజనయన విషయాలై యుండు శ్రీరామ కృష్ణాద్యవతారాలు -విభవ స్వరూపం.
4. అంతర్యామి స్వరూపం : నిఖిల ప్రవృత్తి కారకుడై సకల జీవాత్మలయందును పరమాత్మయై అంతర్యామిగా వేంచేసియుండి, సత్కర్మానుష్ఠానాన్ని అనుమతించు స్వరూపమే -అంతర్యామి స్వరూపం.
5.అర్చావతారం : భగవచ్ఛాస్త్రోక్త ప్రకారం శ్రీమూర్తులగల్పించి, యధాశాస్త్రంగా ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో వానిని ఆరాధించే భక్తాగ్రేసరులచే పూజింపబడే భగవానుని దివ్యమంగళ విగ్రహం -అర్చావతారం.

బ్రహ్మ జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనం:

మనిషి పుట్టుక లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం , జన్మను సార్ధకత చేసుకోవడం
బ్రహ్మ జ్ఞానం కావాలి, దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఈ మంత్రం తెలుపుతుంది.
స పర్యగా చ్ఛుక్రమకాయ మవ్రణమ్
అస్నావీరమ్ శుద్ధమపాపవిద్ధమ్ |
కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూః
యాథాతథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః ||
ఎవడైతే బ్రహ్మ జ్ఞానం పొందుతాడో వాడు బ్రహ్మన్(పరమాత్మ) స్థాయికి చేరుతాడు. ఆ స్థితి ఎలా ఉంటుందో తెలుపుతుంది ఈ మంత్రం. బ్రహ్మన్ అంటే పరమాత్మ, ఆయన "చ్ఛుక్రమ్"- పరిశుద్ధమైనవాడు, స్వచ్చమైన వాడు. జీవుడు ముక్తి పొందాక కర్మ తొలగి ఇలాంటి స్థితిని పొందుతాడు. పరమాత్మ దయ వల్లే ఇది లభించాలి తప్ప మరొక మార్గం లేదు. "అకాయమ్" - ఆయన దేహం లేనివాడు, అంటే మన వంటి మురికి స్రవించే పాంచభౌతిక దేహం కాదు, ఆయనది పంచ ఉపషణ్మయ దివ్య మంగళ స్వరూపం . "అవ్రణమ్" - రోగాలు, వ్యాదులు అంటని శరీరం. "అస్నావీరమ్"- ప్రేగులు నరాలు ఉండే దేహం కాదు. కనుక "శుద్ధమపాపవిద్ధమ్" ఆయన దేహం పాప పుణ్యాలకు అతీతమైనది. పరమాత్మ తత్త్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడూ అట్లాంటి స్థితినే పొందుతాడు. వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు దర్శించగలుగుతాడు. కర్మ తొలగుతుంది కాబట్టి అట్లాంటి స్థితి ఏర్పడుతుంది, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరానికి హద్దులు ఎన్నో. మనం కంటితో అన్నింటినీ గుర్తించగలమా ? మన ఇంద్రియాలకు, ఊహకు ఉన్న శక్తి సంకుచితమైనది. ముక్తి పొందిన జీవుడికీ పరమాత్మ వలె జ్ఞానం అంతటా విస్తరించి ఉంటుంది. సూక్షమైన జ్ఞానం కలిగి ఉంటాడు. వాడు జ్ఞానం కోసం తపిస్తూనే ఉంటాడు. వాడి మనస్సు పూర్తి నియంత్రణలో ఉంటుంది. వాడికీ కోరికలు ఉంటాయి, కానీ అవి పరమాత్మ మయమై ఉంటాయి. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంటుంది. వాడికీ కోపం ఉంటుంది, ఇతరత్రమైన విషయాల యందు. అట్లాంటి వాడికి మరణం అనేది ఉండదు, ఆ స్థితినుండి దిగజారడం అనేది ఉండదు. కర్మ బంధాలు తొలగి భగవత్ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు.

అరిషడ్వర్గాలు అని వేటిని అంటారు? వాటిని ఎలా అదుపులో ఉంచాలి :

అరిషడ్వర్గాలు అని వేటిని అంటారు? వాటిని ఎలా అదుపులో ఉంచాలి :



 అరిషడ్వర్గాలు అంటే కామ,క్రోధ,లోభ,మహ,మద మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనషిని ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గాలె. ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఈ అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం.
1.కామము – కామము అంటే కోరిక. ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.
2. క్రోధము – క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.
3. లోభము – లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.
4. మోహము - తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.
5. మదము – మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.
6. మాత్సర్యము - తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.

అరిషడ్వర్గాలను అంటే ఏమిటో తెలుసుకున్నాము. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి (లేక అదుపులో ఉంచడం) అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని జ్ఞానం ఎపుడు పొందుతామో (తెలుసుకుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి.

నవవిధ భక్తీ మార్గాలు (Nine discipline of BHAKTHI are) :

నవవిధ భక్తీ మార్గాలు (Nine discipline of BHAKTHI are) :




భగవంతునిని చేరేందుకు అంటే ఆ పరమాత్మలో ఐక్యమయ్యేందుకు సాయిబాబా తెలిపిన మార్గాలే ఈ నవవిధ భక్తీ మార్గాలు. ఈ నవవిధ భక్తీ మార్గాలలో దేనినైన సరే ఒకదానిని తీసుకొని సరిగా అవలంబిస్తే ఆ పరంధామున్ని చేరడం ఖాయమని ఆయన ఎన్నో సార్లు అయన తన భక్తులతో వివరించారు.
సాయిబాబా తన భక్తులతో ఈ విధంగా చెప్పాడు. “భగవంతుని అనుగ్రహము సంపాదించే నవవిధ భక్తి మార్గాలను  తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృప్తి చెంది ఆ భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. నవవిధ భక్తి మార్గాలు అంటే ఏవో కాదు. i.శ్రవణము ii.కీర్తనము iii.స్మరణము iv.పాదసేవనము v.అర్చనము vi.నమస్కారము vii.దాస్యము viii.సఖ్యత్వము ix.ఆత్మనివేదనము.”


1. శ్రవణము : listening to his exploits – శ్రవణము అంటే భగవంతుని గురించి మరియు ఆయన లీలావిషేసాల గురించి వింటూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికతో గడపడం. 
2. కీర్తనము : chanting his name and reciting hymns in his praise – కీర్తనం అంటే భగవంతుని గురించి ఆయన తత్త్వం గురించి కీర్తించడం అంటే ఆయనే ఈ సమస్త లోకాలకు పాలకుడు అని ఆయన నామాన్ని కీర్తిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికతో గడపడం.
౩. స్మరణము : remembering him – స్మరించడం అంటే ఆ దేవదేవుడిని నిరంతరం మన మనస్సులో స్మరిస్తూ సంపూర్ణంగా అధ్యత్మికతో జీవించడం.
4. పాదసేవనము : serving his lotus feet – పాదసేవనం అంటే ఆ భగవంతునికి నిర్మలమైన మనస్సుతో నువ్వు సమర్పించే ప్రతిది ఆయన పాదాలకు సమర్పించడం.
5. అర్చనము : worshipping him – అర్చనము అంటే నువ్వు చేసే ప్రతి పనిని ఆయనకు సమర్పిస్తూ ఉండడమే. దీనినే భగవంతునికి అర్చన చేయడం అంటారు.
6. నమస్కారము : praying obeisance to him – నమస్కారము అంటే భగవంతునిని సంపూర్ణంగా మనస్పూర్తిగా నమస్కరించడం. ఆయనను మనసార ప్రార్ధించడం. 
7. దాస్యము : practicing the role of his servant – దాస్యము అంటే భగవంతుడు ఒక అధికారిగా నువ్వు ఆయన సేవకుడిని అని భావిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికంతో గడపడం. 
8. సఖ్యత్వము : looking upon him as an intimate friend – సఖ్యత్వము అంటే ఆయన నీకు ఒక మిత్రుడుగా భావిస్తూ నీకు మరియు ఆయనకు ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకొని జీవించడం.  
9. ఆత్మ- నివేదనము : surrending oneself totally to him – ఆత్మ నివేదనము అంటే సంపూర్ణ శరణాగతి అంటే సమస్తము నువ్వే నాది అంటూ ఏది లేదు అని జరిగే ప్రతిది నీ మూలంగానే జరుగుతుందని, నీకు నువ్వు సంపూర్ణంగా శరణాగతి కావడమే.
ఈ విధంగా మనం సాయిబాబా చెప్పిన నవవిధ భక్తి మార్గాలను  తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల మనలను ఆయన తన దగ్గరికి చేర్చుకుంటాడు.

అంతరాత్మ దర్శనం ఎందుకు?


వాస్తవ ప్రపంచం (the material world) లో తప్పు చేసేవాడొకడు. దాని మూలంగా బాధపడేవాడొకడు ,దాని గురించి ఫిర్యాదిచ్చేవాడొకడు, బందించి తీసుకేల్లెవాడొకడు ,కాపలాకాసేవాడొకడు, బోనులో నిలబెట్టేవాడొకడు, ప్రశ్నలడిగేవాడొకడు, సాక్ష్యం చెప్పేవాడొకడు, తీర్పిచ్చేవాడొకడు, దాన్ని అమలు పరిచేవాడొకడు – అని ఇంతమంది ఉంటారు.
అంతిమ సత్య ప్రపంచం (the world of ultimate truth) లో మాత్రం ఇంతమంది ఉండరు. అక్కడ నీకు నువ్వే ముద్దాయివి. నీకు నువ్వే బాధితుడివి. నీకు నువ్వే ఫిర్యాదివి. నీకు నువ్వే రక్షకభటుడివి. నీకు నువ్వే చెరసాల అధికారివి. నీకు నువ్వే ప్రాసిక్యూటరువి. నీకు నువ్వే డిఫెన్సు లాయరువి. నీకు నువ్వే సాక్షివి. నీకు నువ్వే న్యాయమూర్తివి. అక్కడ నువ్వు తప్ప నీకింకెవ్వరు కనిపించరు. అదొక ఒంటరి లోకం.అందుచేత అది ప్రపంచంలోకెల్లా అత్యంత క్రూరమైన న్యాయస్థానం.
నూటికి 99.99 శాతం మంది మనుషులు (మనస్సులు) దాన్ని బ్రతికిఉండగా face చెయ్యలేరు. జరిగిన సంఘటనల తాలూకు గుప్తమైన స్మృతులు చిత్రాలు (దృశ్యాలు) గా మనస్సు యొక్క లోలోపలి పొరల్లో నుంచి సర్వసమగ్రంగా వెలికి తియ్యబడుతాయి. ఆ గుప్తమైన చిత్రాలు (సంఘటనలు) గుర్తుకు రావడానికి చిత్రగుప్తుడని పేరు.
దేవుడు లేడనవచ్చు. శాస్త్రాలు అబద్దమనవచ్చు. కాని తానున్నాడు. తాను మాత్రం అబద్దం కాదు. తానూ కుట్ర కాదు. తానూ నిజం. అందుకే చేశాడు పరమాత్మా ఏర్పాటు. ఆ ఒంటరి నిర్జయ న్యాయస్థానం. అక్కడ న్యాయ సూత్రాలంటూ ఏమి ఉండవు. నీకు నువ్వు ఏర్పరచుకున్న చట్టం ప్రకారమే నువ్వు విచారించబడతావు. నువ్వు గతంలో ఇతరులకు చెప్పిన నీతుల్ని బట్టి నువ్వు కూడ విచారించబడతావు. నువ్వు బతికుండగా ఎంత పండితుడవైతే అంతా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది నీమీద జరగబోయే విచారణ. నిన్ను నువ్వే దర్యాప్తు చేస్తావు. కర్కశంగా దర్యాప్తు చేస్తావు.
నువ్వంటే నువ్వు కాదు. నీలో ఉన్న అంతరాత్మ చేస్తుంది. అందుకే దానికి ఆ పక్షపాత రహిత ధోరణి. ఆ నిస్వార్ధం. అది ప్రపంచానికి నిజమైన ప్రభుత్వం. అది తప్పొప్పుల విచారణలో బహుక్రూరమైనది. మానవ మనస్సులా అది తన్ను తానూ మోసం చేసుకోదు. మానవ మనస్సు మొద్దబ్బాయిలాంటిది. తప్పించుకోవడానికి అడ్డదార్లు వెతికే ఖైదీలాంటిది. దేవుడికే లంచమిద్దామని ఆలోచిస్తుంది. కాని ఆ న్యాయమూర్తి (అంతరాత్మ) లంచం తీసుకోడు. తనకు లంచంగా ఇవ్వజుపిన వాటిని భద్రంగా దాచిపెట్టి శిక్షాకాలం పూర్తయ్యాక ఖైదీకే వడ్డీతో సహా అప్పగిస్తాడు. వీటికి వేరు వేరు ఖాతాలు నిర్వహించబడుతాయి. ఒక ఖాతా ప్రాతిపదిక మీద ఇంకో ఖాతా రద్దయ్యే ప్రసక్తే లేదు. ఆ అంతరాత్మ ఎవరో కాదు. స్వయంగా నువ్వే. అక్షరాల నువ్వే. ముమ్మూర్తులా నువ్వే. కాని లక్షలాదిమంది ఈ సత్యాన్ని తాము బ్రతికుండగా గ్రహించజాలరు. ఇదొక పార్శ్వం.
ఒకవేళ బతికుండగానే గ్రహించగలిగితే ? అది అసంభవం కాదు. నూటికో కోటికో ఒక్కరు మాత్రమె ఉంటారు అలాంటివాళ్ళు. వాళ్లకు అంతరాత్మ గ్రాంధిక భావన (bookish concept) కాదు. కాలు చెయ్యి ఉండడం ఎంత నిజమో అంతే వాస్తవంగా వాళ్ళు దాన్ని అనుభవిస్తారు.
సాధారణంగా మోక్షం పొందడానికి ఎవరైతే తపన పడతారో, ఎవరైతే భగవంతుడి(ఆత్మ) దర్శనం కోసం తాపత్రయ పడతారో, వారికి అంతరాత్మ దర్శనం కలుగుతుంది. అంతరాత్మ దర్శనమిచ్చినప్పుడు మనిషి దిగ్భ్రాంతి చెందుతాడు. ఎందుకంటే ఆ మహా మహనీయ తేజోమూర్తి దర్శనం మన పరిభాషలో వర్ణింప సఖ్యం కానటువంటిది. ఆ భగవత్ స్వరూపం తానే అని తెలుసుకోవడం వల్ల దిగ్భ్రాంతి చెందుతాడు, ఎంతో గగుర్పాటుకు లోనవుతాడు.
ఆ అంతరాత్మ దర్శనం ముగిసిన తరువాత తిరిగి మరల ఈ లోకంలోకి వచ్చినపుడు ఒకరకంగా మానవుడు దుఃఖిస్తాడు. ఎందుకంటే “లక్షల కోట్లాది సంవత్సరాల వయసు గల ఆ సనాతన ధర్మమూర్తి నువ్వేనా స్వామి? నువ్వు అసలు లేనే లేవనుకున్నాను. ఇంతకాలమూ ! కృష్ణుడు రాముడు అల్లా జీసస్ అంతా బోగస్ అనుకున్నాను స్వామి ! నిన్నిక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నాను ! నాలోనే ఉన్నావని తెలుసుకోలేకపోయాను స్వామి !”.
ఆ దేవదేవుడైన అంతరాత్ముడి దర్శనం పొందిన తర్వాత తానూ వేటికి భయపడదు సరికదా పాపాలకు పడే శిక్షల నుండి తప్పించుకుందామనే ఆలోచన శాశ్వతంగా అంతరించిపోతుంది. తండ్రి మాట మీద బడికి వెళ్ళడానికి సిద్ధమయ్యే బుజ్జి కొడుకులా తప్పులకు శిక్ష అనుభవించడానికి ఆనందంగా సిద్దపడుతాడు. ఈ దర్శనంతో క్రూరమైన, ఒంటరి, నిర్మానుష్య న్యాయస్థానం అనుకున్నది కాస్తా హఠాత్తుగా నాన్నగారి ఆఫీసులా మారిపోతుంది. ఇది ఇంకో పార్శ్వం.  
అలా ఆ పరమాత్ముడి దర్శనంతో అన్నీ (సమస్తం) పటాపంచలు. అది కలిగాక వెయ్యి నాస్తిక(అంటే దేవుడే లేడు) గ్రంధాలు చదివినా ఏ మార్పు ఉండదు. లక్షమంది నాస్తికుల మధ్య ఉన్న ప్రభావం ఉండదు. అందరిలోనూ తానే కనిపిస్తాడు అంటే అంతటా తను తన అంతరాత్మనే దర్శిస్తాడు. ఆ స్థితిలో మనిషి మెయిన్ రోడ్డు మీద పడి సాష్టాంగ నమస్కారాలు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అంతా అంతరాత్మే. స్కూటర్లు, కార్లు, బస్సులతో సహా మనుషులంతా నావాల్లె, అంతా నేనే అనిపిస్తుంది. ఆ స్థితిలో అతడు తనని తానే పూజించుకునే సంభావ్యత కూడా వుంది.

