Saturday, November 7, 2015

కర్మలు – II (రెండవ విభాగం) :

ఇక్కడ రెండవ విభాగంలో  కర్మలు బంధాలు కాకుండా ఎలా అనేది ఇందులో వివరిస్తాను).
ఆగామి కర్మలు బంధం కాకుండా ఎట్లు : మనం ఇప్పుడు చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. ఎటువంటి కర్మ చేసిన ఆ కర్మఫలం అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం . అందువల్ల కర్మలు చేస్తూ కూడా ఆ కర్మఫలం మనకు అంటకుండా, బంధం కాకుండా తప్పించుకొనే ఉపాయాలను భగవానుడు మనకు భగవద్గీతలో తెలియచేసాడు.
అవి :
1. కర్త్రత్వాభిమానం లేకుండా కర్మలు చేయుట
2. నిష్కమలంగా, ఫలాసక్తి లేకుండా కర్మలు చేయుట.
కర్మణ్యేవాధి కరస్తే మాఫలేషు కదాచన |
మకర్మఫలహేతుర్భు, మాతే సంగోస్త్వకర్మణి ||      (భగవద్గీత 2:47)
కర్మలను ఆచరించుట యందె నీకు అధికారము కలదు కానీ, వాటి ఫలితములపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణమూ కారాదు.అట్లని కర్మలను చేయుట మానరాదు.
౩. లోకా కళ్యాణం కొరకు, భగవత్ప్రీతి కొరకు కర్మలు చేయుట.
4. ఈస్వరార్పితంగా కర్మలు చేయుట.
 ఈ విషయన్నే రమణ మహర్షి “ఉపదేశసారం” లో ఇలా తెలియచేసారు.
“ఈస్వరార్పితం నేచ్ఛయాకృతం | చిట్టా శోధకం, ముక్తి సాధకం ||”
అంటే పైన చెప్పిన ప్రకారం కర్త్రుత్వాభిమానం లేకుండా కర్తవ్యతాభావంతో, నిష్కామంగాను, ఫలాశాక్తిలేకుండాణను, లోకహితార్థంగాను, ఈశ్వరార్పితంగాను కర్మలు చేసే విధానమే కర్మయోగం అంటారు.
అంటే కర్మను కర్మగా గాక, కర్మయోగంగా చేయుట ద్వార మనం చేసే కర్మలు సంకుచితం కాకుండా, మనకు బంధాలు కాకుండా చేసుకోవాలి.కనుక మనంచేసే కర్మలను ఒకటికి రెండుసార్లు బుద్దితో యోచించి, శాస్త్రం ఎలా చెబుతుందో తెలుసుకొని, మన మనోబుద్దులు అందుకనుగుణంగా సవరించుకొని కర్మలు చేయాలి.ఎక్కుపెట్టిన బాణం వంటిది ఆగామి కర్మ. ఇది చేయటం మన చేతుల్లో వున్నది గనుక జాగ్రత్త పడాలి. బంధాల నుండి తప్పించుకోవాలి. కనుక ఆగామి కర్మలను కర్మయోగం ద్వార చేసి బంధాలు కాకుండా చూసుకోవాలి.


ప్రారబ్ధ కర్మలు బంధం కాకుండా ఎట్లు : జీవుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో అప్పటికి ఉన్న సంచిత కర్మలలోనుండి ఏవి పక్వానికి వస్తాయో ఆ కర్మలను ప్రారబ్ధ కర్మలు అంటారు.ఆ ప్రారబ్ధ కర్మలను అనుభవించటానికి తగిన శరీరాన్ని ధరించి జీవుడు ఈ లోకంలోనికి వచ్చిపడుతాడు. ఆ ప్రారబ్ధ కర్మలన్నిటిని తప్పక అనుభవించాల్సిందే. అలా అనుభవిస్తేనే ఆ కర్మలు ఖర్చు అయ్యేది. అనుభవిస్తేనే ప్రారబ్ధ కర్మల నుండి విముక్తి. ప్రారబ్ధ కర్మలు అంటే ధనస్సు నుండి విడిచిన బాణం వంటివి.
కనుక ప్రారబ్ధ కర్మ ఫలాలను భగవత్ స్మరణతో భక్తి యోగం ద్వార అనుభవించి ఖర్చుచేసుకోవాలి.


