Wednesday, November 11, 2015

స్వార్దం ఎప్పుడుండాలి


 మనిషికి స్వార్ధం ఉండాలి
 ఆ స్వార్ధం ఎప్పుడుఉపయోగపడాలో తెలుసా.?
ఇది నా దేశం
 ఇది నా ధర్మం
 అని ఇలాంటి సమయంలో
 నా అనే స్వార్ధం ఉండాలి
 ఎదుటివారు మన ధర్మాన్ని కించ పరుస్తున్నా
 చూసి ఏమీ అనని వాడు
 బ్రతికి ఉన్న చచ్చిన శవమే.!
ఇలా ఎంతోమంది చచ్చిన శవాలున్నారు
 ఈ దేశంలో
 స్వామీ వివేకనంద ఇచ్చిన స్పూర్తి చచ్చిపోయింది
 జనాలలో
 లేండి
 మేల్కోనండి
 గమ్యం చేరేవరకు
 విశ్రమించకండి
 అని ఆయన చెప్పిన మాటలు
 ఎవరి చెవులుకు తాకడం లేదు
 మనమంతా స్వార్దపూరితంగా
 నా అనే అహంకారంతో
 మన ధర్మాన్ని, ఈ దేశాన్ని
 ఇలా ఐనా కాపాడుకుందాం.!

ఆత్మజ్ఞానం

ఆత్మను గురించి ఏం ఆలోచించగలం? ఏం చెప్పగలం? ఆలోచన మనస్సు పరిధిలోది. 'ఆత్మ' మనస్సు దాటిన తర్వాత కలిగే అనుభూతి. ఆత్మ ఉండీ లేనట్లు, లేకపోయినా ఉన్నట్లు అనిపిస్తుంది. అనుభూతికి మాత్రం అందుతుంది. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేవి మూడూ ఒక్కటే. రూపగుణాలు ఒక్కటే. అవధులు మాత్రం వేర్వేరు. ఒక్కటే అయిన ఆత్మ అవసరానికి 'అంతరాత్మ' అనిపిస్తుంది. పైకి వెళ్లాక 'పరమాత్మ'గా వ్యవహరిస్తుంది. ఆ రహస్యం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. అసలు ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మను గురించి మరింతగా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఇక్కడ తెలుసుకునేది మనస్సుతో కాదు. అత్మతో - అది ప్రజ్ఞా విశేషం.
అయితే 'ఆత్మ' వివేకం ముందు కలగాలి. వివేకానికి జిజ్ఞాస జతపడాలి. అప్పుడు ప్రజ్ఞ బయటకొచ్చి ఆత్మజ్ఞానానికి తుదిమెరుగులు దిద్దుతుంది. 'ఆత్మ'ను గురించిన కనీస అవగాహన ఏర్పడితే అటువైపు దృష్టి సారించవచ్చు. మామూలు దృష్టికి ఆత్మ కనిపించదు, అందుకు అంతర్దృష్టి ఏర్పడాలి. మనస్సును నిద్రపుచ్చి లేదా శూన్యంచేసి ఆలోచనలు తలఎత్తకుండా చేసినప్పుడు ఆత్మ అనుభూతికి అందుతుంది. నిజానికి ఆత్మసహకారం లేనిది 'ఆత్మజ్ఞానం' కలగదు.

ఆత్మ రక్షణ, పోషణకు పరమాత్మ చింతనే మార్గం

జీవితంలో సుఖభోగాలు అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. సాధారణంగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. మానవ జీవితం కష్టసుఖాల సంగమం. ఆపదల్లో ఉన్నప్పుడు కూడ ఈశ్వర చింతన కలిగి ఉండనివారున్నారీ లోకంలో. అట్టివారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి వారిని నాస్తికులనడమే సమంజసం. వీరు ఎంత కష్టమొచ్చినా ఒక్క క్షణమైనా భగవన్నామోచ్ఛరణ చేయరు. ‘‘జాతస్య మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతి జీవిని మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. అంచేత మొండికట్టెల్లా కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఉత్కృష్టమైన మాన
వజన్మ ఎత్తికూడ అనివార్యమైన భగవత్ప్రేమకు పాత్రులు కాకపోవడం చింతించవలసిన విషయం. అభ్యాసం ఉంటే తప్ప ఎవరికి పరమాత్మ చింతన అలవడదు. ఉన్నతమైన మానవజన్మనెత్తి బుద్ధి జ్ఞానం కలిగి ఉన్న మనిషి కాలాన్ని వ్యర్థంచేసే బదులు ఏ క్రిమికీటకంగానో పుట్టి ఉంటే ఈ మానుషజన్మకు కళంకం ఉండదు కదా!
సర్వకాల సర్వావస్థలయందు సంసార సుఖభోగాల్లో పడినవారికి ఎంత ఆయుష్షుంటే ఏం లాభం? తనకు తెలీకుండానే అది హారతికర్పూరంలా కరిగిపోతుంది. కాలం వృధాగా పోతోందని గ్రహించిన వాడికి క్షణకాలమైనా చాలు మోక్షంకోసం ప్రయత్నించి సిద్ధిపొందొచ్చు. మనం చేసే మంచి పనుల్లోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి పది మందికి పనికొచ్చే సత్కార్యాల్ని చేయాలి. ఈశ్వరోపాసనకి పూజ, ప్రార్థన ముఖ్య సాధనాలు. మన స్థూల శరీరానికి కర చరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివని తెలుసుకోవాలి. లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడంకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖంకోసం గాని, సంసార బంధ విముక్తులవడానికి గాని యత్నించరు. అందువల్లే ఉత్కృష్టమైన ఈ మానవజన్మ వ్యర్థవౌతోంది. ఆత్మను పోషించుటకు, రక్షించుటకు పరమాత్మ చింతనే ముఖ్యసాధనం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే భగవంతుణ్ణి తలంచని వాడికి ఆ దేవుడు కరుణించడు. ముక్తినివ్వడు. పండితులు, భాగవతులు తమ గానం చేత, నృత్యం చేత, పూజాది సత్కర్మలచేత జపతపముల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్తుతిస్తారు. మరి పామరుల సంగతేంటి? రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది. తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి. అలాగే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు భాగవతుల్ని ఆశ్రయించాలి. అది సాధ్యంకానప్పుడు సత్పురుష సాంగత్యమైనా చెయ్యాలి. అది కూడ దుర్లభం అనుకుంటే తన దుష్టప్రవర్తనను తానే సరిదిద్దుకోగలగాలి. అందుకు శుభాశుభములు తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి. అందుకు విద్య అవసరం. విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే. తప్ప పొట్టకూటికోసం విద్యలుకావని గ్రహించాలి. ఈశ్వర చింతన యందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులవుతారు. దాంతో సంసార భోగవాంఛలు వాటంతటవే నశిస్తాయి. మనమంతా పుణ్యంకోసం గంగానది స్నానాలు, గుళ్ళు గోపురాల దర్శనం చేస్తుంటాం. ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే గాని ఆత్మశుద్ధికి తోడ్పడవు. వాటన్నిటికంటె ముందు శుభకర్మల్ని ఆచరించాలి. పరోపకారం, సత్యం పలకడం, భూత దయ, సత్‌సాంగత్య విద్య దానాదిక ధర్మాలు, మాతృపితసేవ, బ్రహ్మచర్యం, ఈశ్వర స్తుతి మున్నగు ఉత్తమగుణాలే శుభకర్మలు అనబడతాయి. శ్రీహరిని పూజించనివారు జీవచ్ఛవంబులనే చెప్పాలి. అందుకే అంటారు పరమాత్మ చింతన లేని జన్మవ్యర్థం అని.

