మానవుడు సత్వగుణంతో జీవిస్తున్నప్పుడు, మంచి నడవడిక కలిగి, నీతినియమాలతో అంచరిస్తున్నప్పుడు, అతడు ప్రదర్శిస్తున్న కరుణ, దయ, జాలి, ప్రేమ, త్యాగం, ఆనందం, తృప్తి వంటి గుణాలతో అలరారుతున్నప్పుడు అతని మనస్సు ఉన్న స్థితినే హృదయం అంటారు. ఆ విధంగా హృదయం అంటే మానవుని శుద్దమైన మనస్సే కాని అతనిలో రక్త ప్రసారం కావించే గుందేకాయ కాదు. ఆత్మానుభూతిని కలిగించే స్థానాన్నే హృదయం అంటున్నారు. అది రెండు కన్నుల మధ్య మూడవ నేత్రం ఉండే స్థానం వద్ద ఉంది. మూడవ నేత్రం ఉండే స్థానాన్నే ఆజ్ఞాచక్రం అని అంటారు. సామాన్య మానవుల మనస్సు విషయవాంఛనలతో కూడి ఉండడం వలన వారి హృదయం లోకవాంచలతో కూడి అజ్ఞానంతో సంచరిస్తూ ఉంటుంది. అదే సాధకుని మనస్సు లౌకిక ప్రవృత్తికి మరలి, ధార్మికతతో, నైర్మల్యంతో గడుపుతున్నప్పుడు వారి హృదయం ఆత్మ జ్ఞానంతో సంచరిస్తూ ఉంటుంది. అటువంటి ఉన్నత స్థానం నుంచి సాధకునికి జ్ఞానమనే(పరమాత్మా) సూర్యుడు ప్రకాశిస్తే అతనికి అజ్ఞానమనే చీకటి సంపూర్ణంగా తొలగిపోతుంది.
No comments:
Post a Comment