సంచిత కర్మలు బంధం కాకుండా ఎట్లు : ఆగామి కర్మలు చేయటంలో మనకు స్వతంత్రం వుంది. కనుక కర్మయోగం అనే ఉపాయంతో ఈశ్వరార్పణంతో చేస్తాము. ప్రారబ్ద కర్మలను భగవత్ స్మరణతో భక్తి యోగం అనే ఉపాయంతో అనుభవిస్తాము. కానీ ఇవి ఎప్పుడో ఇంతకూ ముందు జన్మలవి , ఇప్పుడు ఖర్చు చేద్దాం అంటే పక్వానికి రాలేదు.కనుక వీటిని అన్నిటి నుండి సంపూర్ణంగా తప్పించుకొని కర్మబంధనం లేకుండా వుండాలంటే , మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తి పొందాలంటే, మోక్షం పొందాలంటే, శాస్వతనందాన్ని పొందాలంటే , ఆ పరమాత్మునిలో ఐక్యం కావాలంటే ఈ సంచిత కర్మలన్నిటిని ఒక్కసారిగా దగ్దం చేయాలి ? ఎక్కడ ? జ్ఞానాగ్నిలో, “జ్ఞానాగ్ని దగ్ద కర్మాణాం” అని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. కనుక జ్ఞానమనే అగ్నిలో సర్వకర్మలు దగ్దం చేయుట ఒక్కటే మార్గం.ఈ ఉపయాన్నే జ్ఞానయోగం అన్నారు.  

జ్ఞానం అంటే ఏమిటి ? నీ స్వస్వరూప జ్ఞానమే జ్ఞానం.అంటే నీ యొక్క అసలు రూపమే సచ్చిదానంద స్వరూపం, అంటే నీవు ఈ మాంసక్రుతులతో కూడిన ఈ శరీరం కాదు , నువ్వు ఆత్మవు అయిన ఆ సచ్చిదానంద స్వరుపుడివి అని తెలుసుకోవడం.ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి. తెలుసుకున్నంత మాత్రాన దగ్ధమై పోతాయ అన్న సందేహం వలదు. తప్పకుండ దగ్ధమై పోతాయి.

దేహమే దేవాలయం:

దేహమే దేవాలయం: 
ఓ మిత్రులారా! మనం అందరం చిన్నప్పటి నుండి మన పెద్ద వాళ్ళు చెప్పారని దేవాలయాలకు పోతున్నాము. అక్కడ గర్బగుడిలో వున్న ఈశ్వర లింగాన్ని లేక అక్కడ వున్నా దేవత ప్రతిమని చూసి మనసార మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి ఈరోజు గుడికి వెళ్లి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకోని మనం సంతృప్తి పడతాము.కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్నీ గ్రహించాలి.అది ఏమిటంటే దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం అందులో (గర్భ గుడిలో) అంటే అంతరంలో ఈశ్వరుడు . అతని దర్శనం.
ఇక్కడ వేదాంత విషయం ఏమిటంటే “దేహమే దేవాలయం” అవును నీ దేహమే, పంచభూతాలతో నిర్మితమైన నీ శరీరమే దేవాలయం ఈ శరీరానికి, మనస్సుకు, బుద్దికి, ప్రాణానికి, జీవానికి (అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు) అన్నిటికి శక్తిని ఇచ్చే ఆ పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ శరీరపు అంతరంలో హృదయంలోనే స్వయం ప్రకాశితమై దేదీప్యమానంగా వున్న ఆ చిదానంద స్వరూపుడు అయిన ఆ దేవదేవుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిర్గుణుడు, సమస్త లోకాలకు సృష్టి కర్తయైన ఆ సర్వేశ్వరుడు ఈ శరీరపు అంతరంలోనే వుండి తను ఏమి చేయక తన శక్తి చేత ఈ శరీరాన్ని ముందుకు నడుపుతున్నాడు. 
నీ శరీరపు అంతరంలో వున్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాసశితమై వెలుగుచున్నాడు అక్కడ ఏ సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. ఆయనే స్వయం ప్రకాశి. సూర్య చంద్రులు కూడా అయన యొక్క శక్తి చేతనే ప్రకాశింపబడుతున్నారు.
ఈ వేదాంతాన్ని గ్రహించి మిత్రులారా మీరు అందరు ఇప్పటి నుండి ఈ రోజు నుండి దేవాలయానికి పోయే ఆ సమయాన్ని మీ హృదయాంతరాలంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవదేవునిని మీద మనస్సు ఉంచి సాధన (అంటే ధ్యానం) ద్వార మీ హృదయాంతరంలోనే దర్శించుకొని మీరు పొందిన ఈ మానవ జన్మకు సార్ధకతను ఇవ్వండి. అదియే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