ధర్మ సందేహం: ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?

ధర్మ సందేహం: ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?
నిద్రపోతున్నపుడు మన ఆత్మ పరమాత్మతో కలుస్తుందని మన వేదాంత శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కానీ, నిజంగానే ఈ రెండు ఒక్కటిగా కలుస్తాయా అనే ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. నిజంగానే ఈ రెండు కలుస్తాయట. ఇదెలాగంటారా... అయితే ఈ కథనం చదవండి.
సాధారణంగా మన శరీరాల్లో ఐదు కోశాలుంటాయని వేదాంత శాస్త్రం చెపుతోంది. అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవి పొరపొరలుగా ఉంటాయి. అన్నింటికన్నా పై పొర అన్నమయ కోశం. అన్నిటికన్నా లోపలి పొర ఆనందమయ కోశం. ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే లక్క పిడతల్లాగా ఉంటాయట.
వీటిలో నాలుగోది విజ్ఞానమయ కోశం. అంటే ఆత్మ. ఐదోది ఆనందమయ కోశం. అంటే పరమాత్మ. ఇందులో ముందు మూడు కోశాలు దేహం, మనస్సు, ప్రాణం అంటారు. అంటే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మ , పరమాత్మ వరుసలో ఉంటాయి. దీనికితోడు ఇంద్రియాలన్నింటినీ కలిగి వుండేదే దేహం. నాలుగో తొడుగు అయిన ఆత్మ మనం మెలకువగా ఉన్నపుడు దేహం, మనస్సుల వైపు అంటే విషయాల వైపు తిరిగి ఉంటుందట.
అదే గాఢ నిద్రలో ఉన్నపుడు దేహం, ఇంద్రియాలు, మనస్సు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ సమయంలో ఆత్మ పరమాత్మ వైపు అంటే విజ్ఞానమయ కోశం అయనందున ఆనందమయ కోశానికి అభిముఖం అవుతుంది. మన రెండు అరచేతులు కలిపి నమస్కరించినట్టన్నమాట. అదే ఆత్మ పరమాత్మను కలత లేని, నిలకడ గల గాఢ సుఘుప్తిలో చేరుకోవడం. అంటే ఆత్మ పరమాత్మలు గాఢ నిద్రలో కలుస్తాయన్నటమాట

గురువు - దేవుడు - ఆత్మ

గురువు - దేవుడు - ఆత్మ


"ఈశ్వరో గురురాత్మేతి"..అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.అంటే, దైవము, గురువు,ఆత్మా ఒక్కరే అని అర్ధం.


గురుపూర్ణిమ సందర్భంగా ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్పినప్పటికీ అసలైన ఒక్క విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు.ఒకవేళ ఎవరైనా నాబోటివాడు చెప్పినా ఎవరూ పాటించడమూ లేదు.
 అదేంటంటే - మనుషులు గురువును పూజిస్తారు గాని గురుబోధను పాటించరు.అలాగే దేవుడిని పూజిస్తారు గాని దేవుడిని (చేరాలని) కోరుకోరు.
ఇదే మానవజాతి ఆడుతున్న అతి పెద్దనాటకం.ఈ నాటకాన్ని గమనించలేనంత తెలివితక్కువ వాళ్ళు కారు దేవుడూ గురువూ.


గురుబోధను పాటించాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి.దీనికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.


దైవాన్ని చేరుకోవాలంటే నువ్వే అదృశ్యం కావాలి.దీనికీ ఎవరూ సిద్ధంగా లేరు.


మరి మహాభక్తులుగా నటిస్తున్న ఈ లోకులందరూ ఏం చేస్తున్నారు?


"మేము నీ బోధను పాటించము.కానీ మేము కోరిన వరాలు మాకివ్వు. కష్టాల్లో మాకు అండగా ఉండు" - అని గురువు చుట్టూ చేరి గోల పెడుతున్నారు.


"నువ్వు మాకక్కర్లేదు.మేం చేసే పూజలు స్వీకరించి మేము కోరుకునే వరాలు మాత్రం మాకివ్వు" - అని దేవుడితో చెబుతున్నారు.


