నరుడు అంటే మానవుడు నారాయణుడు అంటే ఆ దేవదేవుడు పరమాత్మా స్వరూపుడు. మానవుడు ఏంటి నారాయణుడు కావడమేంటి? ఎలా?
మానవుడు నిజానికి పరమాత్మా స్వరూపుడు, తను అది యందు పరిపూర్ణుడే, కానీ తను (మానవుడు) చేసే కర్మలను అజ్ఞానంతో అవిద్యతో తానే బాద్యుడిని అనుకోని అంటే అహంకారం ఆవరించి తను తన స్వస్వరుపాన్ని మరచి ఈ ప్రక్రుతి మాయలో తను బందిగా అయినాడు. అప్పుడు పరమాత్మా స్వరూపుడైన మానవుడు జీవత్మగా మారి ఈ జనన మరణ చట్రంలో చిక్కుకోనిపోయాడు. ఆ విధంగా నరుడు ఈ మాయా ప్రకృతిలో పడిపోయి తన గమ్యాన్ని కూడ మరచిపోయాడు. చివరకు అధోగతి పాలవుతున్నాడు.
నారాయణుడు అంటే పరమాత్మా స్వరూపుడు. భగవద్గేతలో శ్రీకృష్ణుడు అర్జునకు, ఓ అర్జునా నీకు నాకు ఇద్దరికీ శరీరాలు వున్నవి ఇద్దరం కర్మలను చేస్తున్నాము కానీ నేను వీటికి బందీకాను ఎందుకంటే నేను జ్ఞానాన్ని కలిగివున్నాను కాని నువ్వు అజ్ఞానంలో వున్నావు ఆ అజ్ఞానంతో నువ్వు చేసే కర్మలకు నేను చేస్తున్నాను అనే అహంకారంతో నీ పైన వేసుకొని బందీ అవుతున్నావు. కావున నీవు జ్ఞానివై యోగివై, నీవు చేసే కర్మలు నిష్కల్మషంగా, లోక కల్యానార్ధంగా, ఫలాశక్తిరహితుడవై, నీవు చేసే ప్రతి పని నాకు సమర్పించి నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు అర్జునా!
చూసారా! ఇద్దరు శరీరాలను కలిగి వున్నారు, ఇద్దరి శరీరాలను వుత్తేజపరిచే (అంటే శక్తినిచ్చే) ఆత్మ కూడ ఒకటే కానీ శ్రీకృష్ణుడు మాత్రం పరమాత్ముడు అయ్యాడు అదే అర్జునుడు నరుడయ్యాడు ఎందుకంటే అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు కానీ శ్రీ కృష్ణుడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అదియే భేదం. అందుకే వీరిని “నర నారాయణులు” అని కూడ అంటారు మీకు తెలుసా.
అంటే అజ్ఞానంలో వుంటే నరుడు, అదే నరుడు సంపూర్ణ జ్ఞానాన్ని పొంది ఆ దేవదేవుని దివ్య మంగళ స్వరూపాన్ని హృదయంలో దర్శించి తరించి పరిపూర్ణుడైతే, అదే నరుడే నారాయణుడు అవుతున్నాడు.
కావున మిత్రులారా అంతరార్ధాన్ని గ్రహించి, గ్రహించిన దానిని సంపూర్ణంగా తెలిసికొని ఎత్తిన మానవ జన్మకు సార్ధకతను ఇవ్వండి.
No comments:
Post a Comment