అదియే దేవాలయం యొక్క విశిష్టత. దేవాలయానికి వెళ్లి గుడిలో వున్నా లింగాన్ని దర్శించడం అంటే మనం మన హ్రుదయాన్తరంలో వున్న ఆ సర్వేస్వరున్ని ధ్యానం ద్వార పరిపూర్ణ (సంపూర్ణ) దర్సనం చేసుకోవాలి అని ఆ విధంగా మనం దానిలోని వేదాంతాన్ని గ్రహించడానికి మన పెద్దలు అలోచించి అలా చేయవలసి వచ్చింది.

దేవుని ప్రతిమను ఎందుకు కొలవాలి ?

దేవుని ప్రతిమను ఎందుకు కొలవాలి ?
ఇక్కడ ఒక విషయం చెప్పాలి అది ఏమిటంటే మనం చిన్నప్పటి నుండి మన పెద్దలు ఆచరించే వ్యవహార శైలిని మనం తూచ తప్పకుండ పాటిస్తూ వస్తున్నాము. కానీ వాళ్ళు దాని అంతరార్ధాన్ని మాత్రం వివరించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడ ఎదో దేవుని ప్రార్ధన చేసుకున్నాము ఈ రోజు ఒక పని అయిపోయింది అనుకోని అలానే కాలాన్ని వేల్లదీస్తురావడమే, కానీ ఇక్కడ వున్నా వేదాంత విషయం ఏమిటంటే దేవుని ప్రతిమను కొలవడం అంటే పరిపరివిధాల పోయే మన మనస్సును ఒక చోట నిలిపి ఆ పరమాత్ముని మీదకు మరల్చడానికి ఆ దేవదేవుని దివ్య దర్శనాన్ని మన అంతరంలోనే దర్శించడానికి మన పెద్దలు ఎంతగానో అలోచించి అలా చేయవలసి వచ్చింది.  
కావున మిత్రులారా మీరు అందరు ఈ రోజునుండే ఇప్పటి నుండే ఈ అంతరార్ధాన్ని గ్రహించి మీ మనస్సును పరిశుద్ధం చేసి ఆ మనస్సును మీ అంతరంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ స్వయంప్రకాసకుడైన ఆ చిదానంద స్వరుపుడి మీదకు మీ మనస్సును మరల్చి ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని మీ హృదయంతరంలో దర్శించుకొని తరించవలసిందిగా నా మనవి.

మానవుడే మాధవుడు :