వెరసి దైవాన్నీ గురువునూ మానవులు అడ్డంగా తిరస్కరిస్తున్నారు.వాళ్ళ దగ్గర ఉన్న వరాలిచ్చే శక్తిని మాత్రం వీళ్ళు దోపిడీ చెయ్యాలని చూస్తున్నారు. అదికూడా పూజ అనే లంచం ఆశచూపించి.అంటే - లోకంలో ఆడే నాటకాలనే దైవం దగ్గర,గురువు దగ్గరా కూడా ఆడాలని వీళ్ళు చూస్తున్నారు. అంతేకాదు ఆడుతున్నారు కూడా.
 మనుషులకు నిజంగా కావలసింది దేవుడూ కాదు గురువూ కాదు.వాళ్లకు కావలసింది సెక్యూరిటీ మాత్రమే.ఒక మానసిక ఆసరా మాత్రమే వాళ్లకు కావాలి.వారు ఆడే రోజువారీ నాటకాలకు ఒక డివైన్ సపోర్టూ డివైన్ శాంక్టిటీ మాత్రమే వారికి కావాలి.మేము చేస్తున్నవి పాపాలు కావు,మేము చేస్తున్నవి తప్పులు కావు - అన్న భరోసా మాత్రమే వారికి కావాలి.ఒకవేళ అవి తప్పులూ పాపాలూ అయినా సరే వాటిని ఎల్లకాలమూ క్షమిస్తూ, 'నీ పద్ధతి మార్చుకో' అని చెప్పకుండా,వీళ్ళు పెడుతున్న బెల్లమూ మరమరాలూ కొబ్బరి ముక్కలూ తింటూ నోర్మూసుకుని పడుండే దేవుడే వీరికి కావాలి.
 "నువ్వు నడుస్తున్న దారి తప్పుదారి.అది సరియైన దారి కాదు.నువ్వు మారాలి." అని చెప్పే గురువునూ దేవుడినీ మనుషులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారు.
తమతమ స్వార్ధపూరిత అవసరాలకోసం,దేవుడిని పూజించినట్లు మనుషులు నటిస్తారు.గురువు చెప్పినది విన్నట్లు నటిస్తారు.కానీ ఈ రెండూ త్రికరణశుద్ధిగా మాత్రం ఎవ్వరూ చెయ్యరు.
 ఈ క్రమంలో గురువుకూ దైవానికీ నిజానికి దూరం అవడమే గాక, వారికి ప్రతిరూపం అయిన తన ఆత్మకు కూడా దూరమై పోతున్నారు.ఈ మూటికీ దూరమైన వానికి జీవితంలో శాంతి ఎలా ఉంటుంది? అందుకే నేడు ఎవరి జీవితాలు చూచినా శాంతి మాత్రం లేదు.మిగిలినవన్నీ ఉండవచ్చు.కానీ శాంతి మాత్రం లేదు.


దానికి అసలైన కారణం దైవానికీ, గురువుకూ,ఆత్మకూ దగ్గరౌతున్నామన్న భ్రమలో ఉంటూ ఇంకా ఇంకా దూరం కావడమే.


మానవులు ఈ మోసపూరితమైన తమ మనస్తత్వాన్ని పోగొట్టుకోనంత వరకూ వారికి శాంతి ఎప్పటికీ దొరకదు.


ఇది రేపటి సూర్యోదయమంత నిజం

Saturday, November 7, 2015

దశ దానాలు అంటే ఏమిటి?

దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునకు చేసిన దానఫలం.,పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమజన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు.
శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.
                గో భూ తిల హిరణ్య ఆజ్య  వాసౌ ధాన్య గుడానిచ
                   రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః  
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా..
గోదానం
 గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో   శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.
భూదానం
 కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
తిలదానం
 తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
హిరణ్య (సువర్ణ)దానం
హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
ఆజ్య(నెయ్యి)దానం
 ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.  
వస్త్రదానం
 శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.
ధాన్యదానం
 జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.
గుడ(బెల్లం)దానం
 రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు  సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.
రజత(వెండి)దానం
 అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని  అనుగ్రహిస్తారు.
లవణ(ఉప్పు)దానం
 రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.
ఇవి దశ దానాలు. ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలను భక్తి,శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం అనే నిజాన్ని గుర్తించి మరీ దానం చెయండి.

శివకేశవులకు భేదం లేదు...ఇద్దరు ఒక్కరే :

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః!!

శివ కేశవుల అభేదాన్ని ఈ శ్లోకం తెలుపుతున్నట్లే హరిహరుడు, రామలింగడు, రామేశ్వరుడు, శంకర నారాయణుడు అనే పేర్లు కూడా ఈ అభేదాన్ని చాటుతున్నాయి. ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏసమాసానికి చెందినది అనే సందేహం కలిగిందట. రామస్య ఈశ్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం చెబుతుంది. శివుని విల్లు విరిచిన రాముడు శివుని కంటే ఏవిధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అనుకొని వైకుంఠం వెళ్ళారుట. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది రామస్య ఈశ్వరః అని అన్నారట.
ఆ విష్ణువు ఏదో వినయంతోనో, అహంభావం ఉండరాదు అనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలకు మాత్రం సందేహ నివృత్తి కాక కైలాసానికి బయలుదేరారు. దానికి శివుడు సమాధానంగా ఇందులో సందేహానికి ఏముంది? రాముడై ఈశ్వరుడుగా గలవాడు అన్నాడట. అప్పటికీ అర్థంకాక దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు ఇలా అన్నారు. "రామేశ్వరుడంటే రాముడొకడూ ఈశ్వరుడింకొకడూ కాదు రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారట.
విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్!!
శివకేశవులొకటే అని బ్రహ్మ బోధించాడట. పురాణాలలో ఒకచోట విష్ణువు జయించాడని, ఒకచోట శివుడు జయించాడని వింటూ ఉంటాం. అంతేకాక కొన్ని చోట్ల ఒకరినొకరు పూజించుకున్నారని వింటాం. పూర్వం బ్రహ్మగారు పంచముఖుడుగా ఉండేవాడు. ఆయనకు కొంచెం అహంభావం హెచ్చినందువల్ల ఈశ్వరునికి కోపం వచ్చి బ్రహ్మగారి ఒకతలను గిల్లి వేశాడట. ఆబ్రహ్మ కపాలం ఒకానొక శాపం ఈశ్వరుని చేతికే అంటుకుపోయిందిట. పైగా బ్రహ్మహత్యాపాతకం ఒకటి చుట్టుకొన్నదిట. అది పోగొట్టుకోవడానికి తిరుకుండియూరులోని పెరుమాళ్ళుని శివుడు పూజించాడని, అందలి మూర్తికి హరశపవిమోచకుడని పేరనీ స్థలపురాణం చెప్తుంది. పరతత్త్వం ఒకటే. తన మాయాశక్తి చేత ఆయా సమయాలలో ఒక్కో రూపంతో అనుగ్రహించడానికై ఆవిర్భవిస్తున్నది. ఏ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటామో ఆ అనుగ్రహాన్ని ఇచ్చే మూర్తిని ఆరాధించాలి. అన్నీ ఒక్కటే అనే అభేద జ్ఞానం ఎన్నటికీ మరువరాదు. త్రిమూర్తులు త్రిగుణాత్మకంగా ఉన్నారు. జగత్తును కాపాడటమూ అనుగ్రహించడమూ సత్త్వగుణం. శ్రేయస్సు కావాలంటే సత్త్వ గుణ ప్రధానమైన విష్ణువును ఆరాధించాలి. శివుని రంగు తెలుపు. ఆయన ఉండేచోటు కైలాసం. అదీ తెలుపే. ఈ గుణాలు సత్త్వగుణాన్ని తెలియజేస్తాయి.ఈ మూర్తులలో ఆధిక్యానధిక్యములు ఏమాత్రమూ లేవు. హరిహరులిద్దరూ ఒక్కటే అది తెలియని వాని నోట్లో మన్ను అని తమిళంలో ఒక సామెత ఉంది. ఒకే తత్త్వం మాయచేత అనేక రూపాలతో గోచరిస్తుంది. పసిబిడ్డకు బొమ్మ మామిడిపండు ఇస్తే దానిని తినడానికి పూనుకుంటుంది. మనకు నవ్వు వస్తుంది. అలాగే ఎన్నో వికారాలకు లోనయిన ఈ ప్రపంచాన్ని సృష్టించి, కాంతా కనక క్షేత్రాదులను చూపిస్తూ మనలను మభ్యపెడుతూ ఆడిస్తున్నాడు. ఇదంతా భ్రాంతి. రజ్జుసర్ప భ్రాంతి. అలాగే వేదాంత శాస్త్ర పఠనం, శ్రవణం వల్ల ఇదంతా మిధ్య అనే ఎరుక కలుగుతుంది. అందువల్ల ఎక్కువ తక్కువలు కట్టిపెట్టి వంశానుక్రమముగా కొలిచే దేవతలను పరదేవతగా పూజించాలి. తక్కిన దేవతలను పరదేవతయొక్క వేరు వేరు అంశలుగా తెలుసుకొని అభేద అనుభవంతో అచంచలమయిన శాంతితో ఉండాలి. దానిని ఈశ్వరుని అనుగ్రహంతో అనుభవంలోకి తెచ్చుకోవాలి.