శివునికి ప్రత్యేకించి శివలింగంగా పూజించడంలో ప్రత్యేకత ఏమిటి?

శివునికి ప్రత్యేకించి శివలింగంగా పూజించడంలో ప్రత్యేకత ఏమిటి?



 దీని గురించి శివ పురాణాదులలో, శైవాగమాలలో వివరణ ఉంది. వాటిని మాత్రమే గ్రహించాలి. కొన్ని శివేతర గ్రంథాలలో జొప్పించిన కల్పనలను గ్రహించి, హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయడం శోచనీయం. అలాంటి అవాకులూ, చెవాకులు వల్ల విదేశీ కుతూహలశీలురు శివలింగం గురించి నీచాభిప్రాయాలని వెలిబుచ్చారు కూడా. కానీ ఆ రోజుల్లో స్వామీ వివేకానంద దానికి గట్టి సమాధానమిచ్చారు. యఙ్ఞంలో యూపస్తంభమే శివ లింగంగా భావించవచ్చు... అని చెప్పడం వారి సమాధానాలలో ఒకటి. మన శాస్త్రాల హృదయం ప్రకారం శివలింగ తత్త్వమేమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహా విఙ్ఞానాంశాలు గోచరిస్తున్నాయి.
లీనం చేసుకునేదే లింగం: చరాచర జగతి ఎవరియందు కలిగి, పెరిగి, తిరిగి లీనమవుతుందో అదే లింగం. ఆ లీనం వల్లనే సృష్టికి శక్తి, ఉనికి, మనుగడ లభిస్తున్నాయి.
ఆ ఈశ్వరుడు ఆకారాది రహితునిగా భావిస్తూ, ఒక సంకేతంగా గ్రహిస్తే.. ఆద్యంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకయే లింగం. అందుకే జ్యోతిర్లింగం అన్నారు.
మనలోని ఐదు ఙ్ఞానేంద్రియాలూ, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు.. వెరసి పన్నెండు స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది. ఆ ఈశ్వర జ్యోతియే ఆ పన్నెండు చోట్ల ఉన్నదనే ఎరుకయే .. పన్నెండు జ్యోతిర్లింగాలను మనలో దర్శించడం. అప్పుడు మన అణువణువూ శివమయమనే భావన నిలచి `శివోహ ' మనే సత్యాన్ని స్థిర పరచుకోగలం.
యోగపరంగా..దేహంలోని మూలాధారం నుండి, సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం. ఇదే శ్రీ చక్రంలోని బిందు స్థానం. ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీత (స్తంభాకృతి)గా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలోని దర్శనం.
ఒక దీపజ్యోతిని వెలిగించితే, అది అన్ని దిక్కుల కాంతిని ప్రసరిస్తున్న లింగాకృతిగానే దర్శనమిస్తుంది. అదే ఆకారాతీతమైన చైతన్య జ్యోతిర్లింగం.
 `లోకం లింగాత్మకం ఙ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమం చెప్పింది. లోకమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి ' అని తాత్పర్యం. లింగ గర్భం జగత్సర్వం.. జగమంతా లింగంలోనే ఉంది. విచిత్రమేమిటంటే..కొద్ది ఏళ్ళ క్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విఙ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు. అద్భుతం..అది మన వేద విఙ్ఞానం వర్ణించినట్లు ఒక గోళా(అండా)కృతిలో ఉన్న కాంతిపుంజ మధ్యంలో సమస్త గ్రహ నక్షత్రాదులన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని యుగాల క్రితం తపశ్శక్తితో గ్రహించి, లింగాకృతిని సంభావించి, విశ్వచైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా, లింగ ధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు నమోవాకాలు.

ఏమయ్యా నీ హిందూ మతం లో ఇంతమంది దేముళ్ళ?

ఏమయ్యా నీ హిందూ మతం లో ఇంతమంది దేముళ్ళ?


ఏమయ్యా నీ హిందూ మతం లో ఇంతమంది దేముళ్ళ ?? మిగతా మతాలలో ఒక్కడే దేముడు ?? నీ మతం లో ఎవరిని పూజించాలి ???
మొదట మీరు వేద సారాన్ని అర్ధం చేసుకోవాలి , వేదాలలో చాల స్పష్టంగా చెప్పేరు, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు నిరాకారుడు ( ఆకారము లేనివాడు ), మహా శక్తీ వంతుడు. అవును భగవంతుడు ఆకారము లేనివాడు అందుకే వివిధ రూపాలలొ ఉంటాడు.
పాము రూపములొ ( నాగేంద్రుడు)
నంది రూపములొ ( నందీశ్వరుడు ).....మొ ||
హిందూ మతం అంటే ప్రకృతిని పూజించే మతం. అంటే భగవంతుడిని వివిధ ప్రకృతి రూపాలలొ పూజిస్తాము. భగవంతుడు( శక్తీ ) ఒక్కడే . నీవు ఏ రూపమున పూజించిన ఆ మహా శక్తీ నే పూజిస్థావు . ఆ భగవంతుడు కూడా, భక్తుడి వైన నీ అభీష్టం మేరకే, నీవు పూజించిన రూపములొ నీకు సాక్షాత్కరిస్తాడు.
భగవంతుడు అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తీ.
శక్తీ ని నువ్వు కళ్ళతో చూడలేవు, సైన్స్ కుడా ఇదే చెపుతోంది. సైన్స్ లో శక్తీ కి నిర్వచనం
"శక్తీ ని సృష్టించలేము, నాశనము చేయలేము, శక్తీ ఒక రూపములొ అద్రుస్యమయి, మరొక రూపములొ ప్రత్యక్షమవును" ఇది సైన్స్, శక్తీ కి ఇచ్చిన నిర్వచనము.
హిందూ మతం లో, మిగతా మతాల లాగ ఏదో 2 కర్రల్లో దేముడు ఉన్నాడని చెప్పలేము.
 " భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పేదే హిందూ మతం. "
భగవంతుడు మనిషి లో ఉన్నాడు అని చెప్పుతం, అదే వామనావతారం
భగవంతుడు పక్షి లో ఉన్నాడు అని చెపుతాము అదే, గరుడ దేముడు.
గాలి, వాయుదేముడు. ఇలా భగవంతుడు ప్రకృతి అంతా ఆవహించి ఉన్నాడు. ప్రకృతి లో ఉన్న ప్రతి ప్రాణి లో భగవంతుడు ఉన్నాడు. కేవలం మనిషి లో, మనిషి రూపములో దేముడు ఉన్నాడు అనటం మూర్ఖత్వమ్.

ఆత్మహత్య చేసుకోరాదు....ఎందుకు? (ఆధ్యాత్మికంగా మరియు సాధారణంగా) :

ఆత్మహత్య చేసుకోరాదు....ఎందుకు? (ఆధ్యాత్మికంగా మరియు సాధారణంగా) :