ఇది చాల చోట్ల విని వుంటాము అంతే కాక చాల చోట్ల రాసి వుంటారు కూడ. కానీ దీని అంతరార్ధాన్ని మాత్రం అంతగా గ్రహించి ఉండము. ఎందుకంటే ఇది చాల చిన్న విషయంగా పరిగనణిస్తాము .
“మానవుడే మాధవుడు” అంటే ఇందులో చాల వేదాంత రహస్యము వుంది. అది ఏమిటంటే ఈ సమస్తము (అంటే ప్రకృతి) ఆ పరమాత్ముని యొక్క ప్రతిరూపాలు అన్న మాట. అంటే ఈ కంటికి కనిపించే ఈ నశ్వరమైన ప్రపంచము మొత్తము సృష్టి అంతా పరమాత్ముడే అదేలగు అంటే మనం బంగాంరంతో ఏవేవో ఆభరణాలు చేస్తాము అంటే హారాలు, ఉంగరాలు,  కమ్మలు,  వడ్డానం అని ఇలా ఎన్నెన్నో చేస్తాము వాటి అన్నిటిని కరిగిస్తే చివరకు మిగిలేది బంగారమే అలాగే ఈ నస్వర ప్రపంచము మొత్తం చివరకు ఆ శక్తిగానే (పరమాత్మాగానే) మారుతుంది.
మానవుడే మాధవుడు అవును ఇది సత్యం. దేవుడు కరుణామయుడు, ఎంతో దయ కలవాడు, చాల జాలి కలవాడు అన్నిటికి మించి ఎంతో ప్రేమమయుడు. ఎంతగా అంటే నీవు ఏది కోరితే అది నీకు ఖచ్చితంగా ఇస్తాడు అది ఇస్తున్నాడు. అంతటి సత్యవంతుడు ఆ పరమేశ్వరుడు. ఇన్ని దివ్యగుణాలు కలిగివున్నాడు ఆ సర్వేశ్వరుడు. ఆ దేవదేవుని దివ్యగునాలు అన్నియు నీలోను వున్నాయి. నిజానికి ఈ దివ్య గుణాలే నువ్వు. కాని వాటిని అన్నిటిని మనం చెరిపేసి అహంకారంతో అజ్ఞానంతో అవిద్యతో మరీ ముఖ్యంగా స్వార్ధంతో వాటిని అన్నిటిని తొక్కి కాలు క్రింద పెట్టి నేను నా వాళ్ళు అనే ఒకే ఒక్క స్వార్ధ చింతనతో రోజురోజుకు మనుషులందరూ రాక్షషులు కంటే దిగజారిపోతున్నారు.
కావున ఈ సమస్తాన్ని పరమాత్మగా భావించి అందరిలోనూ అంతటను ఆ దేవదేవుడే అని గ్రహించి సేవ చేయడం మొదలుపెట్టు. మతికిపెట్టుకో  నీవు చేసే సేవా ఎప్పటికైన అది నిస్వార్ధంగా వుండాలి ఎంతగా అంటే నీవు కుడి చేత్తో చేసే సేవ నీ ఎడమ చేతికి కూడ తెలియకూడదు అంతగా. నీవు చేసే సేవ ఆ పరమాత్ముడికే అనే సంపూర్ణ భావనను గ్రహించి నేను చేశాను అనే అహంకారాన్ని నీ మనస్సు నుండి సంపూర్ణంగా విసర్జించు. అప్పుడే మానవుడు మాధవుడు అవుతాడు. మాధవుడు అంటే దేవుడు అని అర్థం.
దేవుడైన మనకు ఒక సహాయం చేయాలంటే ఒక మానవ రూపం అంటే పంచభూతలతో నిర్మితమైన ఒక శరీరాన్ని ఏర్పరచుకొని వచ్చే సహాయం చేస్తాడు. అది ఇప్పుడు నీవే  చేసి ఆ దేవదేవుని కృపకు ఆ దేవదేవుని దయకు కృతార్తుడివి కమ్ము.