శ్రీహరి దశావతారములు :

శ్రీహరి దశావతారములు :


పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.
1. మత్స్యావతారము :
వైవస్వతమను అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.
ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, ‘ఓ రాజర్షీ! నీవు దయాత్ముడివి... నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడానికి నేను నీ చేతిలోకి వచ్చాను’ అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్ధించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. "శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?" అని రాజు ప్రశ్నించాడు.
అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. "రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును" అని చెప్పెను.
ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పుడు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకు నౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకు తీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.
2.కూర్మావతారము:
దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.
ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి పర్వతము క్రింద ఆధారముగా నిలువబడి ఆ కొండను భరించెను. దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులును, అమృతమును పుట్టెను.
అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.
జయ విజయులు:
జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.
ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.


౩.వరాహావతారము:
శ్రీ మహావిష్ణువు జలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి వరాహరూపాన్ని దాల్చాడు.
మహాప్రళయం సంభవించింది. భూమి జలంలో మునిగిపోయింది. బ్రహ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పనచేశాను. స్వాయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే అని భావిస్తూ, సర్వభూతాంతరాత్ముడైన పుండరీకాక్షుని స్మరించసాగాడు. ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక (ముక్కు) నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి విశ్వంభరోద్ధారణకై జన్మించాడు.
అప్పుడు యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ స్తుతించెను. "దేవా... సనకసనందనాదుల శాప వశమున జయ విజయులు దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులై జన్మించి ఉన్నారు. హిరాణ్యాక్షుడు నేడు అఖిలలోక కంటకుడై, భూమిని తీసుకొని నీకై వెదకుచూ రసాతలమునకు పోయాడు.... అని బ్రహ్మ వివరించాడు.
ఆ పలుకులు విని యజ్ఞవరాహమూర్తి యను సర్వేశ్వరుడు, సముద్ర జలమును చీల్చి రసాతలమును ప్రవేశించి భూమిని సమీపించెను. ఆ జల మధ్యంలో సూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. అప్పుడు రాక్షస రాజు గుండెలు తల్లడిల్లునట్లు రణోత్సామున రంకెలు వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమయ్యారు.
రణ రంగంలో హిరణ్యాక్షుని గద, శూలము శ్రీహరి ధీరత్వం ఎదుట వృథా అయ్యాయి. దాంతో హిరాణ్యాక్షుడు రోషోద్ధరుడై మాయా యుద్ధము ప్రారంభించాడు. భీకర పాషాణ పురీష మూత్ర ఘన దుర్గాంధ అస్థి రక్తములు కురియునట్లు మాయా చక్రమును భూచక్రముపై ప్రయోగించాడు. శ్రీహరి తన చక్రముతో మాయా చక్రాన్ని అడ్డగించారు. తన మాయలన్నియు కృతఘ్నునికి చేసిన ఉపకారమువలె పనిచేయకపోవుట గమనించిన హిరణ్యాక్షుడు వరాహమూర్తిపై లంఘించి తన బాహువులను చాచి, హరివక్షంపై బలం కొద్దీ పొడువగా, హరి తప్పించుకుని ఎదురు ముష్టి ఘాతం ఇచ్చాడు. ఆ దెబ్బకు దిర్దిరం దిరిగి, దిట చెడి, లోబడిన హిరణ్యాక్షుని కర్ణమూలమందు తన కోరలతో వరాహమూర్తి మొత్తెను.
అంతట లీలవోలె శ్రీయజ్ఞ వరాహమూర్తి భూమిని తన కోరలపై నుంచి సముద్రము పైన దించి, నిలిపి, విశ్రాంతి వహింపజేసి తిరోహితుడయ్యాడు.

4.నృశింహావాతారము :
సోదరుని హిరణ్యాక్ష మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవదానవమనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు.
ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపములను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు - "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" అని వారికి అభయమిచ్చాడు.
హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని నప్పగించాడు.
ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు.
గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.
ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు.
కోపించిన రాక్షస రాజుకు సర్దిచెప్పి, మరల వివిధోపాయాలలో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజువద్దకు తిరిగి తీసికొని వెళ్ళారు. రాజు తన కొడుకును ముద్దుచేసి - "గురువులే సంవిద్యాంశంబులు జెప్పిరో చెప్పు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు
శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి." అని వివరించాడు.
హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాద కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.
క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.
ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా
అప్పుడు ప్రహ్లాదుడు "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు" అని చెప్పాడు.
ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను.
అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.
బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. "మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.
ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.
ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.
స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు.
మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.
"స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు ప్రహ్లాదుడు. "నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి" అని ఆశీర్వదించాడు స్వామి.
హిరణ్యకశిపుని వధానంతరం భీకర రౌద్రపూరితమైన నృసింహుని బ్రహ్మరుద్రులు, దేవేంద్రాది దేవతలు సైతం శాంతింప చేయలేకపోయారు. చివరకు తన భక్తుడైన ప్రహ్లాదుని చేతనే స్తుతింపబడి శాంతించాడు. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి.