మన దేశంలో ఈ మధ్య కాలంలో ఆత్మ హత్యలు చేసుకోవడం మరీ ఎక్కువైపోతుంది. దీనికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంది. కారణం ఏదైనా కావచ్చు కాని, ఆత్మ హత్యకు దారి తీసేంత కారణం ఏదియును ఈ ప్రపంచంలో లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారాన్ని తెలుసుకోలేకే ఆత్మ హత్యకు పాల్పడుతున్నారు. కొందరైతే మరీ చిన్న చిన్న విషయాలకు కూడ ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు అంటే ప్రేమ గురించి అనో, భార్య భర్తల మనస్పర్ధలు అనో, తల్లి తండ్రులు అరిచారి అనో లేక వాళ్ళు ఏదైనా అడిగితె కొనివ్వలేది అనో ఇలా చిన్న చిన్న విషయాలకు కూడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆత్మ హత్యని ప్రభుత్వాలు కూడ నేరంగనే పరిగనిస్తాయి. ప్రభుత్వాలే కాకా అన్ని మతాలు కూడ పాపంగా పేర్కొని నిర్ద్వంద్వంగా నిషేదించాయి కూడ. చివరికి నాస్తిక మతాలైన బౌద్ద మరియు జైన మతాలూ సైతం ఆత్మహత్యను ఖండించాయి.
ఆత్మ హత్య చేసుకోవద్దు అనే చెప్తున్నారు కాని ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు మంచిది కాదో ఎప్పుడు ఎవరు సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. అందుకే బహుశ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువై పోతున్నాయి ఈ ఆత్మ హత్యలు.
ఏదో ఒక సందర్భంలో ‘మనిషికి ఇంకేంటి దిక్కు ,ఆత్మహత్య తప్ప?’ అన్న శిష్యుడితో వివేకానంద స్వామి “అందుమూలముగా ఇంకా కీడు మూడుతుంది. అలాంటి ఆలోచనే చేయొద్దు”. అని వివరించాడు.
నిజానికి చెప్పాలంటే ఎవరి బతుకు వారు బతకడానికి ఉన్న హక్కు ఎవరి చావు వారు చావడానికి లేదా? ఎవరి శరీరం వారిది. దానికి వారు అన్నం పెట్టుకుంటారు. లేదా మానుకుంటారు. కావలిస్తే చంపుకుంటారు. మనకెందుకు? మతాలకెందుకు? ప్రభుత్వాలకెందుకు? అని కొందరు ప్రశ్నిస్తారు కూడ.
ఇది నిజమేనా? ఎవడి బతుకు వాడిదేనా? మనిషికి తన జీవితం మీద అంతులేని స్వయం నిర్ణయాధికారం నిజంగానే ఉందా? ఇవి అన్నియు మనం తెలుసుకోవాలి.
నీకు ఒకదానిమీద స్వత సిద్దమైన అధికారం ఏర్పడాలంటే నీ సొంత సంకల్పంతో, నీ ప్రతిభతో, నీ వనరులతో నువ్వు దాన్ని నిర్మించి ఉండాలి. మానవుడి జీవితం అలా మొదలైందా? నీ పుట్టుక నీ తల్లిదండ్రుల జీవితంలో జరిగిన ఒక యాక్సిడెంట్. వాళ్ళు కూడ నీ పుట్టుకకు ముందస్తుగా ఒక ప్రణాళిక రచించి ఉండలేదు. నువ్వెవరో వాళ్లకు తెలియదు. వాల్లెవరో నీకు తెలియదు. పుట్టాక మీరు ముగ్గురు పరిచయం అయ్యారు. నీ పుట్టుక నీ సంకల్పంతో జరిగింది కూడ కాదు. అది నీకు స్పష్టంగా తెలుసు. పోనీ నీకు అంతా తెలివితేటలు ఉన్నాయా? నీ పళ్ళు తోముకునే పళ్ళపొడి కూడ నువ్వు తయారుచేసుకోలేవు. అది కూడ వేరే ఎవరో తయారుచేసి నీకు అమ్మాలి. ఇంకా ఏకంగా శరీరాన్నే నిర్మించుకోవడమా ? ఎంతమాట? నీ సంకల్పంతో ఏదైనా అయ్యేదుంటే ఇలా ఎందుకు పుట్టడం? సూపర్ మ్యాన్ లా పుడతావు. బాల్యం, యవ్వనం ముసలితనం మరియు చావు అనేవి ఏవి లేని ఒక ఉత్కుతునక లాంటి వజ్రదేహాన్ని నిర్మించుకుంటావు. మరేది? ఏది నాయన! చెప్పు, ఎక్కడుంది నీకు స్వేఛ్చ?
కనుక ఈ శరీరం నీది కాదు. ఈ ప్రపంచం కూడ నీది కాదు.’నీది’ అనుకుంటున్న దేది నీది కాదు. నువ్వు పుట్టకముందే ఈ ప్రపంచం ఉంది. నువ్వు మరణించాక కూడ ఇది ఉంటుంది. వీటన్నిటికి సుప్రీమ్ బాస్ వేరే ఒకరు ఉన్నారు. ఆయనకు దేనితోను సంబంధం లేదు. కాని ఆయనది ఉక్కు పిడికిలి. ఉడుంపట్టు. ఆయన ఆగ్రహం, అనుగ్రహం రెండు ప్రచండమైనవే. నీ శరీరం, నీ జీవితం రెండు కూడ ఆయన ఆస్తి అయివుండగా దాన్ని ఆయన అనుమతి లేకుండా ద్వంశం చేసే హక్కు నీకెవరిచ్చారు? నీ శరీరం ఒక అద్దె కొంప. దానికి నువ్వు చెల్లించాల్సింది అద్దె – దాని యజమానిని రోజు తలచుకోవడమే. కిరాయిదారు తన ఇంటిని బాంబులు పెట్టి పేలుస్తానంటే యజమాని ఒప్పుకుంటాడా ? అక్షరాలు దిద్దుకోమని రాసిచ్చిన పలకని నేలకేసి పగలగొడితే తండ్రి ఊరుకుంటాడా? “నా ఇల్లు, నా పలక నా ఇష్టం” అని వాదించగలవా?
భగవంతుడు తన సృష్టిలో మనిషికి స్వేఛ్చ అంటూ అనుమతించి ఉంటె అది అత్యంత పరిమితం.ఒక త్రాటితో ఒక ఆవుని కట్టేసినపుడు ఆ తాడు ఎంత వ్యాసార్ధాన్ని ఏర్పరచగాలదో అంతా పరిధిలో మాత్రమే ఆ ఆవు మెయ్యగలదు. మనిషికి కూడ దేవుడిచ్చిన స్వేఛ్చ ఇలాంటిది. కాని మనిషి గొప్పతనమేమిటంటే ఈ కొద్దిపాటి స్వేచ్ఛతోనే అంతులేని పాపాలు చెయ్యగలగడం. దానవుడవుతాడు మనిషి దైవాన్ననుకున్నప్పుడు. మనిషికి దేవుడు కొంతలో కొంత స్వేఛ్చ ఇవ్వకపోలేదు. అది కూడ ఇచ్చి ఉండే వాడు కాదు. కాని మోక్షం సంపాదించుకోవాలంటే ముందు జ్ఞానాన్ని ఆర్జించుకోవాలి కనుకా, స్వేఛ్చ లేకపోతె జ్ఞానానికి అర్ధం లేదు కనుకా ఆ మాత్రం ఇవ్వక తప్పదని భావించి ఇవ్వడం జరిగింది.               
ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంటున్నాడని సర్వజ్ఞుడైన దేవుడికి ముందే తెలియదా? అటువంటప్పుడు మనిషి బాధ్యత ఏమిటి? అందుకు అతన్ని పాపిని చేసి మాట్లాడడం ఏంటి? అని కొందరనుకుంటారు. మనిషి జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి గ్రహసంయోగాల్ని పేర్కొంటున్న జ్యోతిశాస్త్రం ఆత్మహత్యకు సంబంధించి మాత్రం నీళ్ళు నములుతుంది. మనిషి పుట్టకముందే దేవుడు రాసే నొసటిరాత గురించి మాత్రమె జ్యోతిశ్శాస్త్రం మాట్లాడగలదు అని చెప్తారు. ఆ రాతలో లేనిది జాతకంలో కనిపించదు. జాతకాల్లో గండాలు, ప్రమాదాలు ఉంటాయి తప్ప ఆత్మహత్యలు ఉండవు అని చెప్తారు.
“పో! భూలోకంలో పుట్టి ఆత్మ హత్య చేసుకో” అని ఎవరికీ నొసటిరాత రాయడు దేవుడు. అలా రాసేవాణ్ని మనం దేవుడు అనం. ఆత్మహత్య అనేది మనిషి తనకివ్వబడిన స్వేచ్చని దుర్వినియోగ పరుస్తూ దైవాన్ని ఎదిరిస్తూ తన యొక్క ఆకస్మికమైన స్వసంకల్పంతో కర్మ ఫలంపై తీసుకునే నిషిద్దమైన చనువు.
పసిబిడ్డ హృదయం గల భగవంతుడు అలుపు-సొలుపు లేని ఆశావాది. మనుషులు ఎంతగా పతనమవుతున్నా వీళ్ళంతా ఎదో ఒక రోజు బాగుపడుతారు అనే ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కొద్దిమంది కొద్దిసేపు బాగుపడ్డా సరే ! ఆ అల్పసంతోషి సంతృప్తి చెందుతూ వాళ్ళ కోరికలు తీరుస్తూ ఎదురు చూస్తాడు. అయితే ఆత్మహత్య ఒక మనస్తత్త్వం ఏమి కాదు. అదొక క్షణిక ప్రేరణ.    
మనిషికి శరీరంలో ఒక మెదడుందని మనమందరం అనుకుంటాం. కాని వాస్తవానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మెదడుంది. ఆ మెదల్లన్ని ఒక కేంద్ర మెదటికి లోబడి పనిచేస్తూ ఉంటాయి. తద్వారా కేంద్రమెదటికి (పరమాత్మస్వరూపమైన) జీవాత్మ అధిస్టానమైనట్లు ఆయా చిరుమెదళ్ళకు కూడ వేరువేరు అధిష్టాన దేవతలు ఉంటారు. ఆయా అధిష్టానదేవతలు ఆయా అవయవాల్లో నిత్యనివాసం చేస్తారు. వాళ్ళు మనిషి పుట్ట్టకముందే దైవాదేశం మేరకు అతని/ఆమె అవయవాల్లో తిష్టవేస్తారు. వాళ్ళని భౌతిక శరీరంలో కాక అందులో ఉన్న సూక్ష్మ శరీరంలో మాత్రమె దర్శించగలం. ఆ కారణం చేతనే “దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః” (ఈ దేహమే పవిత్రమైన దేవాలయం. ఇందులో నివసించే జీవుడే నిత్యుడు, సత్యుడు అయిన సనాతన భగవంతుడు) అని మన పూర్వికులు మొత్తుకున్నది. అలాగే చావు సమీపించినపుడు దైవాదేశం మేరకు ఆయా దేవతలు (జీవశక్తులు) తమంతట తాముగా శరీరాన్ని విడిచి వెళతారు. కాని వారు మృతశరీరంలోని పంచభూతాల్లాగ చెల్లాచెదురు అవరు. వారు సూక్ష్మ శరీరాన్ని లోకాంతరాలకు తరలిస్తారు. దాంతో పాటే ఉంటారు. అవి గతజన్మలకు చెందిన పాత కర్మఫలాల యొక్క, జ్ఞాపకాల యొక్క దస్తావేజుల్ని జన్మ నుంచి జన్మాంతరానికి మోసుకేల్తారు.    
నిజానికి జన్మ ఎత్తెది ఆత్మ కాదు, సూక్ష్మ శరీరమే. మనుషులు మేల్కొన్న స్థితిలో “నేను-నాది” అని వ్యవహరించేది కూడ దాన్నే. జనం దాన్ని ‘ఆత్మ’ అని వ్యవహరించడం కేవలం భ్రమప్రమాదజనితం. శుద్దపోరపాటు మాత్రమె. ఆత్మస్థితిలో “నేను-నాది” ఉండవు. ఆత్మకు జన్మలు, చావులు, సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు, శుభాశుభాలు, దేశకాలాలు ఏమి లేవు. అది ఒక దేహానికీ, ఒక మతానికీ, ఒక లోకానికీ పరిమితం కాదు. జీవులు-జడాలు, కుర్చీలు-బల్లలు, రాయి-రప్ప, చెట్టు-పుట్ట అన్నింటిలోను ఉండే సర్వాతీత సర్వాంతర్యామి ఆత్మ. అది అస్తిత్వానికే అస్తిత్వం. దానికే దేవుడని నామాంతరం.
ఎందుకు చెబుతున్నానంటే – ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు తమ శరీరంలోని అధిష్టాన దేవతల్ని అకాలంగా బలవంతంగా వెళ్ళగొడతారు. దైవాదేశం లేకపోవడం చేత ఆ దేవతలు వెళ్ళడానికి ఇష్టపడరు. కాని నశించిపోతున్న శారీరంలో ఉండడం సాధ్యపడదు. సదరు దేహం సహజంగా నిర్ణీత సమయానికి పతనమయ్యేటప్పుడు దాని పాత ఫైళ్ళని సజావుగా ప్రశాంతంగా ఇంకో జన్మకి బదిలీ చెయ్యడానికి వాళ్ళు నియమించబడ్డారు. ఆ ఫైళ్ళలో గతజన్మల పాపాలు, పుణ్యాలు, జ్ఞాపకాలు, వాటికి నిర్ణయించబడ్డ ఫలితాలు అన్నీ ఉంటాయి. దైవద్రోహియైన జీవుడితో కలిసి ఉండడానికి వాళ్ళకిష్టం లేకపోవడంతో ఆ ఫైళ్ళు పట్టుకొని వాళ్ళు తమ లోకాలకు తాము వెళ్ళిపోతారు. తిరిగి దైవాదేశం వచ్చేదాకా శారీరంలో ప్రవేశించడానికి వాళ్ళు సాహసించరు. ఇంక మిగిలేది ఏమిటి? అంటే ఏ అధిష్టాన దేవతలు లేనటువంటి పాడుబడ్డ దేవాలయంలాంటి దైవద్రోహపు సూక్ష్మశరీరం. అధిష్టాన దేవతలు గతం తాలూకు అన్ని ఆనవాళ్ళు తమవెంట తీసుకెళ్ళిపోవడంతో జీవి తన సర్వాస్వాన్ని పోగొట్టుకొని రోడ్డున పడ్డ పరమబికారి దివాలాకోరులా మారిపోతాడు/మారిపోతుంది. దేవుడికి దూరమైపోవడం మాట సరేసరి. అంతకుముందు జన్మల్లో చేసిన అమూల్యమైన మహోజ్జ్వలమైన పుణ్యఫలాలను అన్నియు రద్దు అయిపోతాయి. అదొక భయంకరమైన పరిస్థితి. కొట్లలో మీరు డిపాజిట్లు పెట్టిన బ్యాంకు ఆకస్మికంగా ముతపడి పోయాక దాన్ని తిరిగి ఎప్పుడు తెరుస్తారో మీ డబ్బు మీకెప్పుడు చేతికందుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడితే మీ అవస్థ ఎలా ఉంటుందో యోచించండి.   
బతికున్న రోజుల్లో సంపాదించుకున్న పుణ్యఫలం అపారంగా ఉన్నప్పటికీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అతనికి మరల జన్మ ఎప్పుడో ఎవరికీ తెలియదు. అందులో మానవ జన్మ అంటే ఎన్ని కల్పాలు* గడచిపోవాలో అసలు తెలియదు. ఎందుకంటే ఆత్మహంతకులకు వాళ్ళ ఆత్మహత్యా పాతకం పరిహారమయ్యేదాక భగవంతుడు వారికి పిశాచ జన్మనిచ్చి, పునర్జన్మకి పరిస్థితులు అనుకూలించేదాక వేచిచూస్తాడు.    


·         1 కల్పం అంటే 100 మహా యుగాలు.
·         1 మహా యుగం అంటే 10 యుగాలు.
·         10 యుగాలు అంటే 43 లక్షల 2౦ వేల సంవత్సరాలు. 

·         1 యుగం అంటే 43 వేల 2౦౦ సంవత్సరాలు.

మానసిక వ్యభిచారమే అన్ని అనర్ధాలకు మూలము :

మానసిక వ్యభిచారమే అన్ని అనర్ధాలకు మూలము :


మానవుడై పుట్టిన ప్రతి వాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారి తెలుసుకోమని ఏర్పరచినాడు. మానవుడు పుట్టిన తరువాత ఈ ప్రకృతి మాయలో పడి దాన్ని మరచిపోయి జీవిస్తున్నాడు. ఎప్పుడైతే జీవికి ఆత్మ జ్ఞానం కలుగుతుందో అప్పుడు మానవుడు సక్రమ మార్గంలో జీవించడానికి వీలు కలుగుతుంది. నిషిద్దమైన కర్మలను ఆచరించకుండా ఉంటె మనో మాలిన్యమనే పాపం పేరుకోకుండా ఉంటుంది. పాపం చెయ్యకుండా ఉండటమే కాదు. మానసికమైన వ్యభిచారం కూడ లేకుండా చూసుకోవాలి. మనిషి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కాని మనస్సు పరిపరివిధాల వ్యభిచారిస్తూ ఉంటుంది. మానవుడు కర్మేంద్రియాలను అరికట్టిన మనస్సు మాత్రం విషయాలన్నిటిని తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది. దాన్ని అరికట్టడానికి మనస్సుకి తోడుగా ఆత్మ అనే భగవంతునిని దానికి అందించి, ఆత్మతో మనస్సు అనురక్తమై జీవించే విధానాన్ని అలవడేట్లు చెయ్యాలి. దానివల్ల అంతఃకరణశుద్ధి ఏర్పడుతుంది. దీనికి వివేకం మరియు వైరాగ్యం తోడయితే లక్ష్యం సిద్దిస్తుంది.