ఆ విధంగా చేసిన వాళ్ళు మనకు ఎంతో మంది వున్నారు.మదర్ తెరిస్సా, ఈమె ఎక్కడి నుండో వచ్చి ఇక్కడి పిల్లలను తన పిల్లలుగా భావించి సేవించి ఆమె ఈ లోకంలో ఒక చెదరని ముద్ర వేసుకుంది. అంటే ఆమె చేసే సేవ ఆ భగవంతునికి అని సంపూర్ణంగా భావించిందే తప్ప ఇది నా దేశం కాదు నా వాళ్ళు కాదు అని ఆమె భావించలేదు ఆమె భావన ఆమె చేసే సేవ ఆ దేవదేవుడైన ఆ పరమాత్ముడికే అని భావించింది.
అదే విధంగా ఎస్తుక్రీస్తు అయన కూడ ఎంతో మందికి తన కరుణ మరియు అజ్ఞానంలో ఎంతగానో కొట్టుమిట్టాడుతున్న వారికి జ్ఞానబోధ చేసి కృతార్తుడయ్యాడు. అంతటి మహానుభావుడు మనకందరికీ ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పడే తప్ప నేనే దేవుడిని అని ఆయన ఎక్కడ చెప్పలేదు. అంటే ఆయన చేసిన సేవ ఎంతగా అంటే వర్ణింపనలవికాదు అంతగా తాను తన దివ్య వాక్కులతో తన ప్రేమను పంచి ఎంతో మందికి తాను స్వస్తత కూడ చేకుర్చాడు. ఆయన కూడ తానూ చేసిన సేవను ఒక బాధ్యతగా చేసాడు అంటే తాను తన తండ్రి చేతిలో ఒక పనిముట్టుగా అని భావించాడు. ఆయన చేసిన సేవ పరమాత్ముడికే అని భావించాడే తప్ప నేను చేస్తున్నాను అని తను ఎప్పుడు భావించలేదు.
అదేలాగు షిరిడి సాయిబాబా, సాయిబాబా అనే పదం వింటానే మన మనస్సుకు ఒక ఆహ్లాదం ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది కదా. అందరికి దేవుడు ఒక్కడే అని చాటిచెప్పిన మహానుభావుడు ఆ సాయే. సాయిబాబా తన జీవితాన్ని మరియు ఆయన ప్రాణాన్ని కూడ ఆయన అల్లుడుకి ప్రసాదించిన త్యాగమూర్తి ఆ సాయిబాబా. వచ్చిన భక్తులందరి కోర్కెలు తీర్చి వారికందరికీ వారి కనుగుణంగా జ్ఞాన బోధ చేసి కల్పతరువయ్యాడు ఆ సాయి. సాయి ఎంతగా తానూ సేవలు చేసాడంటే, తన చేతిని కాల్చుకొని తన భక్తురాలి బిడ్డను నిప్పుల కొలనులో నుండి కాపాడిన కరుణామయుడు ఆ సాయి. అంటే అయన సేవ చేయడం కోసం తన శరీరాన్ని మరియు తన ప్రాణాన్ని సైతం సమర్పించిన మహానుభావుడు. అంతటి మహానుభావుడు కూడ పరమాత్మునికే నేను సేవ చేస్తున్నానని ఆ దేవదేవుని కృపకు మీరు కూడ పాత్రులు కండి అని చెప్పినాడు.