5.వామనావతారం :
బలిచక్రవర్తి అజేయ బలపరాక్రమాలు కలవాడు. మాహాదాత. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలము ముగిసిన తరువాత అతనిని జయిస్తానని తెలిపాడు. కొంత కాలానికి అదితి గర్భాన వామనరూపంలో జన్మించాడు. ఒకనాడు బలి మహా యజ్ఞమును చేయసాగాడు. అక్కడు వామనావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగుకు స్థలం చూపమని అడుగగా, బలిచక్రవర్తిని తన తలమీద వేయాల్సిందింగా కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు.
6.పరశురామావతారం :
శ్రీహరి తన అంశముతో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరుబది యొక్క సారులు దండయాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరథ రాముని చేతిలో ఓడి తపమునకు బోయెను. 
7.శ్రీరామావతారం :
రావణకుంభకర్ణులను సంహరించుటకై దేవతలు ప్రార్ధించిన మీదట దశరధునకు రామునిగా పుట్టి, సీతను పెండ్లాడి, సీతాలక్ష్మనులతో అరణ్యవాసము చేసి అనేక రాక్షసులను వధించెను. రావణుడు సీత నెత్తికొని పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్లి  రావణకుంభకర్ణాది రాక్షసులను సంహరించెను. అయోధ్యకు వచ్చి పట్టము గట్టుకొనెను. లోకాపవాదమునకు భయపడి సీతను అడవిలో వదలగా వాల్మీకి ఆశ్రయమునకు జేరెను. అప్పటికే గర్భవతియైన సీత అక్కడ లవకుశులు అను ఇద్దరు కుమారులను కనెను. రాముడు పదునోక్కవేల యేండ్లు రాజ్యము చేసి కుశునికి పట్టాభిషేకము చేసి, సీత సమేతుడై అయోధ్య పురవాసులతో సహా పరమపదమునకు వేంచేసేను.
8.శ్రీకృష్ణావతారం :
ఇరువది యెనిమిదవ ద్వాపరయుగములో అధర్మప్రవ్రుత్తులైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీహరి కృష్ణావతారము నెత్తెను. దేవకీవసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి, వ్రేపల్లెలో నందయశోదల ఇంట పెరిగి బాల్యక్రీడలచే వారిని అలరించి, దుష్ట రాక్షషులను సంహరించెను. మధురాపురమునకు బోయి కంసుని సంహరించి, మాతామహుని రాజమున నిలిపి, బలరామునితో గలిసి శత్రువులను నిర్మూలించెను. రుక్మిన్యాది అష్టమహిషులను వివాహమాడెను. నరకుని జంపి 16౦౦౦ మందిని వాని చెరనుండి విడిపించెను. ద్వారక నగరమును నిర్మించి భార్యాపుత్రబంధుమిత్ర పరివారముతో నూటపాతిక యేండ్లు భూలోకమున నివసించెను.
భారత యుద్దములో పాండవుల పక్షమున నుండి అధర్మాపరులను నాశనము చేసెను. తరువాత యాదవులు మదించి అధర్మముగా ప్రవర్తించుచుండగా ముసులము వంకతో వారిని గూడ సంహరించి తానూ పరమపదమునకు చేరెను. 
9.బుద్దావతారము:
ఒకప్పుడు రాక్షసులు విజ్రంభించి దేవలోకముపై దండెత్తి దేవతల నోడించి తరిమివేసిరి. దేవతలు ప్రార్ధింపగా మాధవుడు, మాయామోహ స్వరూపముతో శుద్దోధనుని కుమారుడుగా జన్మించెను. వేదవిరుద్దములైన బోధనలతో రాక్షసులను అందరును సమ్మోహపరచి వారిని వేదబహ్యులను జేసెను. ఒక్క రాక్షసులనే కాక భూలోక వాసులను కూడా భ్రమింపజేసెను. రాక్షసులు పాశండులై బలమును తేజమును కోల్పోయిరి. అప్పుడు దేవతలు వారిని ఓడించి స్వర్గమును చేజిక్కించుకొనిరి.
10.కల్క్యావతారము:

బుద్దుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపై ప్రసరించును. వారు అధర్మపరులై ప్రజాకంటకులై ప్రవర్తించురు. ప్రజలు కూడ అన్యాయ ప్రవర్తనులై వేదకర్మల నాచరింపక యుందురు. అప్పుడు కలియుగంలో విష్ణుయశునుడికి శ్రీహరి, కల్కి రూపముతో జన్మించును. ధర్మమును తిరిగి ప్రతిష్టించును.

శ్రీ రమణ మహర్షి ఉపదేశసారము:

1.      దైవశాసనము బట్టి కర్మఫలము లభిస్తుంది. కర్మదైవమా? కానేకాదు కర్మ జడపదార్థం.
2.      కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది.
3.      ఈశ్వరార్పణ బుద్దితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధక మవుతాయి.        
4.      పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది.
5.      బ్రహ్మ భావనతో చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవానుని పూజ యగుచున్నది.
6.      భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచకజపము కంటే మౌనజపము, మౌనజపము కంటే ధ్యానము ఉత్తమములు.
7.      నదీ ప్రవాహంలా, నేతి ధారలా, నిరాఘాటంగా సాగే సరళధ్యానం ఆటంకంతో కూడిన విరళచింతనం కన్నా మిన్న.
8.      పరమాత్మా వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది.        
9.      ద్వైత భావమును దాటి ‘ఆ పరమాత్మే నేను’ నీలోను నాలోను అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావనా బలిమిచే కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు.
10.  మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.
11.  వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.
12.  ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.
13.  లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.
14.  ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.
15.  మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది?
16.  దృశ్యవస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపమును ఎరుగుటయే తత్త్వ దర్శనము.
17.  మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.
18.  వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.
19.  నేను అనేది ఎక్కడనుంచి పుడుతోంది? అని అన్వేషిస్తే ఆ నేను పతనమౌతుంది. ఇదే ఆత్మవిచారము.
20.  ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్ స్వరూపమైనది నగు ‘అహం అహం’ అను ఆత్మయే ప్రకాశించును.
21.  అహం వ్రుత్తి లయించినపుడు సదా సత్పదార్థము భాసించుటచే అదే నేను అను పదమును లక్ష్యార్ధమైయున్నది.
22.  దేహము, ఇంద్రియములు ప్రాణము,బుద్ధి,అవిద్య నేను కాను. అవి జడములు. ఏకసద్రూపమే నేను.
23.  సత్తు ను తెల్పుటకు చిత్తు వేరుగా యున్నదా? సత్తుయే చిత్తూ, చిట్టుయే నేను?
24.  శరీరాది ఉపాదులవలన జీవేశ్వరులలో భేదము కనుపించు నప్పటికీ ఇద్దరు సత్స్వ రూపులు అవడంవల్ల ఒకే వస్తువై యున్నారు.
25.  ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది.
26.  ఆత్మ అద్వితీయము కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుట యగును.
27.  జ్ఞానము – అజ్ఞానము రెండింటిని దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము.సమస్తమునకు అతీతమై, సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు వేరువస్తువు ఏమున్నది.
28.  తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో, అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకొనును.
29.  తన్ను తాను తెలుసుకొనెడి ఈ అత్మానుభావమును పొందిన దైవికుడు జ్ఞాని బంధము గాని ముక్తిగాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు.
30.  నేను అనునదిలేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సుయని రమణుని దివ్యవాణి పల్కుచున్నది.
దేహము ఘటము వాలే జడమైనది. దీనికి నే నను తలపు లేనందునను, దేహము లేని నిద్రయందు గూడ దినమును మనముండుట చేతను, దేహము నేను కాదు; నేను ఎవరిని? ఎక్కడనించి వచ్చాను? అని సూక్ష్మ బుద్ధి చేత వెదికిచూచి, తన యందు నిలకడ జెందినవారల హ్రుదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు ‘అహం’ స్పురణరూపుడై స్వయంగా భాసితున్నాడు.

ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు :

ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు :


మిత్రులారా మీ అందరికి నేను ఇంతకూ ముందే ఇప్పుడు మీకు యే గుణాలు కలిగి వున్న సాత్విక గుణాలను అలవరచుకొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కండి అని తెలిపినాను. ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు ఇవే .తెలుసుకొని..... పాటించి మిమ్ములను మీరు మార్చుకొని అన్ని దివ్య గుణాలను పాటించి ఆ దేవదేవుడైన నిరాకారుడైన ఆ భాగవతుడిని మీ హృదయాలలో సాక్షాత్కరించుకొని , ఆ పరమపదాన్ని చేరుకోవాలని నా మనవి. ఎంతో ఉత్కృష్టమైన మోక్షానికి చేరుకోవాలి నా విన్నపం. అందువలన ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు :


- పరమాత్ముని యందు సంపూర్ణ నిష్ట
- ఆత్మలో ధృడత
- ఆలోచనలో పరిపక్వత
- మనుస్సులో సంతుష్టత
- బుద్దిలో పరిపక్వత
- సంస్కారములో శ్రేష్టత
- దృష్టిలో పవిత్రత
- మాటలలో మధురత
- కర్మలలో ప్రావీణ్యత
- సేవలో నమ్రత
- వ్యవహారములో సరళత
- స్నేహములో ఆత్మీయత
- ఆహారములో సాత్వికత
- జీవితములో సత్యత
- వ్యక్తిత్వములో రమణీయత
- నిద్రలో నిశ్చింతత


పైన తెలుపబడిన అన్ని గుణాలను మనస్సులో భద్రపరచుకొని ,మీ ఆలోచనలను , బుద్దులను , వ్యవహారశైలిని సంపూర్ణంగా మార్చుకొని వాటిని అన్నిటిని పాటించి సాత్విక గుణాన్ని పాటించి ఆ భగవంతుడైన సర్వేశ్వరుడు పరమాత్మస్వరూపుడిని హృదయంలో సత్సక్షత్కారించుకోండి. మీ మానవ జన్మలను సార్థకత చేసుకోండి. మీ అసలు సిసలు ఆయిన మానవ జన్మ లక్ష్యాన్ని ఈ జన్మలోనే పొందవలసినడదిగా నా మనవి.

వేదాలు – ఉపయోగాలు

వేదాలు – ఉపయోగాలు :

ఈ లోకంలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి యొక్క యదార్థ స్వరూపం పరమాత్మయే. అయితే తను పరమాత్మా స్వరూపాన్ని మరచి జీవుడుగా వ్యవహరిస్తున్నాడు మానవుడు. అది ఎలాగు అంటే తను తన స్వస్వరుపాన్ని మరచి అజ్ఞానంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న కర్మలతో తనకు తాను వచ్చిన దారిని మరచి బద్దుడవుతున్నాడు. (దీనిని ఏసుక్రీస్తు "మీరు అంత దారి తప్పిన గొర్రెపిల్లలు" అని తన వాక్యాలలో చెప్పాడు ) అంటే మనం మన ఇంటిని మరచిపోయం . అందువలన ఇప్పుడు తెలుసుకొని మన ఇంటికి మనం అందరం చేరుకుందాం.
అలా దారితప్పిన మనం ఇప్పుడు తిరిగి మాధవుడుగా (మానవుడే మాధవుడు), నరుడు నారాయనుడుగా, జీవుడు దేవుడుగా తన స్వస్తితిలో నిలిచి పోవాలంటే అందుకు మార్గం చుపేవే వేదాలు.
వేద అంటే తెలుసుకొనుట అని అర్థం . ఏమి తెలుసుకోవాలి? దేనిని తెలుసుకున్న తరువాత ఇక తెలిసికోవాల్సింది ఏమి ఉండదో, దేనిని తెలుసుకుంటే సర్వము తెలిసినట్లో అట్టి జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి.
కనుక మానవుడు తరించాలంటే, తన జన్మను సార్ధకం చేసుకోవాలంటే, జీవిత పరమార్ధమైన మోక్షాన్ని పొందాలంటే తప్పక తెలిసికోవలసింది వేదవిజ్ఞాన్నే.