ఈ మానసిక వ్యభిచారం వలన కలిగే దుస్ఫలితం గురించి ఒక చిన్న వివరణ:
ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ సన్యాసి మరియు ఒక వ్యభిచారి ఉండేవారు. బ్రాహ్మణుడు చాల ఉత్తమోత్తముడు . కాని ఆ బ్రాహ్మణుడు ఆ వ్యభిచారికి నువ్వు నరకానికి వెళతావు అని ఆయన హెచ్చరిస్తుండేవాడు. పేదరికంలో ఉన్న ఆ స్త్రీ జీవనోపాధికి తనకున్న ఒకేఒక మార్గాన్ని మార్చుకోలేక తన దైన్యస్థితిని భగవంతునికి తెలియజేస్తూ, రోదిస్తూ, విలపిస్తూ తనను క్షమించమని ఆమె ప్రార్దించేది. ఆ విధంగా వారు ఇద్దరు జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. బ్రాహ్మణుని మనస్సు ఎప్పుడు ఆమె వ్యభిచారిణి అనే ఒక మానసిక ధోరణిలోనే ఉంటూ కాలం గడిపేవాడు. కాల క్రమేణ ఆ ఇద్దరూ చనిపోయారు. వేశ్య స్వర్గానికి వెళ్ళింది. సన్యాసి నరకానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ సన్యాసి అది ఏమిటి నేను బ్రాహ్మణున్ని పైగా ప్రతి నిత్యము భగవంతుణ్ణి ప్రార్ధన చేస్తూ ఉండేవాడిని కదా. నన్ను నరకానికి తెచ్చారు. ఆ వేశ్యను స్వర్గానికి తీసుకెళ్ళారు అని అడిగాడు యమభటులను. అప్పుడు యమ భటులు ఆమె నిర్మలమైన మనస్సుతో భగవంతుణ్ణి, నా శరీర యాత్ర కోసం నేను ఈ విధంగా చేయవలసి వస్తుంది స్వామి, నన్ను క్షమించు అని ఆమె దేవుణ్ణి వేడుకోనేది. కాని నువ్వు మాత్రం అలా కాదు నీ మనస్సు ఎప్పుడు ఆమె గురించే ఆలోచిస్తూ ఉండేది. అందువలన నీకు నరకం అని చెప్పారు.


అందువలన ప్రతి ఒక్కరు నిషిద్దమైన కర్మలను చేయకుండ ఉండడమే కాకుండా మానసికమైన వ్యభిచారం కూడ లేకుండా చూసుకోవాలి.         

మానవ శరీరంలో ఉన్నవి :

మానవ శరీరంలో ఉన్నవి :


1. జ్ఞానేంద్రియాలు : కన్ను, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మం – 5.
2. కర్మేంద్రియాలు : కాళ్ళు, చేతులు, శిశ్నం, గుదం మరియు నోరు – 5.
౩. అంతఃకరణ చతుష్టయం : మనస్సు, బుద్ధి, చిత్తం మరియు అహంకారం – 4.
4. పంచాతన్మాత్రులు : శబ్దం (ఆకాశగుణం), స్పర్శ (గాలిగుణం), రూపం (అగ్నిగుణం), రసం (నీటి గుణం) మరియు గంధం (భూమిగుణం) – 5.
5. పంచప్రాణాలు : లోనికి తీసుకునే గాలి శరీరంలో అయిదు రకాలుగా పనిచేస్తూ ఉంది – ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం మరియు సమానం – 5.

అనేవి అన్ని కలిపి మానవుడు జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విధంగా జడమైన 24 తత్వాలు 25 వది అయిన జీవుణ్ణి కలిపి 26 వది అయిన ఆత్మను గ్రహించటానికి మరియు ఆత్మ తత్త్వాన్ని అనుభవించటానికి అవరోధంగా నిలుస్తున్నాయి. వాటిని తొలగించి ఆత్మలో జీవించటానికి మనకు ఆత్మ జ్ఞానం అవసరం. అత్యవసరం.  

శివకేశవులకు భేదం లేదు...ఇద్దరు ఒక్కరే :

శివకేశవులకు భేదం లేదు...ఇద్దరు ఒక్కరే :


శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః!!

శివ కేశవుల అభేదాన్ని ఈ శ్లోకం తెలుపుతున్నట్లే హరిహరుడు, రామలింగడు, రామేశ్వరుడు, శంకర నారాయణుడు అనే పేర్లు కూడా ఈ అభేదాన్ని చాటుతున్నాయి. ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏసమాసానికి చెందినది అనే సందేహం కలిగిందట. రామస్య ఈశ్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం చెబుతుంది. శివుని విల్లు విరిచిన రాముడు శివుని కంటే ఏవిధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అనుకొని వైకుంఠం వెళ్ళారుట. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది రామస్య ఈశ్వరః అని అన్నారట.
ఆ విష్ణువు ఏదో వినయంతోనో, అహంభావం ఉండరాదు అనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలకు మాత్రం సందేహ నివృత్తి కాక కైలాసానికి బయలుదేరారు. దానికి శివుడు సమాధానంగా ఇందులో సందేహానికి ఏముంది? రాముడై ఈశ్వరుడుగా గలవాడు అన్నాడట. అప్పటికీ అర్థంకాక దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు ఇలా అన్నారు. "రామేశ్వరుడంటే రాముడొకడూ ఈశ్వరుడింకొకడూ కాదు రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారట.
విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్!!
శివకేశవులొకటే అని బ్రహ్మ బోధించాడట. పురాణాలలో ఒకచోట విష్ణువు జయించాడని, ఒకచోట శివుడు జయించాడని వింటూ ఉంటాం. అంతేకాక కొన్ని చోట్ల ఒకరినొకరు పూజించుకున్నారని వింటాం. పూర్వం బ్రహ్మగారు పంచముఖుడుగా ఉండేవాడు. ఆయనకు కొంచెం అహంభావం హెచ్చినందువల్ల ఈశ్వరునికి కోపం వచ్చి బ్రహ్మగారి ఒకతలను గిల్లి వేశాడట. ఆబ్రహ్మ కపాలం ఒకానొక శాపం ఈశ్వరుని చేతికే అంటుకుపోయిందిట. పైగా బ్రహ్మహత్యాపాతకం ఒకటి చుట్టుకొన్నదిట. అది పోగొట్టుకోవడానికి తిరుకుండియూరులోని పెరుమాళ్ళుని శివుడు పూజించాడని, అందలి మూర్తికి హరశపవిమోచకుడని పేరనీ స్థలపురాణం చెప్తుంది. పరతత్త్వం ఒకటే. తన మాయాశక్తి చేత ఆయా సమయాలలో ఒక్కో రూపంతో అనుగ్రహించడానికై ఆవిర్భవిస్తున్నది. ఏ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటామో ఆ అనుగ్రహాన్ని ఇచ్చే మూర్తిని ఆరాధించాలి. అన్నీ ఒక్కటే అనే అభేద జ్ఞానం ఎన్నటికీ మరువరాదు. త్రిమూర్తులు త్రిగుణాత్మకంగా ఉన్నారు. జగత్తును కాపాడటమూ అనుగ్రహించడమూ సత్త్వగుణం. శ్రేయస్సు కావాలంటే సత్త్వ గుణ ప్రధానమైన విష్ణువును ఆరాధించాలి. శివుని రంగు తెలుపు. ఆయన ఉండేచోటు కైలాసం. అదీ తెలుపే. ఈ గుణాలు సత్త్వగుణాన్ని తెలియజేస్తాయి.ఈ మూర్తులలో ఆధిక్యానధిక్యములు ఏమాత్రమూ లేవు. హరిహరులిద్దరూ ఒక్కటే అది తెలియని వాని నోట్లో మన్ను అని తమిళంలో ఒక సామెత ఉంది. ఒకే తత్త్వం మాయచేత అనేక రూపాలతో గోచరిస్తుంది. పసిబిడ్డకు బొమ్మ మామిడిపండు ఇస్తే దానిని తినడానికి పూనుకుంటుంది. మనకు నవ్వు వస్తుంది. అలాగే ఎన్నో వికారాలకు లోనయిన ఈ ప్రపంచాన్ని సృష్టించి, కాంతా కనక క్షేత్రాదులను చూపిస్తూ మనలను మభ్యపెడుతూ ఆడిస్తున్నాడు. ఇదంతా భ్రాంతి. రజ్జుసర్ప భ్రాంతి. అలాగే వేదాంత శాస్త్ర పఠనం, శ్రవణం వల్ల ఇదంతా మిధ్య అనే ఎరుక కలుగుతుంది. అందువల్ల ఎక్కువ తక్కువలు కట్టిపెట్టి వంశానుక్రమముగా కొలిచే దేవతలను పరదేవతగా పూజించాలి. తక్కిన దేవతలను పరదేవతయొక్క వేరు వేరు అంశలుగా తెలుసుకొని అభేద అనుభవంతో అచంచలమయిన శాంతితో ఉండాలి. దానిని ఈశ్వరుని అనుగ్రహంతో అనుభవంలోకి తెచ్చుకోవాలి

ధర్మం అంటే ఏమిటి?

ధర్మం అంటే ఏమిటి?


మానవులు అనుష్టించాల్సిన ధర్మాలేంటి?
శాస్త్ర విహితమయిన కర్మలు "ధర్మం"
అనబడతాయి. మన నడవడి, మన చేష్టలు, మన
వృత్తి యితరులకు ఇబ్బంది కలిగించనవి,
సజ్జనులకు హాని కలిగించని
ధర్మం అనిపించుకుంటాయి. వ్యవస్థాగతంగా
వున్న నియమాలు, సంఘ నియమాలు, సంస్కృతి
నియమాలు ధర్మ మార్గాలు అనిపించుకుంటాయి.
స్వాధ్వౌయం, బ్రహ్మచర్యం, దానం, యజనం,
ఔదార్యం, సారళ్యం, దయ, అహింస, ఇంద్రియ
విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం,
శుచిత్వం, సత్సం కల్పత్వం శివకేశవ భాస్కర
దేవ్యౌదుల పట్ల భక్తి ఇవి
మానవులు అనుష్టించవలసిన ధర్మాలు.
వీటిలోనే వృత్తిరీత్యా కులం రీత్యా కొన్ని
మార్పులు శాస్త్రాలలో చెప్పారు.
ఉదాహరణకు అందరికీ అహింసయే పరమధర్మం అని
చెప్పినా
సైనికులకు మాత్రం శత్రుజయం ధర్మం అని
చెప్పారు.

హిందూ ధర్మము దాని ప్రాముక్యత :

హిందూ ధర్మము దాని ప్రాముక్యత :


హిందూ ధర్మం అనేది మతమనుకుంటాం. కాని నిజానికది ఓ భారతీయ ధర్మం. భరత ఖండమంతటికీ చెందిన ఓ సైద్ధాంతిక ధర్మం. దీనినే మానవధర్మమనీ అంటాం. ‘ఆత్మవత్సర్వ భూతేషు’ అని చెప్పగలిగే ధర్మం. సనాతనధర్మమే! సాటివారెవ్వరికీ ఏ బాధా - అవరోధమూ కలగకుండా మోక్షాన్ని దర్శింపచేసేది కేవలం హిందూ ధర్మమే. ఏ మతంకూడా ఏ ఇతర ధర్మాన్నీ అవహేళన చేయని, వ్యతిరేకించని ఛెప్పదు.
పరబ్రహ్మకీ, సర్వవ్యాపకతకీ హిందూ ధర్మమే మూలాధారమైనది
మనది పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి. ఇక్కడ పవిత్రనదులు సజీవంగా ప్రవహిస్తున్నాయి. మహోన్నత పర్వతాలున్నాయి. ప్రాచీనమైన సభ్యతా - సంస్కృతులు విరాజిల్లుతున్నాయి. మానవజీవనానికి అనువైన శీతోష్ణ స్థితి వుంది రమణీయ ప్రకృతి శోభిల్లుతూ ఉన్నది. వనరులెనె్నన్నో సమృద్ధిగా ఉన్నాయి. పరోపకారంమిదం శరీరం అన్న ఆర్యోక్తికి అంకితమై అజరామరులైన తపోధనలు, ఋషులు, యోగులు, సిద్ధులు, కవులు, కళాకారుల గురించి మన మెరుగుదుము. ఈ అఖిల జగతిని సుఖంగా, క్షేమంగా వుంచగల శాశ్వత సూత్రాలకు ఆచార సంహితను ‘ధర్మం’ అని నామకరణం చేశారు. దీనినే మానవధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం అన్నారు. హిందూ ధర్మం ఓ ప్రవక్తవల్లనో, ఓ వ్యక్తి తపస్సు వల్లనో ఏర్పడింది కాదు. అనేకవేల సంవత్సరాల సాధనలోంచి, కాలక్రమేణా ఆవిర్భవించిన మహాధర్మమిది. ఎందరో యోగిపుంగవుల, ఋషుల, దార్శనికుల ఆత్మజ్ఞానానికి ప్రతీకలైన వేదాలు ఉపనిషత్తులు పురాణగాధల రూపంలో ఆవిష్కృతమైన జీవన విధానమిది.
హిందుత్వం నిజానికి జీవితానికి - ప్రకృతికీ సంబంధించిన ఆధ్యాత్మిక మార్గం. మన ఆధ్యాత్మిక సంపదను వేదాంతమన్న పేరూ ఉంది. వేదాంతంలో మోక్షం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, పరబ్రహ్మ, సృష్టికర్త, ఆత్మ, ప్రకృతి, కర్మసిద్ధాంతం, పునర్జన్మ బంధనాలు, స్వేచ్ఛ మొదలైన అనేక అంశాలపైన చర్చలుంటాయి. తాత్విక చింతన యోగవిద్య వీటిలో అంతర్లీనమై ఉంటాయి. అసలు వేదాంతమే హిందూ ధర్మసారం. ఇలా రూపుదిద్దుకున్న హిందుత్వం అందించిన జీవన రచనా విధానం వల్లనే హిందూ సమాజం ‘చిరంజీవి’ అయింది.
బాధాతప్తుల బాధను దూరం చేయడమే మానవుడి పరమధర్మమని మనధర్మం చెబుతోంది.మానవజన్మ లభించినందుకు మనం గర్వించాలి. పొంగిపోవాలి. ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. మనకర్మలే మన జీవితాన్ని ఆదేశిస్తాయన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది హైందవ దృక్పథం. ఇహపరాల సంగతి సరే - నేటి మన రాజకీయ, సామాజిక, ఆర్థిక నైతిక సమస్యలకు పరిష్కారమార్గం చూపగలిగే మహత్తర శక్తి మన హిందూ ధర్మచింతన ప్రసాదిస్తున్నది. ఈ దుర్లభమైన మానవజన్మను సద్వినియోగపరచుకోవాలంటే ఐహిక ప్రలోభాలకు తలొగ్గక, ఆత్మజ్ఞానాన్నీ, ఆత్మతతాత్త్వన్నీ ఆకళింపు చేసుకుని, హైందవ తాతిత్వకతను అవగాహన చేసుకోవాలి. తన జీవితానికి అన్వయిపరచుకోవాలి. తన జీవన కాలంలోని ప్రతి క్షణాన్నీ హైందవ ధర్మాచరణకు అంకితం చేసుకోవాలి

వ్యాసమహర్షి కుమారుడు శుక మహర్షి పరీక్షిత్తునకు ధారణ గురించి తెలియచెప్పుట:

వ్యాసమహర్షి కుమారుడు శుక మహర్షి పరీక్షిత్తునకు ధారణ గురించి తెలియచెప్పుట:


“మృత్యువు సమీపించుచున్నప్పుడు మృత్యు భయమును వీడవలెను. త్యాగమను కత్తితో భార్య, పిల్లలు, ఆస్థిపాస్తులతో నున్న బంధములను తెగనాడవలెను. ధ్యానమునకు కూర్చోనవలెను. ధ్యానము సలుపు ప్రక్రియను నేను వివరముగా తెలిపెదను.