ఇలా ఎంతో మంది నిస్వార్దంగా లోక కళ్యాణార్ధం సేవలు చేసి వారు అంతా మాధవులుగా ఈ ప్రపంచంలో ఎంతగానో పేరుతెచ్చుకున్నారు. అటువంటి గొప్ప సద్గుణాలు కలవానివే నువ్వు కావున నువ్వు నిస్వార్ధ సేవ చేసి ఆ దేవదేవుడి కృపకు పాత్రుడివి కమ్ము. సేవ మాత్రమే చెయ్యి ఫలితాన్ని ఆశించకు. నీవు చేసే సేవ నిస్వార్ధంగా వున్నప్పుడు మాత్రమే నువ్వు మాధవుడివి అవుతావు. సేవ చేయడం మాత్రం మొదలు పెట్టు అది పరమాత్ముడికే అని సంపూర్ణంగా భావించు.

నరుడే నారాయణుడు :


నరుడు అంటే మానవుడు నారాయణుడు అంటే ఆ దేవదేవుడు పరమాత్మా స్వరూపుడు. మానవుడు ఏంటి నారాయణుడు కావడమేంటి? ఎలా?
మానవుడు నిజానికి పరమాత్మా స్వరూపుడు, తను అది యందు పరిపూర్ణుడే, కానీ తను (మానవుడు) చేసే కర్మలను అజ్ఞానంతో అవిద్యతో తానే బాద్యుడిని అనుకోని అంటే అహంకారం ఆవరించి తను తన స్వస్వరుపాన్ని మరచి  ఈ ప్రక్రుతి మాయలో తను బందిగా అయినాడు. అప్పుడు పరమాత్మా స్వరూపుడైన మానవుడు జీవత్మగా మారి ఈ జనన మరణ చట్రంలో చిక్కుకోనిపోయాడు. ఆ విధంగా నరుడు ఈ మాయా ప్రకృతిలో పడిపోయి తన గమ్యాన్ని కూడ మరచిపోయాడు. చివరకు అధోగతి పాలవుతున్నాడు.
నారాయణుడు అంటే పరమాత్మా స్వరూపుడు. భగవద్గేతలో శ్రీకృష్ణుడు అర్జునకు, ఓ అర్జునా నీకు నాకు ఇద్దరికీ శరీరాలు వున్నవి ఇద్దరం కర్మలను చేస్తున్నాము కానీ నేను వీటికి బందీకాను ఎందుకంటే నేను జ్ఞానాన్ని కలిగివున్నాను కాని నువ్వు అజ్ఞానంలో వున్నావు ఆ అజ్ఞానంతో నువ్వు చేసే కర్మలకు నేను చేస్తున్నాను  అనే అహంకారంతో నీ పైన వేసుకొని బందీ అవుతున్నావు. కావున నీవు జ్ఞానివై యోగివై, నీవు చేసే కర్మలు నిష్కల్మషంగా, లోక కల్యానార్ధంగా, ఫలాశక్తిరహితుడవై, నీవు చేసే ప్రతి పని నాకు సమర్పించి నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు అర్జునా!      
చూసారా! ఇద్దరు శరీరాలను కలిగి వున్నారు, ఇద్దరి శరీరాలను వుత్తేజపరిచే (అంటే శక్తినిచ్చే) ఆత్మ కూడ ఒకటే కానీ శ్రీకృష్ణుడు మాత్రం పరమాత్ముడు అయ్యాడు అదే అర్జునుడు నరుడయ్యాడు ఎందుకంటే అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు కానీ శ్రీ కృష్ణుడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అదియే భేదం. అందుకే వీరిని “నర నారాయణులు” అని కూడ అంటారు మీకు తెలుసా.
అంటే అజ్ఞానంలో వుంటే నరుడు, అదే నరుడు సంపూర్ణ జ్ఞానాన్ని పొంది ఆ దేవదేవుని దివ్య మంగళ స్వరూపాన్ని హృదయంలో దర్శించి తరించి పరిపూర్ణుడైతే, అదే నరుడే నారాయణుడు అవుతున్నాడు.
కావున మిత్రులారా అంతరార్ధాన్ని గ్రహించి, గ్రహించిన దానిని సంపూర్ణంగా తెలిసికొని ఎత్తిన మానవ జన్మకు సార్ధకతను ఇవ్వండి.

జీవుడే దేవుడు :


 జీవుడే దేవుడు అదేలగు అంటే జీవుడు అంటే కర్మబంధనాలతో కూడిన ఆత్మ. ఇక్కడ ఈ కర్మ బంధనాలు ఆత్మకు ఏమి అంటవు అవి అన్నియు అజ్ఞానంతో మరియు అవిద్యతో నేను అనే అహంకారంతో నావి అనే స్వార్ధంతో ఏర్పరచుకున్న పొరలు ( అవే కర్మ బంధనాలు) ఈ విధంగా పరిపూర్ణుడైన ఆత్మ స్వరూపుడి చుట్టూ, మనం శరీరం వున్నప్పుడు అహంకారంతో ఏర్పరచుకున్న బంధనాల మూలంగా దైవ స్వరూపులైన మనం జీవులుగా మారుతున్నాము. 

కావున ఇప్పటికైనా గ్రహించండి మీ హృదయ అంతరంలో దేదీప్యమానంగా స్వయం ప్రకాశితమై వెలుగొందుతున్న ఆ దివ్య మంగళ స్వరూపాన్ని సాధన (ధ్యానం) ద్వార మీ అంతరాలలో దర్శించి మీరు అంతా అజ్ఞానంలో అలమటిస్తున్న అహంకారంతో నేను అని వున్నా భావనని సంపూర్ణంగా తొలగించి శాస్వితుడు అయిన నిరాకారమైన ఆ దేవదేవుని స్వస్వరూపాలు అని గ్రహించి మీ జన్మలను ధన్యం చేసుకొని సంపూర్ణంగా ముముక్షువులు కండి.

దేవున్ని పొందేందుకు మార్గాలు :