ఈ వేదవిజ్ఞానాన్ని మొదట బ్రహ్మ దేవుడు దివ్యవాణిగా విన్నాడు. అందుకే దీనిని శృతి అన్నారు. శృతి అంటే విన్నది అని అర్థం. బ్రహ్మదేవుడు మొదటగా విని ఇతరులకు బోదించటం వలన దీనిని "బ్రహ్మవిద్య" అన్నారు.
మొదట వేదం అంతా ఒకటిగానే వుండేది. కానీ కలియుగంలో మనుషులు అల్పాయుష్కులు మరియు అల్పజ్ఞానులు అని గ్రహించి ఈ వేదమంత్రాలను కలియుగానికి ముందే ద్వాపరయుగంలో జన్మించిన వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న ఈ వేదమంత్రాలను నాలుగుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణవేదం.
ఇలా విభజించబడిన ప్రతివేదం తిరిగి ఒక్కొక్కటి నాలుగు భాగాలుగా విభజించబడినవి. అవే
1. సంహిత (మంత్రం భాగము)
 2. బ్రాహ్మణులూ (పూజలు. యజ్ఞయాగాదులు మో||న కర్మకాండ),
 ౩.ఆరణ్యకాలు (ఉపాసనలు)
 4.ఉపనిషత్తులు (పరమాత్మా తత్త్వం).
మానవులకు మోక్ష మార్గాన్ని చుపేవే ఉపనిషత్తులు . ఇవి వేదాలకు అంతంలో వుండడం వలన వేదాంతం అంటారు. మన మానవ జీవితాన్ని తరింప జేసుకోనుటకు, మోక్షాన్ని అందుకొనుటకు కావలసిన అద్భుత జ్ఞానాన్ని ప్రసదించేవే ఉపనిషత్తులు. ఇవి నాలుగు వేదాలలోను మొత్తం 1180 వున్నవి. అయితే 108 ఉపనిషత్తులు మాత్రమే మంత్రాలతో సహా ఇప్పుడు మనకు లభిస్తున్నాయి. ఇందులో కూడా 10 ఉపనిషత్తులు అత్యంత ముక్యమైనవని మహాత్ములందరూ అంగీకరిస్తున్నారు. అవే ఈసా, కేన, కఠో, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక అనే దశోపనిషత్తులు.
ఉపనిషత్తులు అంటే ఆత్మవిద్య అదే బ్రహ్మవిద్య . ఈ విద్య మానవునిలోని అజ్ఞాన్ని పోగొట్టి, సమస్త దుఃఖాలను నివృత్తి చేసి, పరబ్రహ్మాన్ని ఎరుకపరిచి, ముక్తిని ప్రసాదిస్తుంది.

సృష్టి :

సృష్టి :
ఈ సమస్త సృష్టి వుద్బవించడానికి కారణం ఏమి మరియు ఈ సమస్త సృష్టి పాలకుడు ఎవరు ఈ సమస్తం ఎవరి చేత సృస్టింపబడుతుంది , ఎవరిచేత నాశనమవుతుంది మరియు ఎవరి ఆజ్ఞ చేత ఇది పాలించబడుతుంది అన్న విషయాన్ని ఇందులో మనం తెలుసుకుందాం.


సహస్రయుగపర్యంతం అహర్యద్బ్రహ్మనో విదు !
రాత్రిం యుగాసహస్రాoతాo తే హొరాత్రవిదో జనా !!         (భగవద్గీత : 8.17)
వేయి (పెక్కు) యుగముల కాలము బ్రహ్మ (మూల ప్రకృతి) కి ఒక పగలు. అంతే కాలము తరువాత రాత్రి ముగుస్తుంది .
అవ్యక్తాద్వ్యక్తయః సర్వా ప్రభావoత్యహరాగమే !
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్త్రైవావ్యసoజ్ఞకే !!                    (భగవద్గీత : 8.18)    
(బ్రహ్మ) పగలు ఆరంభమున సకలము అవ్యక్తమునుండి వ్యక్తమగును. రాత్రి రాగానే అవ్యక్తమునందు లీనమగును. (దీనిని ఒక కల్పమందురు).
సృష్టి ఆరంభమునకు ముందు అంతయూ శూన్యమే(ఆ శూన్యమే శక్తి అదియే భగవంతుడు). ఎక్కడను ఏమియు లేదు. సృష్టి అరంభమవగానే శున్యము నుండి శక్తి బయల్పడి(దానినే యోగమాయ అంటారు) అతి వ్యాపింప నారంభించెను. ఆవిధంగా శూన్యము నుండి లక్షల కోట్ల సౌర మండలాలు ఉద్భవించి వాటిలో ప్రకృతి , పెక్కు చరాచరులు, జీవరాశులు ఏర్పడినవి.
(ఇప్పటి సృష్టి మొదలై సుమారు 1400 కోట్ల సంవత్సరాలైనవని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు . సుమారు 10 వేల కోట్ల సంవత్సరాల తరువాత ఈ సృష్టిలోని సర్వస్వము శక్తిగా మారి అదృస్యమగునని తెలుపుతున్నరు . దీని తరువాత చాల కాలమునకు మరల సృష్టి జరుగునని కొందరు ఖగోల శాస్త్రజ్ఞుల అభిప్రాయము .) 
సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్  !
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ !!           (భగవద్గీత : 9:7)
కల్పాంతమున సకల భూతాలు (మూల ప్రకృతి , పంచభూతాలు, సకల ప్రాణులు ..) నా ప్రకృతిని (అవ్యక్తము) ప్రవేశించును. తిరిగి కల్పారంభమున వానిని నేనే సృజించుచున్నాను.
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః !
భూతగ్రామమిం క్రుత్స్యమ్ అవసం ప్రకృతేర్వశాత్ !!                   (భగవద్గీత : 9:8)
తమతమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూత సముదాయమును నా ప్రక్రుతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము మరలమరల పుట్టించుచున్నాను
మయాద్యక్షేణ ప్రకృతిం సూయతే సచరాచరం !
హేతునాణేణ కౌన్తేయ జగద్విపరివర్తతే !!           (భగవద్గీత : 9:10)
నా అద్యక్షతన భౌతిక ప్రకృతి చరచారాలను (ప్రాణుల్ని) సృస్టించును . ఆ కారణంగా జగత్తు పనిచేయుచున్నది .
భూతగ్రామ స ఏవాయం భాత్వా భూత్వా ప్రలీయతే !
రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యహరాగమే !!                    (భగవద్గీత : 8:19)
జీవ సముదయమంతయు ఈ విధముగా మరల మరల జన్మించును (బ్రహ్మకు) రాత్రి అవగానే నశించును, (బ్రహ్మకు) పగలవగానే జన్మింతురు.  ఈ విధంగా  ప్రాణి సముదాయము ప్రక్రుతివశమున మాటిమాటి కిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. మరల పగటి ప్రారంభ కాలమున పుట్టుచుండును.