ప్రాణాయామముతో మనస్సును నిశ్చలముగా ఉంచవలెను. ‘ఓం’ అను యేకాక్షరమును పదే పదే ఉచ్చరించవలెను. మనస్సును నిగ్రహించిన తర్వాత, రథసారధి వలె బుద్ధి కళ్ళెము పట్టుకొని మనస్సును భగవంతుని మననము గావించు మార్గమున తీసుకువెళ్ళగలదు. మనస్సు ఇంద్రియములకు వశము కాకుండా చూడవలెను. భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించుటకు అష్టాంగాయోగమనే ప్రాధమిక యోగ ప్రక్రియ సహాయపడును. ఈ యోగము ఎనిమిది గుణములతో కూడుకొని యున్నది. ఈ గునములన్నీ నీలోని అంతర్భాగములు కావలెను. అవి యేవనగా, అహింస – ఇతరులకు హాని కలిగింపకుండుట; సత్యము – నిజాము పలకుట; అస్తేయము – ఇతరులకు చెందిన వాటిని దొంగిలింపకుండుట; బ్రహ్మచర్యము – ఇంద్రియములను నిగ్రహించుట; అపరిగ్రహము – ఇతరుల నుండి వస్తువుల గ్రహింపకుండుట; శౌచము – లోపల బయట నిర్మలముగా ఉండుట; తపస్సు – సాధన చేయుట; స్వాధ్యాయము – శాస్త్రములను చదివి వాటిని తెలుసుకొనుట ఈ ఎనిమిది గుణములను “ధారణ” అందురు. ఇది తరువాత చేయు ధ్యానమునకు నాంది.

కపిల వాసుదేవుడు తన తల్లి అయిన దేవహుతికి బ్రహ్మ విద్యను (ఆత్మ జ్ఞానాన్ని) బోధించుట:

కపిల వాసుదేవుడు తన తల్లి అయిన దేవహుతికి బ్రహ్మ విద్యను (ఆత్మ జ్ఞానాన్ని) బోధించుట:


శ్రీ మహా విష్ణు మూర్తి సత్య యుగం ప్రారంభమైన తరువాత ఆయన బ్రహ్మ విద్యను ఈ లోకంలోని మానవాళికి తెలుపడానికి తానే కపిలుడుగా ఈ భూమి మీదకు అవతరించాడు. ఆ విధంగా మానవాళికి బ్రహ్మవిద్యను అందించడం కోసం ఆయన కర్ధముడు మరియు దేవహుతి కి కుమారుడుగా జన్మించాడు.
ఆయన పుట్టిన తరువాత కర్దముడు తపస్సు కోసం దేవహుతి ని వదలిపెట్టి అడవులకు వెళతాడు. ఆ తరువాత కపిలుడు పెద్ద వాడైన తరువాత తన తల్లి ద్వార బ్రహ్మవిద్యను ఈ లోకంలోని మానవాళి కోసం వివరించాడు.
a
“తల్లీ! బంధమునకు, మోక్షమునకు మనస్సే కారణము. మనసు త్రిగుణములతో చేరి, ఆ గుణములు సమత్వము తప్పినప్పుడు, అందులో యేదో యొక గుణము తీవ్రమై దానివలన జనించు ఉద్రేకముల యందు ఆత్మ తగుల్కొని యుండును. మనస్సు అంతరాత్మ నుండి దూరమై, ఇంద్రియములకు సంతృప్తి గూర్చు వస్తువులయందు తగులువడి యుండును. ఇంద్రియములకు వస్తు అనుభవమును సమకూర్చుచు, ఆత్మకు దూర దూరముగ జరిగి మనస్సు సంచరించుచుండును. అదే మనస్సును అంతర్ముఖము గావించి, పురుషోత్తముడైన నారాయణునితో అనగా ఈశ్వరునితో చేర్చియున్నప్పుడు, ఇంద్రియ లంపటముల నుండి స్వేచ్ఛను పొందును ఈ మార్గమునకు చిఇత సంయమనమని పేరు గంయమునకు ఇది మొదటి మెట్టు.’నేను-నాది’ అను భావములు అద్రుశ్యమైనపుడు, మనస్సు కామక్రోధములనే దుష్టశక్తుల నుండి స్వేఛ్చ నొంది యుండును. అప్పుడు మనస్సు శుద్దముగా నుండి నన్ను ధ్యానించి చేరుట కర్హమై యుండును. అపుడు ప్రాపంచిక సుఖ దుఃఖములు మనసును అంటవు. భక్తి, జ్ఞాన వైరాగ్యములతో నిండిన మనసు బ్రహ్మమును దర్శించగలదు.”





భక్తి మార్గము :
“తల్లీ! అన్ని మార్గములలో భక్తి మార్గము అతి సులభమైనది .తప్పక గంయమునకు తీసుకు వెళ్ళగలదు. ఇతర మార్గములు, భక్తి మార్గము తీసుకువెళ్ళునంత త్వరగా, మోక్షమునకు తెసుకెళ్ళలేవు మానవునిలో ‘సంగ’మనే గుణము అంతర్లీనముగా ఉన్నదనీ ఋషులు చెప్పుదురు. దీనికి నాశము లేదు నిత్యమూ పచ్చగా ఉండి, నాశనము లేని ఈ గుణమును విస్మరించుటకు వీలులేదు. అమ్మా! సంగమనునది యెల్లప్పుడు ఉండును. మోక్షమునకు దీనినొక సాధనముగా వినియోగించు కొనవలెను. సంగము అనగా అనుబంధము ఉండనిమ్ము. కాని బాహ్య వస్తువుల నుండి మరల్చుము ఇంతవరకు నీకు ప్రాపంచిక వస్తువులపై అనుబంధము కలదు. ప్రాపంచిక వస్తువులకు బదులుగా నారాయణునితో అనుబంధము యేర్పరచుకొనుము. అనుబంధము వీడనక్కర్లేదు. నారాయణునితో అనుబంధము బాహ్య వస్తువులతో గల అనుబంధమును త్రెంచును. ఇది సులభముగా చేయవచ్చును.”
“ఈ అనుబంధము అధముమైన వానినుండి ఉత్తమమైన వానివైపు మల్లించుట క్రమ క్రమముగా జరుగవలెను. ఒక్కసారిగా ఒకదానిని వదలిపెట్టి రెండవదానిని చేబట్టుట సాధ్యము కాదు. అందుకు మనస్సు సహకరించదు. అంతిమ ద్యేయమునకు ముక్త సంగమాని పేరు. ఈ మార్గము ననుసరించుట సాధు సాంగత్యముచే, మనసునకు తగిన శిక్షణ కలుగును సజ్జన సాంగత్యము కలిగిన తర్వాత, మనస్సు వెనుకటి ఆకర్షణలకు లోబడకయుండును. ఇందువలన తరువాత మెట్టు సులభమగును.”
“భగవంతునిపై ఆలోచనలకూ మనస్సును మళ్ళించుటెట్లు? అనుకున్న దానికన్న తెలికయే. ఇంతకు ముందు అరిషడ్వర్గములైన కామక్రోధములు , నేను-నాది, అను భవములు మనస్సును మాలిన మొనర్చి గమ్యము నుండి మరల్చి, ఇంద్రియములకు తృప్తిని గూర్చు వస్తువులవైపు నడిపించునని తెలిసియున్నాను. అరిషడ్వర్గములైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములచే కల్మషముల బారినుండి స్వేఛ్చ పొందిన మనస్సు సహజముగా భగవంతునివైపు మరలును.”
“దీనిని సాధించి, ముక్త సంగులైన తర్వాత, సత్సంగము అనగా సజ్జనుల సాంగత్యముతో కాలము గడపవలెను. నిత్యము పచ్చగా ఉండే అనుబంధము సాధువులతో ముడిపడి యుండవలెను. సాధువు లెవరు? వారి లక్షణము లేమిటి ?వారిని గుర్తించుటెట్లు? ఇవి నీకు చెప్పెదను. ఈ భౌతిక శరీరమునకు కలిగే బాధల వలన అనారోగ్యముల వలన సాధువులు తమ మనస్థితిని పోగొట్టుకొనరు. అందరి మానవుల యెడ వారు దయకలిగి యుందురు. అన్ని జావులు వారికి బంధువులే. అన్నీ జీవులను ప్రేమించెదరు అందుచే సహజముగా వారికి శత్రువులుండరు. వారు యెప్పుడు శాంతముగా మరియు వారి మనస్సు యెట్టి కలవరములు లేక ప్రశాంతతో నిండి యుండును. వారు యెప్పుడును ధర్మ మార్గమును విడిచిపెట్టరు. వారి ప్రవర్తన దోషరహితము నన్ను గురించియే వారెప్పుడు తలంచెదరు. వారికి యెటువంటి విధులు, బాధ్యతలు, సంబంధము లేకుండుట చేత, నా గురించి కథలు తెలుసుకొనుట లోను వాటిని ఇతరులకు తెలియజెప్పుట లోను ఆనంద మనుభవించుచుందురు. ఈ ప్రాపంచికమైన బాధలు వారిని బాధించవు. వీటినుండి స్వేచ్ఛను పొందినటువంటి వారినే ‘సాధువు’లందురు. అమ్మా! ఇట్టి సాధువులతో నీ మనస్సు అనుబంధము కలిగి యుండవలెనని ప్రార్ధింపుము. వారు నీకున్న అనుబంధముల నుండి విముక్తి కలిగించుటకు సహాయపడగలరు.”
కపిలుడు చెప్పుచుండగా తల్లి శ్రద్దగా వినుచూ మధ్యలో ఇట్లా అడిగెను.నేను వేదములు చదవలేదు మరి నావంటి అమాయిక స్త్రీ భగవంతుని చేరుటెట్లో తెలియజెప్పుము. భగవంతుని చేరుటకు సులభమైన మార్గమేది?
“భక్తీ” యని కపిలుడనెను. “నీకు భక్తి యోగము ఉపయోగపడును. ప్రాపంచిక వస్తువులందు తగుల్గోనిన ఇంద్రియములు, వేదములు నిర్దేశించిన నిత్యవిదులు, కర్మలు చేయుట యందు నిమగ్నమైన మనస్సు, ఈ రెండు కూడను విముక్తి పొందుటకు ఒకే ఒక మార్గము కలదు. అది తనకు తానుగా శ్రద్ధతో మోక్షమును కాంక్షించుట నారాయణుని యందు అనన్య భక్తి పెంపొందించుకొనినపుడు ఈ కాంక్ష తీరగలదు. ఈ భక్తి కర్మ బంధములను, ఇంద్రియ బంధములను, శరీరములోని అగ్ని (వైశ్వాసరుడు) భుజించిన ఆహారమును దహించినట్లుగా దగ్దము చేయును. భక్తి వస్తు ప్రపంచము నుండి విముక్తిని కల్గించి, నారాయణునితో ఐక్యమగునట్లు చేయును భక్తి మార్గములో పయనించు భక్తులు ముక్తి అనే గమ్యమును సునాయాసముగా చేరగలరు.”
“నాకు యెప్పుడు సేవచేయుచు, నాతోనే అనుబంధము కలిగియుంటూ, నాకు సంతోషము కలిగించుటకే కర్మలను చేయుచూ, నా కథలనే యెల్లప్పుడు చెప్పుచుండు సాధువులు మోక్షమును సైతం కోరరు నన్ను గురించిన ఆలోచనలతోనే వారు ఆనందముగా నుండెదరు వారు తమ మనో నేత్రముతో నా రూపము నెప్పుడు చూచుచుందురు అందుచే, వారడిగినను లేకున్నను, నేను వారికి ముక్తిని ప్రసాదింతును.”
“నా భక్తులకు యెట్టి వినాశము కలుగదు నాలో లీనము కానున్న భక్తుల యెడ చక్రము (కాలచక్రము), శక్తిహీనమై యుండును. నేను భక్తులకు సర్వస్వమును పుత్రులపై యెట్టి ప్రేమయో ణ భక్తులపై నాకట్టి ప్రేమ నేను భక్తులకు మిత్రుడను, గురువును, శ్రేయోభిలాషిని, ప్రియతముడను ఈ లోకమంతయు నా ఆధీనములో నుండుటచే నా భక్తులకు యెట్టి భయము ఉండదు. నాకు భయపడి గాలి వీచును, సూర్యుడు ప్రకాశించును, పర్జన్యుడు (వరణుడు) వర్షించును నాచే నియమితుడై అగ్ని దహించును, యనుడు అందరిని కనిపెట్టి యుండును. ఇంద్రియములను జయించిన యోగులకు భయము కలుగదు వారు నన్ను తప్పక చేరెదరు. ఇందు యే మాత్రము సంశయము లేదు.”
సాంఖ్య యోగము :
“పురుషుని రహస్యమును, అతడు యీ లోకమునంతయు యెట్లు వ్యాపించియున్నది నీకు నేను చెప్పెదను. దీనిని ఆత్మవిధ్యా యోగమందురు. సంపూర్ణముగా దీనిని చక్కగా అర్ధము చేసికొనిన యెడల, నీవు మోక్షమును పొందగలవు. ఈ యోగము తెలుసుకొనిన వారి సంషయములన్ని నివృత్తి కాగలవు. నీలో వున్న ఆత్మయే పురుషుడు. అతనికి ఆద్యంతములు లేవు. అతడు స్వయం ప్రకాశకుడు. పురుషుడు కాని వస్తువేదియు లేదు. పురుషునికి భిన్నమైనదేదియు లేదు. అతడు అంతటా వ్యాపించియున్నాడు. అతడు నిత్యుడు.”
“ప్రక్రుతి కారణముగా ఆత్మ ఉపాధులతో చేరియున్నది. పురుషుడు నిత్యుడని ఇంతకు ముందు తెలిపియున్నాను. ఈ బహుళ ప్రపంచము నందంతటా వ్యాపించి యున్నది ఆ పురుషుడే. అతడు త్రిగుణాతీతుడు పురుషునికి సంబంధించిన ఈ రెండు విషయములను సమన్వయ పరచుటెట్లు? ఒకటి శుద్దమైనది. రెండవది బహుళ ప్రపంచము. పురుషుడు గుణములకు, ప్రకృతికి అతీతుడెట్లు కాగలిగెను? ఈ లోకములోని జన మరణములతో అతని ప్రమేయము యెట్లు కలిగెను? జ్ఞానులకు ఇది చిత్రవిచిత్రమని గోచరించదు.”
“ప్రక్రుతి యందు రెండు కీలక శక్తులు కలవు. ఒకటి ఆవరణ శక్తి, రెండవది విక్షేప శక్తి. త్రిగుణములు నను విభక్తముగా నున్నప్పుడు దానిని నిర్గుణ స్థితి యందురు, అనగా గుణములు లేనట్టి స్థితి. పురుషుని మరొక రూపమే కాలము. కాలము తిరుగుచున్నప్పుడు, త్రిగుణములలో సమత్వము తప్పిపోవును. ఈ సమత్వము లేక సమవిభక్త స్థితి తప్పినపుడు, రజోగుణము ప్రకటితమగును. దాని తర్వాత మిగిలిన రెండును ప్రకటితము కాగలవు.”
“ ఆ విధముగా గుణములు కార్యమునకు దిగినపుడు, ఆవరణ విక్షేపములు కలుగును. ఇప్పుడు పురుషుడు రెండు రూపములు ధరించును. ఒకటి జీవుని రూపముం, రెండవది ఈశ్వర రూపము. గుణములతో కూడిన పురుషుని జీవుడందురు. ఆవరణము, జీవుడు తన సహజ (నిజ) స్వభావమును మరచిపోవునట్లు చేయును అవిద్య చేత ఈ మరపు కలుగుచున్నది. అవిధ్యతో పాటు విక్షేపనము కలుగును. విక్షేపనము కలవరము లేక ఆందోళనను సృష్టించును. దీనినే మాయ అందురు. ఇది అసత్యము సత్యమను భ్రమను కలిగించును అనగా అవిధ్యకు, మాయగా ఆవరణ విక్షేపములే కారణము. ఆవరణ విక్షేపముల చేత జీవాత్మ తన నిజ స్వరూపమును విష్మరించుచున్నాడు. అశాశ్వతమైన ఉపాదులే తానని భ్రమించి ఈ బహుళ ప్రపంచపు ప్రలోభములకు లోనై చిక్కుకొని పోతున్నాడు. ప్రక్రుతి యొక్క ఆవరణ విక్షేప శక్తులను భ్రమింపక, వేరుగా నుండునదే పురుషుని రెండవ స్వరూపమైన ఈశ్వరుడు.”
“ ఈ మాయ నుండి విముక్తి పొంది, అనగా జీవుడు ప్రక్రుతి శక్తులు బంధించలేని స్థితికి చేరుటకు ఒక మార్గము కలదు అదియే భక్తీ యోగము. అమ్మా! ఎల్లప్పుడూ భగవంతున్నే చింతింపుము భక్తీ దానంతటదియే జ్ఞాన వైరాగ్యములను కలిగించును. వాటిని నీవు అన్వేషించ నవసరము లేదు. నారాయణునిపై ప్రేమ పెంపొందినప్పుడు, ఇతర వస్తువులపై ప్రేమ లేకుండ జేయును. ఆ విధముగా వైరాగ్యమలవడును. భక్తి నారాయణుని పాదములు చేరు మార్గమున తీసుకపోవును. నారాయణుని సన్నిధికి చేరుటయే జీవిత లక్ష్యముగా యెంచిన భక్తుడు సత్యమును తెలుసుకొన్న వాడగును. అనగా అతని అవిద్య తొలగినదన్నమాట. నారాయణుడే సత్యమని, యితరమైనవి అసత్యమని తెలుసుకోనును అదియే జ్ఞానము.
“వివిధ యోగములు బ్రహ్మమును, పురుషుని, ఈశ్వరుని, భగవంతుని చేరుటకు మార్గమును సూచించు చున్నవి. అనగా గమ్యము ఒకటే. పురుషుడు అనగా ఈశ్వరుడు ఈ బహుళ ప్రపంచమందు అన్నింటియందు వ్యక్తమగుచున్నాడు. దీనిని గ్రహించిన వాడు బ్రహ్మమే యగును. అనగా బ్రహ్మత్వమును గురించి తెలుసుకొనుట కాదు, బ్రహ్మత్వమునే పొందుట. తానె బ్రహ్మమని యెరుక కలిగియుండుట. జీవుడు, తానూ పురుషుడు లేక ఈశ్వరుడనని యెరుగును.