దేవుణ్ణి పొందేందుకు అంటే దేవునిలో (పరమాత్మలో) ఐక్యమయ్యేందుకు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కొన్ని మార్గాలను తెలిపాడు అవి :
కర్మ యోగం : మొదటగా ఈ కర్మలు మనం ఎందుకు చేయాలి. ఇవి అన్నియు మనకు ఏమి సంబంధం? అంటే మనం ఎన్నో జన్మలనుండి అజ్ఞానంతో నేను అనే భావనతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు. వీటిని అన్నిటిని జ్ఞానంతో చేస్తే మనము వీటి నుండి సంపూర్ణంగా విముక్తి పొందుతాము. అదేలాగు అంటే కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మ అని అంటాము. అది ఏదైనా కావచ్చు. చేసే ప్రతి పనిని మనం ఈ శరీర భావనతో అజ్ఞానంలో వున్నప్పుడు చేస్తూ నేను చెస్తున్నాను అనుకుంటూ వుంటాము. ఆ విధంగా చేయడం వలన మనం మరల కర్మ బంధనాలను ప్రోగు చేసుకుంటున్నాము.కావున ఇక్కడ మనం గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే నీవు అన్నది ఎవరు? అని ఆలోచిస్తే నీవు అన్నది ఆత్మ మాత్రమే, నీవు అన్నది ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఏవి కావు. మరి ఆత్మ ఎప్పటికి ఏమి చేయదు అది అంతరంలో సాక్షి భూతంగా మాత్రం వుంటుంది తప్ప అది అంటూ ఏమి చేయదు. కావున దీనిని గ్రహించి చేసే ప్రతి పనిని నీవు భగవంతార్పణ బుద్దితో, ఫలాపేక్ష రహితుడవై, నిష్కల్మషంగా కర్మలను ఆచరించి వీటి అన్నిటి నుండి నీవు సంపూర్ణంగా విముక్తిని పొందడమే “ముక్తి” .ముక్తి అంటే పరమాత్మ సాగరంలో ఆత్మ ఐక్యం కావడం.ముక్తి పొందడం అంటే నీవు మరల ఈ కర్మ భూమికి రాకుండా (అంటే జన్మ లేకుండా) ఆ దేవదేవుడైన పరంధాముని లో విలీనం అవడం. ఈ విధంగా జ్ఞానంతో కర్మలను ఆచరించడాన్నే “కర్మయోగం” అంటారు. 
జ్ఞాన యోగం: అసలు జ్ఞానం అంటే ఏమిటి ? జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు అయన పైన వుండి మనం అడిగినవన్నీ తీరుస్తాడు అనుకోవడం కూడ అజ్ఞానమే. మొదట తెలుసుకోవలసింది ఏమిటంటే నీవు ఏది కోరితే అది ఇస్తాడు. అది తీరుతుంది కాని దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు. అన్నది తెలుసుకోవడమే జ్ఞానం.ఈ విధంగా అత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరించడమే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం గ్రహించి నీ మనస్సులో నిర్మలంగా తెలుసుకుంటూ అవలంబిస్తే నీవు అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించి తెలుసుకోవడం మరియు తెలుసుకున్న దానిని అమలుపరచే దేనినే జ్ఞానయోగం అంటారు.
భక్తి యోగం : భక్తి అంటే భగవంతునిని మనస్సులో నిరంతరం స్మరించడమే భక్తి. కాని మనం ఎదో ఎప్పుడైనా కస్టాలు వచ్చినపుడు లేకపోతె ఏదైనా భయం అయినపుడు మాత్రం స్వామి ఆంజనేయ అనో లేక మరో వేరే దేవున్నో తలచుకోవం మనకు పరిపాటి. కాని ఇలా కాదు భక్తీ అంటే సంపూర్ణంగా, పరిపూర్ణంగా నీ మనస్సును ఆ పర్మమత్ముని యందే లగ్నం చేయడం. అప్పుడు అందరికి ఒక సందేహం అదేంటి ఎప్పుడు అయన యందే మనస్సును లగ్నం చేస్తే నేను చేయవలసిన పనులు ఎవరు చేస్తారు అనే సందేహం కదా.నీవు చేసే ఏ పనైనా సరే అది ఆయనే చేస్తున్నాడు అని భావించు ఎందుకంటే ఈ ప్రక్రుతి అంతా తానే అయి ఉన్నాడు ఆ విధంగా భావిస్తూ నీ మనస్సు అంతఃకరణాన్ని సుద్దపరచు. ఆ విధంగా నీవు నిరంతర స్మరణతో భక్తితో అన్ని పనులను ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నీ మనస్సుకు ఒక సంపూర్ణత భావం ఏర్పడి అది పరిశుద్దమవుతుంది. ఈ విధంగా ఎల్లవేళలా ఆయనను స్మరిస్తూ వుండడం వలన నీవు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఆయననే పొందుతావు ఆయనలోనే విలీనం అవుతావు. అదియే మోక్షం.