ఇప్పుడు నీకు బోధించిన జ్ఞాన యోగము, ఇంతకు ముందు బోధించిన భక్తి యోగము ఈ రెండును నిజముగా ఒక్కటే. ఒకటి, మరియొక దానికన్నా వేరుకాదు.”
“అమ్మా! వివిధ మార్గములను నీకు బోధించితిని. ఏ ఒక్క మార్గమునైనను శ్రద్దగా అనుసరించినపుడు నీకు తప్పక మోక్షము లభించగలదని హామీ యిచ్చుచున్నాను.”

Friday, October 30, 2015

సాయిబాబా దివ్యవాణి

సాయిబాబా దివ్యవాణి :


బాబా ఒకసారి భక్తులతో ఇలా అన్నారు :
నేను మీకు దూరంగా ఉన్నాన దగ్గరగా ఉన్నాన అని మీరు ఆలోచించవలసిన పని లేదు. మీరెక్కడ నున్నప్పటికి, ఏమిచేసినప్పటికి నాకు తేలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుము. నేనందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను, ప్రపంచమందు చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సుత్రదారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియచాలకుడను నేనే. సృష్టి, స్థితి, లయ కారకుడను నేనే. ఎవరైతే తమ ద్రుష్టి నావైపు త్రిప్పెదరో వారికి ఏ హానిగాని, బాధగాని కలుగదు. ఎవరైతే నన్ను మరిచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే.


బాబా తనభక్తుల శ్రేయస్సుకై ఇలా అనెను :
నేననగా ఎవరు? అని సాయిబాబా ఎన్నో సార్లు చెప్పారు. సాయిబాబా ఇలా అన్నారు. నన్ను వెదకుటకు నీవు దూరముగాని, మరెచ్చటకుగాని వెళ్లనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలో, చైతన్యము లేదా అంతరాత్మ కలదని అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనే గాక అన్నింటిలోను చూడుము. దీనిని నీవభ్యసించినచో సర్వవ్యాపకాత్వమనుభవించి నాలో ఐక్యము పొందెదవు.


మానవుడు యత్నించవలసినది (శ్రీ సాయి సచ్చరిత్ర : ఎనిమిదవ అధ్యాయం)
మానవజన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలెను. ఏ మాత్రమును అశ్రద్దగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకై త్వరపడవలెను. చదువు అయిపోయిన విద్యార్థి ఉద్యోగం కోసం ఏ విదంగా ఆతురతపడతాడో, యట్లనే యాత్మసాక్షాత్కారము పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్దకము, అలసటను, కునుకుపాట్లు దూరమొనర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయనిచో మనము పశుప్రాయులమగుదుము.


ప్రార్ధన (శ్రీ సాయి సచ్చరిత్ర : 25 వ అధ్యాయము) :
ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా! మీ పాదముల మేమెన్నటికి మరువకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావుపుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపు నంతవరకు, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య గాని, స్నేహితుడు గాని యుపయోగపడరు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగ జేయువాడవు. వివాదములయందు, దుర్మార్గపు పనులందు మాకుగల యాసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక, సమాలోచనలు అన్ని మంచివే యగుగాక చెడ్డవే యగుగాక, తరిమివేయుము. మాగృహములను శరీరములను మరచునట్లుజేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందుండునటుల చేయుము. తక్కిన వస్తువులన్నిటిని మరచునట్లు జేయుము. మనశ్చంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో మా యజ్ఞానంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్రనుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది.   

శ్రీసాయి యొక్క అనంత తత్త్వములో ముఖ్యమైనవి ౩ కలవు :
శ్రీసాయి ఇట్లనెను.
- ఊరకే గ్రంధములు చదువుట వలన ప్రయోజనము లేదు. చదివిన విషయములు విచారించి ఆచరణలో పెట్టవలెను.
- భగవంతుని అనుగ్రహము సంపాదించే నవవిధ భక్తులను తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృప్తి చెంది ఆ భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. నవవిధ భక్తులు మరేవో కాదు. i.శ్రవణము ii.కీర్తనము iii.స్మరణము iv.పాదసేవనము v.అర్చనము vi.నమస్కారము vii.దాస్యము viii.సఖ్యత్వము ix.ఆత్మనివేదనము.
- ఎవరినీ నిందించకూడదు. తృణీకరించరాదు మరియు ఇతరుల విషయములో జోక్యము చేసుకోరాదు.





బాబా బోధనల సారాంశం :
హిందువుల దేవుడైన రాముడు, మహమ్మదీయుల దేవుడైన రహీమ్ ఇద్దరు ఒక్కరే. వారిద్దరికీ భేదం లేదు. అలాంటప్పుడు వారి భక్తులు అజ్ఞానంతో పోట్లాడుకుంటారెందుకు. అన్ని మతాలూ, జాతులు సోదరభావంతో కలిసిమెలిసి ఉండి జాతీయ సమైక్యత సాధించాలి. వివాదములు, ఘర్షనలు, అల్లర్ల వల్ల ప్రయోజనం ఉండదు. ఎవరితోనూ పోటీ పడవద్దు. మీ అభివృద్దిని మీరు చూసుకోండి. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షానికి దారులు. వీటిలో ఎవరికీ వీలైన వాటిని వారు పాటించి మోక్షం పొందవచ్చును. ఎవరైనా నీకు అపకారం చేసిన తిరిగి వారికి నీవు అపకారం చేయవద్దు. వీలైనంత మంచిని ఇతరులకు చేస్తూనే ఉండాలి.
ఈ శరీరం ఉన్నప్పుడే నాది నావారు అనే బంధాలు, శరీరం నుంచి ప్రాణం బయటపడితే, దానికి ఏ విధమైన బంధాలతోను సంబంధం లేదు. యోగులకు, త్యాగులకు, ముముక్షువులకు అలాంటి స్థితిలో దేనిమీద ఆశలేక, కోరిక లేక నిశ్చలమైన ఆత్మానంద స్థితి కలుగుతుందట. సాధారణ మానవులు మరణించగానే ప్రాపంచిక వ్యవహారాల ఆశ, పాశాలనుంచి బయటపడలేక పునర్జన్మను ఆశిస్తారట. అలా జన్మించటం పునర్జన్మ. ప్రపంచం, శరీరం మీద కోరికలు ఆశలు నశిస్తే ఆ ప్రాణం మళ్ళీ భూమిమీదకు రావాలని అనుకోదు. అదే మోక్షం, ముక్తి.   


శిష్యులు ఎన్ని రకాలు అన్న విషయాన్ని బాబా స్వయంగా చెప్పాడు:
గురువుకు ఏమి కావాలో గుర్తించి వారు ఆదేశించక ముందుగానే దానిని నెరవేర్చు వారు ఉత్తములు. గురువు ఆజ్ఞాపించగానే ఆలశింపక ఆజ్ఞాపాలన చేయువారు మధ్యములు. మాటి మాటికి తప్పులు చేయుచు గురువు ఆజ్ఞాపించిన కూడ ఆ పని చేయవచ్చునా లేదా అని అనుమానిస్తూ, తరువాత చేద్దాములే అని వాయిద వేస్తూ ఉండే వారు సాధారనులు. 
సాబూరి అంటే ఓర్పుతో వేచి ఉండటం. ఇది కూడ భక్తునికి చాల అవసరం. శ్రద్దలేని పూజలు, ఓర్పులేని భక్తీ ఎందుకు
పనికిరావు. అలాంటి వాటివలన సాధకులు గాని భక్తులు గాని ఉపయోగాన్ని పొందలేరు.
మనోనిగ్రహము గురించి బాబా నానాకు బోధించుట:
ఒకనాడు బీజాపూరు నుంచి ఒక మహమ్మదీయ కుటుంబము బాబా దర్శనార్ధమై వచ్చెను. వారిలో ఇద్దరు ఘోషా స్త్రీలు కలరు. వారు మసీడులోనికి వచ్చి బాబా ఎదురుగా మోములపై గల ముసుగు తొలగించి నమస్కరించిరి. వారిలో ఒకామె చక్కదనాల చుక్కవలె అత్యంత సుందరంగా ఉండెను. బాబాకు ప్రక్కనే కూర్చున్న నానా యొక్క మనస్సు చలించెను. ఆమెను ఇంకోక్కసారి చూడాలనిపించెను. అది గమనించిన బాబా నానా తొడపై చేతితో కొట్టెను. వారు వేల్లిపోయిన తరువాత బాబా నానాతో “నిన్నేలకొట్టితిని” అని ప్రశ్నిస్తాడు. నామనోవికారమును గుర్తించి మీరు నన్ను కొట్టారని నానా జవాబిస్తాడు. అవును నీవు చూచిన యువతి మిక్కిలి సౌందర్యవతి. ఆమెను భగవంతుడు అంత మనోహరంగా సృష్టించాడు. భగవంతుడు సృష్టించిన ఆమె అంతా అందంగా ఉంటె, ఆమెను సృష్టించిన భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో ఆలోచించావా!
మనం ఆలోచించవలసినది అందమైన ఈ సృష్టిని నిర్మించిన నిర్మాతనుగాని ఇందులో గల వస్తువులను కాదు. గుడికి పోవునది దేవుని కొరకుగాని గుడిపై గల శిల్పాల కొరకు కాదు. మనస్సు ఇంద్రియములతో ఐక్యమైనప్పుడే అది చలిస్తుంది. ఈ శరీరం ఒక రథంలాంటిది. బుద్ధి రథసారధి. ఇంద్రియాలు గుర్రాలు. గుర్రముల పగాలను రథసారధి గట్టిగా పట్టుకున్నచో గుర్రములు సరిగా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరగలడు. అట్లు గాక సారధికి గుర్రములపై అదుపు తప్పినచో వాటి ఇష్టము వచ్చినట్లుగా ప్రయాణించును. గమ్యస్థానము చేరలేము. బుద్దితో ఇంద్రియాలను అదుపు చేయగలవారు మాత్రమె ఆధ్యాత్మికంగా ముందుకు పోగలరు.


బ్రహ్మజ్ఞానము గురించి బాబా బోధన :
“ఓ మిత్రుడా బ్రహ్మజ్ఞానమనగా ఆత్మ సాక్షాత్కారమే. ఆత్మకు బ్రహ్మకు భేదం లేదు. జీవుడే దేవుడు. ఈ శరీరంలో గల ఆత్మను దర్శించాలంటే అయిదింటిని భగవంతునికి సమర్పించాలి. అవి   పంచప్రాణములు, 2. పంచేంద్రియములు, ౩. మనస్సు, 4. బుద్ధి, 5. అహంకారము. ఇవన్ని మనిషికి అంతర్గంగా ఉండేవి. బహిర్గతంగా ఉండే సంపదను పరిత్యజించటం చాల తేలిక. అంతర్గత ఈ అయిదు విషయాలను త్యజించటం చాల కఠినమైన విషయం. పదునైన కత్తిఅంచుపై నడవటంలాంటిది. బాహ్యవస్తువులనే వదలలేని వారు పూర్తిగా వ్యామోహంలో ఉన్నట్లుగా అర్థం. అలాంటి వారికి అంతరంగికమైన ఈ అయిదు విషయాలు అర్ధమే కావు.
అంతేగాక ఆత్మజ్ఞాని కావాలనుకునే వాడు ముందు ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి.
1.      మోక్షము లేక ప్రాపంచిక బంధాల నుంచి స్వేఛ్చ పొందాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి.
2.      ఇహలోక విషయాలపైన, పరలోక ఆశలపైన కూడ విసుగు విరక్తి కలగాలి.
3.      మానవుని ఇంద్రియాలేప్పుడు శరీరానికి బయటగల విషయాలను చూచునట్లు అలవాటుపడినవి. వాటి దృష్టిని బయటి వస్తు సముదాయముల నుంచి వేరుచేసి కేవలం శరీరం లోపల గల ఆత్మను తదేక ధ్యానముతో చూడగలగాలి.
4.      చెడు, దుర్మార్గపుదారుల నుండి బుద్దిని మర్పలేక, మనస్సును స్థిరపరచుకోలేనప్పుడు జ్ఞానము వలన కూడ ఆత్మ సాక్షాత్కారము పొందలేరు.
5.      సర్వకాల సర్వావస్థల యందు సత్యం పల్కుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు, బ్రహ్మచారిగా ఉండవలెను.
6.      తాత్కాలిక సంతోషం (ప్రాపంచిక విషయాలు) కన్నా శాశ్వతమైన మేకు కలిగించే ఆధ్యాత్మిక విషయాలనే కోరుకోవలెను.
7.      మనస్సును ఇంద్రియములను స్వాధీనమునందుంచుకొనవలెను.
8.      మనస్సును పవిత్ర పరచవలెను. మనిషి తానూ చేయవలసిన పనులను సక్రమంగా, త్రుప్తిగాను, ప్రతిఫలాపేక్షలేకుండాను నిర్వర్తించవలెను. అప్పుడు మనస్సు పవిత్రపడును. పవిత్రమైన మనస్సులో నుంచే వివేకము పుట్టి వైరాగ్యము అభివృద్ధి చెంది ఆత్మజ్ఞానము కలుగును. లోభము, మోహము, ఆశాపాశములు తోలగనిదే జ్ఞానం లభించదు.
9.      ఈ స్థితిని ప్రతి సాధకుడు తనంతట తానుగా కష్టించి సాధించుకోనవలెను.     
10.  వేదపాండిత్యం వల్లగాని, ధనాదిక్యత, కులాధిక్యత వలన గాని, బలాధిక్యత వలనగాని, మేధాశక్తి వలనగాని, ఆత్మ జ్ఞానం కలుగదు.


బాబా తన భక్తులకు ఊదీ ప్రసాదము ఇచ్చుట ద్వార ఏమి బోధించదలచెనో తెలుసుకొనవలెను:
ఈ ప్రపంచము మనకు కనిపించు ప్రతి వస్తువు చివరికి నశించి బూడిదగా మారును. ఆఖరికి మన శరీరం కూడ అంతే, శరీరంలో నుంచి ప్రాణం పోయిన తరువాత దానిని దహనం చేస్తే కొద్దిపాటి బూడిదగా ఈ శరీరం మారిపోతుంది. యిలాంటి ఆశాస్వితమైన ఈ శరీరం కోసం ఎన్నో ఆశలు, వ్యామోహాలు, అన్యాయాలు, అక్రమాలు, పాపాలు చేస్తావెందుకు? ఆశాస్వితమైన ఈ సృష్టిలో నీవు అనుకునే ఈ శరీరం కూడ ఈ బూడిదవలె ఆశాస్వితమైనది అని తెలుసుకోమని హెచ్చరించటానికి బాబా భక్తులందరికీ ఈ విభూది ఇచ్చేవాడు.    


బాబా తన భక్తులు అల్పమైన కోరికలు కోరినప్పుడు ఇచ్చిన గొప్ప సమాధానం :
భక్తులు అనేక మంది బాబా దగ్గరకు వచ్చి కేవలం భౌతికమైన ధనం, అస్తిపాస్తులు, వ్యాపారంలో లాభాలు మొదలైన వాటిని మాత్రమె ఎక్కువగా కోరుతుండేవారు. అది నానావాలి గమనిస్తూ ఉండేవాడు. ఒకనాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొందరు వచ్చి బాబాను ధనం కోసం అనేక ప్రశ్నలు విసిగిస్తూ ఉండడం గమనించిన నానావాలి వేగంగా మసీదులోకి దూసుకు వచ్చి బాబా ఎదురుగా కూర్చొని, ఓ ఫకీరు డబ్బులు కాయలుగాకాసే ఒక పెద్ద చెట్టు నాకు వెంటనే కావాలి. ఆ చెట్టు మొక్కగా ఉండి ఎప్పుడో కాయలు కాస్తేకాదు. మొలకెత్తిన నాటి నుంచే కాయలు కాయాలి. ఎన్ని డబ్బులను చెట్టు నుంచి కోసుకున్నా తరగకుండా యిస్తూనే ఉండాలి. అలాంటి చెట్టును నీవు నాకు ఇప్పుడే ఈ తక్షణమే ఇవ్వాలి అంటాడు. అతని ఉద్రేకాన్ని చల్లబరుస్తూ సరేనని బాబా అభయం ఇవ్వగానే పకపక నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు.
అప్పుడు అక్కడి భక్తులు ఈతని పిచ్చిని బాబా సమర్ధించడం బాగాలేదని ఈ విషయం గురించి బాబా ఆలోచించాలని అంటారు. అప్పుడు బాబా వారితో ఇలా అంటాడు. ఆలోచించవలసినది నేను కాదు మీరు. “నేను ఈ మసీదులో మీ కోరకు జ్ఞానమార్గాన్ని చూపించి ముక్తికి అర్హులౌనట్లు చేయుటకు కూర్చొని ఉండగా మీరు మాత్రం అల్పమైన విషయాలనే మరియు విషయవంచాలతోనే వస్తున్నారు. ఇప్పటికైనా మీమీ మనోభావాలను మార్చుకోండి. ఈ జీవితంలో మనిషి సాధించవలసినది ఏమిటి? ధనమే ముఖ్యమా? కాదె! కాని దానం కూడ జీవితానికి అవసరమే? అలాంటి జీవితానికి సరిపడు ధనాన్ని ధర్మమార్గంలో తగినంతగా సంపాదించుకోవచ్చును. అందులో తప్పులేదు. అత్యాసతో ధనసంపాదనకే జీవితాన్నంత వ్రుధాచేసి మితిమీరిన ధనాన్ని సంపాదించినా అది ఆఖరికి మరణించినప్పుడు మనిషి వెంటరాదు కదా.   
నా ఆధ్యాత్మిక కోశాగారము పూర్తిగా నిండి పొంగి పొర్లుతుంది. ఎవరికీ ఏమి కావలనన్న ఇవ్వగలను. వారంతట వారు కూడ వచ్చి ఎవరికి కావలసినంత వారు తీసుకొనవచ్చును. కాని అందుకు తగినంత అర్హతను ముందుగా పొందవలెను. నేనిచ్చునది పుచ్చుకొనుటకు ఎవరు ఇష్టపడరు. వారు కోరినదే వారికి కావలెను.నేను విలువైన బంగారము ఇచ్చుటకు సిద్దముగా యుంటిని. కాని వారు పనికిరాని మట్టిగడ్డలనే కోరుతున్నారు.
మనము ఎక్కడి నుండి ఈ మానుష శరీరంలోకి వచ్చితిమి. ఇక్కడ ఉండి ఏమి చేయుచుంటిమి, చివరకు శరీరంలో నుండి ఎక్కడికి వేల్లుచుంటిమి? చావు పుట్టుకల ఈ చదరంగాన్ని నడిపించేదేవారు? కనిపించు సూర్యచంద్రాదులు, నక్షత్రములు, గ్రహరాసులను సృష్టించినవారెవరు? వీటిని గురించి మానవులు ఆలోచించే స్థితిలో లేరు. కేవలం ధనము, శారీరక సుఖము సంసార విషయలోలురై ఈ శరీరమే శాస్వితమనే భ్రమలోపడి దీపమును ఆకర్షించబడి ఆ వేలుగులోపడి కాలిపోయే పురుగులవలె మానవులు నశింపువైపే మొగ్గుచూపెదరు. ఇది పూర్తిగా అజ్ఞానము. జ్ఞానమార్గము దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది. మానవజాతిని జ్ఞానమార్గానికి మరలించటానికే ఈ నా శరీరం ఏర్పడినది, అని బాబా వారికి సుదీర్ఘమైన సందేశము నిచ్చెను.       
అనేకసార్లు బాబా తన బోధనలద్వార నేను అనే పదమును వివరణను ఇస్తూ ఉండేవారు. నన్ను తెలుసుకొనుటకు నీవు ఎక్కడికో పరుగులు తీయవలసిన అవసరం లేదు. నీ శరీరానికి గల నామమును రూపమును తొలగించినచో నీలో మిగులునది నేనే. నీలోనేగాక సకల ప్రాణికోటి యందు సమానముగానే యున్నాను. దీనిని మీరు గుర్తించినచో సకల ప్రాణులలోను నన్నేమీరు చూడగలరు. మీరు ఏ ప్రాణిని హింసించిన నన్ను బాధపెట్టినట్లే. ఇతరుల వలన మీకు కలుగు కష్టనష్టములను సహించి ఓర్చుకోనువారే నాకు మిక్కిలి ప్రేమ పాత్రులని బాబా చెపుతూ ఉండేవారు.


సాయిబాబా ఉపదేశములు:
(మన దైనందిన జీవితంలో ప్రవర్తించవలసిన తీరును గురించి బాబా తరచుగా ఇలా చెపుతూ ఉండేవాడు.)
గతజన్మ సంబంధమువలననే ఇప్పుడు మనము ఒకరి నొకరు కలుసుకోనుచున్నాము. ఏమనిషైనా, ఏ జంతువైనా నీ దగ్గరకు వచ్చినపుడు నిర్ధాక్షిన్యముగా తరిమి కొట్టవద్దు. చక్కగా ఆహ్వానించి తగిన మర్యాద చేయవలెను. దాహముతో నున్న వారికి నీరు, ఆకలితో ఉన్న వారికి అన్నము, దిగంబరులకు బట్టలు ఇవ్వవలెను. నీ వసారా ఇతరులు కూర్చొని విశ్రాంతి తీసుకొనుటకు ఉపయోగపడినచో భగవంతుడు నీపట్ల సంతృప్తి చెంది నిన్ను అనుగ్రహించును. ఎవరైనా ధనము కొరకు నీ దగ్గరకు వచ్చిన నీ కిష్టము లేకున్నవారికి ఈయనక్కర్లేదు. కాని కఠినముగా మాట్లాడి వారి మనసు నొప్పించవద్దు. ఈ ప్రపంచము నడక ఒక నాటకరంగము వంటిది. నీ ముందు జరుగు చిత్రవిచిత్రమైన ఈ నాటకమును శ్రద్ధతో చూచుచుండుము. ఈ ప్రపంచము తలక్రిందులైనా నీవు చలించకుము. స్థిరముగా నుండుము. నీకు నాకు భేదము లేదు. మనిద్దరము ఒక్కటే. నీకు నాకు మధ్యగల గోడను తొలగించుము. మనందరికీ భగవంతుడే యజమాని. అల్లామాలిక్ హై! భగవంతుడు తప్ప ఇతరులెవ్వరు మనలను కాపాడలేరు. భగవంతుని మార్గము అసాధారణమైనది, చాల విలువైనది. మనము ఉహించలేనిది. మన మందరము ఋణాను బంధముచే ఇక్కడ కలిసితిమి. పరస్పర ప్రేమతో కుల, మత, జాతి భేదాలు మాని మానవులందరు సుఖశాంతులతో వర్ధిల్లాలి. పరోపకారమునకు భగవంతుడిచ్చిన ఈ శరీరమును ఉపయోగించవలెను. అట్టి వారి జీవితమే ధన్యము మిగిలిన వారంతా పేరునకే బ్రతికెదరు.