ధ్యాన యోగం : ధ్యాన యోగం అన్ని యోగాలకంటే చాల చాల ఉన్నతమైనది ఎందుకంటే శరీరముతో వున్నపుడు ఈ శరీరపు అంతరములో వున్న ఆ పరమాత్మునిని, ఆ దేవదేవుడిని పరిపూర్ణంగా దర్శించే భాగ్యం ఈ ఒక్క ధ్యాన యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే దీనిని రాజ యోగం అని కూడ అంటారు. ఎందుకంటే ధ్యాన యోగం అన్నది నిజంగా రాజు (king of the yoga’s) అందుకే దీనిని “రాజయోగం” అని కూడ అంటారు. ధ్యానం అంటే సాధన. సాధన అంటే ప్రతి రోజు ధ్యానం చేసుకోవడం. చాల మందికి అమ్మో ధ్యానం అంటే ఇది చాల కష్టం అని అనుకుంటారు ఎందుకంటే కూర్చుంటే చాలు అంతవరకూ లేని ఆలోచనలు కూడ వెన్ను తట్టి నిద్ర లేచినట్లుగా ఒక్కొక్కటి మన మనస్సులో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యం కాదులే వేరే యోగం అవలంబిస్తాం అనుకుంటారు. కాని అన్నిటికన్నా ధ్యానయోగం మాత్రం చాల శక్తివంతమైనది. ఇది అవలంబించిన వాళ్ళు అంతా మహానుభావులు అయ్యారు. ఎవరైనా సరే ఈ యోగాన్ని ప్రారంబిస్తే చాలు, నిదానంగా తన మనస్సు, బుద్ధి అన్నియు అతని అధీనంలోకి ఖచ్చితంగా వస్తాయి. కాని కొద్దిగా సమయం పడుతుంది.అయితే ప్రతిరోజూ ఖచ్చితంగా అవలంబిస్తే అవి తొందరగా అన్నియు అధీనంలోకి వచ్చి సమాధి స్తితి లోకి వెళ్ళవచ్చు. సమాధి స్తితికి వెళ్తే నీ మనస్సు దాదాపు 70% నీ అధీనంలో వుంటుంది.మనస్సును ఎలా అదుపు చేయాలి ధ్యానంలో? ఇది అందరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న.అవును నిజమే ఈ మనస్సు అంటే సముద్రంలో అలలమాదిరి, అయిన అటువంటి మనస్సును అదుపు చేయొచ్చు. ఎలా అంటే మొదట నీ మనస్సుకు ఒకే ఒకటి చెప్పు అదే, ఈ సమస్త లోకానికి కారణభూతుడైన ఆ దేవదేవుని దర్శనార్థం, ఆ భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించడం కోసం, ఈ సృష్టికి కారణమైన ఆ దేవదేవుడు ఈ శారేరంలోనే అంతరంలో ఉన్నాడు అది జ్యోతిర్లింగస్వరుపుడు అని దానికి చెప్పి నీ శరీరపు హృదయ స్పందన మీదకు నీ మనస్సును మరలుస్తూ అదే విదంగా ఒక దివ్య జ్యోతిని మాత్రమే నీ మనస్సులో ఊహించుకొని ప్రతి దినము చేస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు నీ చెప్పు చేతల్లోకి వస్తుంది.ఈ విధంగా జ్ఞాన మరియు వైరాగ్యాలతో నీ మనస్సును నీ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఆ విధంగా అవలంబించడాన్నే ధ్యాన యోగం అంటారు.ఎందఱో మహానుభావులు ఈ ధ్యాన యోగం ద్వార ఈ సమాజానికి జ్ఞాన బోధ చేశారు. ఎస్తుక్రీస్తు, బుద్దుడు, వివేకానంద స్వామి, రామక్రిష్ణ పరమహంస, రమణ మహర్షి ఇలా ఎందఱో ఎందెందరో అలా వారి స్తాయికి చేరే సంపూర్ణ అవకాశాలు నీకు వున్నాయి. కావున ఈ రోజే ప్రారంబించు . శాశ్వతమైన పరిశుద్దమైన ఆ పరమాత్మను నీ అంతరంలో దర్శించుకొని శరీరం ఉండగానే ముక్తుడవై నీ జన్మకు సార్ధకతను మరియు నీ జన్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చు.