ఏదైనను మనసుతో భగవంతునికి సమర్పించడం వలన కలిగే లాభమే జ్ఞాన సముపార్జనకు మొదటిమెట్టు (సాయిబాబా) :    

పంచేద్రియముల కంటే ముందుగానే మనసు, బుద్ధి విషయములపై వాలి వాటి వాసనలను అనుభవించును. విషయ వాసనలను వదిలి పంచేద్రియములు ఉండలేవు. అందవలన విషయములకు ఇంద్రియములకు మధ్య భగవంతునిని ఒక అడ్డుగా పెట్టినచో మనస్సు యొక్క పరుగు వేగముతగ్గెను. ఏదైనను ముందు భగవంతునికి సమర్పించినచో దాని యందు వ్యామోహము తగ్గును. ఇట్టి భౌతిక విషయములలోనే కాక కామ, క్రోధ, లోభమోహాదులను కూడ గురువున కర్పించిన క్రమముగా చిత్తవ్రుత్తులన్ని నశించును. దీనివలన విషయ విచక్షణా జ్ఞానము కలిగి చక్కని గుణశీలమును వ్రుద్దియగును. సద్గుణముల వలన దేముని యందు నిశ్చల ప్రేమ పెరుగును. దైవానుగ్రహము వలన నేను దేహినికాను అను సత్యము దర్శనమౌను. అప్పుడు మాత్రమె బుద్ధి శుద్దచైతన్యములో లీనమగును. ఇదే ఏకాత్మ భావన. మొదట నేను వేరు విషయ వస్తువు వేరు అనుభవము ఉండును. అందువల్లనే వేరుగా కనిపించే విషయవస్తువు కొరకు మనసు పరుగులు పెడుతుంది. నేను, బయటగల విషయవస్తువు ఒక్కటే అనే ఏకాత్మభావన కలిగినప్పుడు తనకు వేరైనది బయట లేదు అని తెలుసుకోగలిగినప్పుడు, తన రూపమే బయట అనేక విధములుగా ఉన్నదనే సత్యాన్ని గ్రహించగలిగినప్పుడు మనస్సు దేనికొరకు, ఎటూ పరుగులు తీయవలసిన అవసరం ఉండదు. ఉన్నతమైన ఈ స్థితి మనిషి చేరుటకు మొదట సర్వం భగవదార్పనమే తోలి సాధన కార్యక్రమముతో ప్రారంభించాలి. మీ ఆలోచనలకూ, ఆశయాలకు, జీవిత గమనానికి నన్నే లక్ష్యంగా చేసుకున్న మీరు పంచేంద్రియముల ద్వార పొందే ప్రతి అనుభవాన్ని నాకు సమర్పించాలి. లేనిచో మీరు ఇంద్రియములను జయించలేక కోరికలకు బానిసలై తప్పు దారినపడు ప్రమాదం వచ్చును.

గజేంద్ర మోక్షం - గజేంద్రుని మొర:

గజేంద్ర మోక్షం - గజేంద్రుని మొర:


లక్షీదేవికి పుట్టిల్లయిన పాల సముద్రం మధ్య త్రికూటమనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతపు లోయలలో అతి సుందరమైన సరస్సులు, పుష్పవృక్షాలు ఉన్నాయి.
హూహూ అనే గంధర్వుడిని దేవలముని శపించగా ఆ త్రికూట పర్వతపు లోయలలో ఉండే ఒక సరస్సులో మొసలిగా మారిపోయాడు.
పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. అగస్త్యముని శాప కారణంగా ఇంద్రద్యుమ్నుడు త్రుకూట పర్వత సమీపంలో ఉండే అడవిలో తిరిగే ఏనుగు రాజయిపోయాడు. ఆ ఏనుగులరాజు దాహం తీర్చుకొందామని ఒక సరోవరం కనిపించగానే ఆనందంగా దాహం తీర్చుకుని , తన గుంపుతో జలక్రీడలాడుకోడం మొదలు పెట్టాడు.
ఆ సరోవరరంలోనే శాపవశాన్న మొసలిగా మారిన గంధర్వుడు ఉన్నాడు. ఆ మొసలి చట్టున వచ్చి , ఏనుగురాజు కాళ్ళు పట్టుకుంది. అకస్మాత్తుగా వచ్చిన ఆ మొసలి నుంచి విడిపించుకుందామని గజేంద్రుడు యెంతో ప్రయత్నించాడు. కష్టమవుతుంటే మిగతా ఏనుగులుకూడా సాయం చేయవచ్చాయి. కాని లాభం లేకపోయీంది. హోరా హోరీగా ఆ రెండూ వేయేళ్లు పోరాడుకున్నాయి.
క్రమంగా ఏనుగు అలసిపోయి , మొసలిదే పైచేయి అవవచ్చింది. గజేంద్రుడికి మరి తన శక్తితో లాభం లేదని తెలిసిపోయింది. పూర్వజన్మ వాసన వలన దైవచింత వచ్చింది. అందరినీ రక్షించే ఆ దేవుడే నన్ను కాపాడాలి అని ఆలోచించి , " నేనింక పోరాడలేను అని దేవుని ఈ విధంగా ప్రార్ధించడం మొదలు పెట్టాడు గజరాజు .
కనబడుతున్న ఈ జగత్తంతా ఎవరినుండి వస్తున్నది? ఎవరియందు నిలబడుతున్నది? తిరిగి ఎవరియందు లీనమవుతున్నది? ఈ సృష్టికి ములకారణ మెవ్వరు? ఆది మధ్యాన్తరహితుడైన వాడెవ్వడు? అలాంటి ప్రభువునకు ప్రణమిల్లుతున్నాను.
ఒకపరి లోకాలను వెలువరిస్తూ, ఒకపారి ఆ లోకాలను లోపలికి తీసికొంటూ, రెండూ తానే అయి రెండింటికి సాక్షిగా ఉంటూ ,అన్నింటికీ ములమై వెలుగుతున్న అతనికి నమస్కరిస్తున్నాను.
లోకాలున్నాయి, లోక పాలకులున్నారు, లోకస్తులున్నారు. ఇలా భిన్న భిన్నంగా గోచరిస్తున్నారు. ఈ భిన్నత్వమనే పెనుచీకటికావల ఏకాక్రుతితో వెలుగుతున్న ఆ వెలుగుల మూర్తికి నమస్కరిస్తున్నాను. 
అతడు నటన సూత్రధారి. ఈ నామరుపలన్ని అతని వివిధ భంగిమలే! అతడే ఇన్ని మూర్తులుగా గోచరిస్తూ జగన్నాటకాన్ని ఆడుతున్నాడు. అతనిని కీర్తించడానికి, అతని వర్తనాన్ని గ్రహించడానికి ఎవరికీ సాధ్యమవుతుంది? అలాంటి దేవదేవునికి నమస్కరిస్తున్నాను.
ముక్తసంగులైన మునులు, సర్వభూతహితులైన ప్రేమ స్వరూపులు, సాధువర్తనులు. వీరందరూ కూడా ఎవరి పాదాలను ఆశ్రయిస్తున్నారో, ఆ పాదాలే నాకు కూడ దిక్కని నేను నమ్ముకొంటున్నాను. 
దైవాన్ని ఇలా పొడగట్టించుకొనే ప్రయత్నం గజేంద్రుని నుండి జరుగుతూ ఉండగా, మొసలి అతడిని మరింతగా వేధించసాగింది. ఆ వేధింపకు అతడు కలత చెందినవాడై.
తప్పు, తప్పు ఇలా అనరాదు. కలలోనైనా ఇలా అనుకోకూడదు. ఎన్ని సార్లు ఎందరిని ఎన్ని విధాలుగా రక్షించలేదు అతడు. ప్రార్ధించడం చేతకావాలేకాని, అతడు పలక్కపోవడం ఉంటుందా.!
కలిమి లేములతో నిమిత్తం లేకుండా కలసివచ్చే వాడతను. ఆ మాత్రం నన్ను కనికరించాడా! దుష్టులపాల పడుతున్నప్పుడల్లా శిష్టులను ఆడుకొనే వాడతను. ఆ మాత్రం నన్ను ఆదుకోడా! చూడగలిగిన కన్నుతో, తనను చూడగలిగిన వారందరిని తానుగా చూచుకొనేవాడు. ఆ మాత్రం నన్ను చూచుకోడా? తనకోసం మొరలిడే వారి మొరను తానుగా వినివచ్చి, చేయూత నందించేవాడే ఈ నా మొర వినడా!
ఇన్ని రూపులు తన రూపమైనవాడు, ఆది మధ్యాంతాలు లేనివాడు. ఆత్మ బంధువు. ఆపద్భాందవుడయినవాడు. ఈ నా స్థితిని వినడా, చుడడా, తలపడా, నా కొరకు వెంటనే తరలిరాడా! తప్పక వస్తాడు.
తండ్రీ! ఇంతవరకు నేనుచేస్తూ వచ్చినదాన్ని నేను గమనించుకొన్నాను. నా ప్రయత్నాన్ని నా ప్రయత్నంగా కొనసాగిస్తూ ,నీ అనుగ్రహం కోసం వెంపర్లాడుతున్నాను. అందువల్లనే నెమో బహుశ నా పిలుపు నిన్ను చేరలేకపోతుంది.
తెలిసికొన్నాను. నా ప్రయత్నమనేది వేరే లేదనీ, అదికూడా నీ అనుగ్రహంలో భాగమేనని తెలుసుకొన్నాను. నీ అనుగ్రహాన్ని పట్టుకొని, కొంతనాడిగా కొంత నీదిగా భ్రమపడుతున్నాననీ కూడ అర్ధం చేసికొన్నాను. ఈ నా దృష్టిని సరిజేసి కొంటున్నాను. తండ్రీ! నన్ను కరుణించు! మా ప్రయత్నమనీ, దైవానుగ్రహమనీ. ఉన్నదీ, రెండుగా కనబ్డుతున్నదీ ఒక్కటే! అదే నీ అనుగ్రహం.
ఇక నా పరిస్థితి గమనించు. 
జీవుల మాటలన్నీ వినిపించుకొంటావట నీవు. మా హృదయ ఘోషలన్నీ గమనించు కొంటావట? ఆర్తులను రక్షించడం కోసం ఇక్కడా, అక్కడా అని లేకుండా ఎక్కడికైనా వచ్చేస్తావట? జీవులు ‘కో’ అని పిలిస్తే నీవు ‘ఓ’ అని పలుకుతావట. తండ్రీ , రావా, నన్ను చేరరావా! నన్నాదుకోవా ! నన్ను నీ అక్కున జేర్చుకోవా!
ఆ గజేంద్రుని మొరవిన్న శ్రీమహావిష్ణు మూర్తి ప్రక్కనున్న లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖు చక్రాలను చేపట్టలేదు. పరివారాన్ని పిలిపించలేదు. గరుత్మంతుడు వచ్చేవరకైన ఆగలేదు. తలకట్టునైనా సరిజేసుకోలేదు. ఆటలాడే వేళలో తన చేతిలోనికి వచ్చిన పైటను ఆమెకు వదిలివేయాలని కూడా అతనికి తోచలేదు.
ఆ విష్ణువు దృష్టిలో గజేంద్రుడు మాత్రమె ఉన్నాడు. గజేంద్రుని మొరమాత్రమె అతనికిప్పుడు వినబడుతోంది. గజేంద్రుని వైపు వేగంగా సాగి వచ్చేస్తున్నాడు.
ఆ విధంగా బయలుదేరిన ఆయనను అనుసరిస్తూ లక్ష్మితో సహా మొత్తం సపరివారం వైకుంతం నుండి వారు కూడా శ్రీహరిని అనుసరిస్తూ వచ్చేస్తున్నారు.ఇంతకూ గజేంద్రుడు పిలిచిందీ ఆ ఒక్కణ్ణి ! ఆ ఒక్కడు కదిలాడు. అంతే! ఇక అంతా కదిలారు. నారాయణుడు వెనుక ముందు చూడలేదు. గజేంద్రుడి వైపుగా వచ్చేస్తున్నడంతే! ఆయన వస్తున్నప్పుడు దేవతలంతా నమస్కరిస్తున్నారు, కాని ఆయనకు గజేంద్రుని మొర తప్ప ఆయనకు ఏమి వినబడటం లేదు. అతని దృష్టంతా గజేంద్రుని పన్నే ఉంది.  
క్షణాలలో సరస్సును సమీపించాడు నారాయణుడు. సమీపించడమే తడవుగా చక్రాయుధాన్ని మకరంపై ప్రయోగించాడు. ఆ మొసలికి తల తెగి పడింది. 
అందివచ్చిన ఆ అనుగ్రహానికి అమితంగా ఆనందిస్తున్నాడు గజేంద్రుడు ఆ ఆనందంలో నుండే విష్ణు స్మరణలో ఓలలాడుతున్నాడు. విజయసుచకంగా విష్ణుమూర్తి శంఖానాదం చేశాడు.  

అమ్మ అంటే


అమ్మ అంటే
 నీకు జన్మ నిచ్చిన పునీత!
నవమాసాలు మోసి
 తన రక్తాన్ని నీకు పంచి
 ప్రాణం పోసిన దేవత
 తన ఒడి నిన్ను భద్రంగా
 దాచుకునే గుడి
 నీకు మాట నేర్పేబడి
 అది నీకు నడక నేర్పే మైదానం
 నీకు నడత నేర్పే విద్యాలయం
 అమ్మ పెట్టే ముద్దు కొండంత హాయినిస్తుంది
 అమ్మ కౌగిలింత నునువెచ్చగా చుట్టుకుంటుంది
 అమ్మ తలపే ఒక ఊయల
 బొమ్మగా చేసి నిన్ను ఊగిస్తుంది
 అమ్మ పిలుపే ఒక పాట
 పలికిస్తుంది వేనవేల రాగాలు నీ నోట
 ఆపదలో వున్నా ఏ పనిలో వున్నా
 అమ్మా అనే మాట
 అలుపు తీరుస్తుంది
 ఆనందాన్నిస్తుంది
 మకరందంలోని తీయదనంలా
 మమతలను పంచుతుంది
అమ్మ రూపం కనిపించే దైవం
అమ్మలో ఒక భాగం జీవమున్న మనం
 అందుకే-
అమ్మని అవమానపరచకు
అవస్థ పెట్టకు
 పాలుతాగిన రొమ్మునుంచి
 రక్తాన్ని పీల్చకు
 గుండె గాయపరచకు
 ఆమెకు పెట్టే పట్టెడు మెతుకులకు
 లెక్కలు కట్టకు