కానీ మోక్షమును పొందిన వారు మాత్రం మరల మరల పుట్టరు. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి అని, పరమపదము అనియు అందురు. (భగవద్గీత : 8:21)

అనగా ఈ సమస్త సృష్టి వుద్బవించడానికి కారణం ఒకరే ఆయనే పరమాత్మా (అదియే శక్తి) మరియు ఈ సమస్త సృష్టి పాలకుడు కూడ ఆయనే, ఆయన చేతనే ఈ సమస్తం సృస్టింపబడుతుంది , నాశనమవుతుంది మరియు ఆయన ఆజ్ఞ చేత ఇది పాలించబడుతుంది.

పరమాత్మ :

పరమాత్మ :
ఓం ׀׀ ఆత్మా వ ఇదమేక ఏవాగ్ర ఆసీన్నాన్యత్ కించన మిషత్ ׀
స ఈక్షత లోకాన్ను సృజా ఇతి ׀׀                                                (ఐతరేయోపనిషత్ 1:1)
ఈ సృష్టి జరగక ముందు ఒకే ఒక శక్తి మొత్తం అంతయు ఉండింది. అంటే ప్రారంభంలో భగవంతుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు . నేను లోకాలను సృష్టిస్తాను అని అనుకున్నాడు సృష్టించాడు.
సృష్టి ఆరంభమునకు ముందు అంతయూ శూన్యమే. ఎక్కడను ఏమియు లేదు. సృష్టి అరంభమవగానే శూన్యము నుండి శక్తి బయల్పడి అది వ్యాపింప నారంభించెను. ఆవిధంగా శూన్యము నుండి లక్షల కోట్ల సౌర మండలాలు ఉద్భవించి వాటిలో ప్రకృతి , పెక్కు చరాచరులు, జీవరాశులు ఏర్పడినవి.
స ఈక్షతేమే ను లోకా లోకపాలాన్ను సృజా ఇతి ׀ సో ద్భ్య ఏవ పురుషం
సముద్ధ్రుత్వా మూర్ఛయత్ ׀׀                                                      (ఐతరేయోపనిషత్ 1:౩)   
లోకాలను సృస్తిచేశాను. ఇక లోకరక్షకులను సృష్టిస్తాను. అని అయన అనుకున్నాడు. ఆ విధంగా బ్రహ్మ దేవుణ్ణి సృష్టించాడు. ఆయన నుండి సమస్త జీవరాశులు పుట్టినవి .
మొదట ఆరంభంలో శూన్యం నుండి (అంటే శక్తి) నుండి పంచభూతాలు సృష్టించబడినవి. అంటే ఈ పంచభూతాలు కూడ ఆ భగవంతుడే. ఈ చరాచర జీవ రాసులు మొత్తం ఆ భగవంతుడే. మనకు కనిపించే ప్రతిది ఆ భగవంతుడే. ఆయనే ప్రకృతి అయి (ప్రకృతి రూపంలో) ఉన్నాడు. అంటే అయన కాకుండా ఈ చరాచర జగత్తులో ఏదియును లేదు.
మయాద్యక్షేణ ప్రకృతిం సూయతే సచరాచరం !
హేతునాణేణ కౌన్తేయ జగద్విపరివర్తతే !!           (భగవద్గీత : 9:10)
నా అద్యక్షతన భౌతిక ప్రకృతి చరచారాలను (ప్రాణుల్ని) సృస్టించును . ఆ కారణంగా జగత్తు పనిచేయుచున్నది .
స ఏతమేవ సీమానం విదార్యేతయా ద్వారా ప్రాపద్యత ׀ సైషా విద్రుతిర్నామ ద్వాస్త
దేతన్నాన్దనం ׀ తస్య త్రయ ఆవసథా:  త్రయ: స్వప్నా: అయమావసథొ యమావస   
థొ యమావస ఇతి ׀׀                                                                             (ఐతరేయోపనిషత్ 2:12)
భగవంతుడు తన నుండే పంచభూతాలను సృష్టించి అందు నుండే ఎన్నో చరాచర జీవులను మరియు మనిషిని సృష్టించాడు. ఆ తరువాత సృష్టించబడిన అన్నిటికి ఒక శక్తీ కావాలి (ఎందుకంటే అవి నిర్జీవమైనవి కదా, అవి ప్రకృతి నుండి ఉద్భవించబడినవి).అందువలన ఆ భగవంతుడే వాటి అన్నిటిలోనూ ప్రవేశించాడు. (అంటే సముద్రము నుండి ఒక నీటి బిందువును పక్కకు తీస్తే అది సముద్రము నీటికి ఏవిదంగా సమానమో) ఆ విధంగా ఈ చరాచర జీవులలో మరియు మన శరీరాలలో వున్న ఒక ఆ దివ్య శక్తీ ఆ భగవంతుడే. 
భగవంతుడు మనిషి నడినెత్తి చీల్చుకొని , ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించాడు. ఆ ద్వారం పేరే విద్రుతి. ఆయన విద్రుతి అనే ద్వారం గుండా మన శరీరంలో ప్రవేశించి ఉన్నాడు.
స జాతో భుతాన్యభివైక్ష్యత్ కిమిహన్యం వావదిషదితి ׀ స ఏతమేవ పురుషం
బ్రహ్మ తతమమపశ్యత్ ׀ ఇదమదర్శమితి ׀׀
మనిషిగా జన్మించిన అతడు మాత్రం తక్కిన జీవరాసుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు (ఎందుకంటే భగవంతుడు మనిషికి బుద్దిని ప్రసాదించాడు) ఆలోచించటానికి ఏముంది . శరీరంలో కొలువైన ఆత్మే సర్వత్ర వ్యాపించి, భగవంతుడుగా ఉండడాన్ని అతడు చూసాడు. దీనిని నేను కనుగొన్నాను  అని ఆశర్యబోతూ చెప్పాడు.

పరమాత్మ అంటే ఒక శక్తి అనగా నిరాకారుడు ఆకారం లేనివాడు, నిర్గుణుడు అంటే ఎటువంటి గుణాలు లేనివాడు, సత్యుడు అంటే ఎప్పటికి నిలిచి వుండే వాడు, శాశ్వతుడు, నశ్వరుడు అంటే నాశనమ లేనివాడు, జనన మరణములు (పుట్టుక అంటూ) లేనివాడు, నిత్యుడు అంటే నిత్యమూ వుండే వాడు అన్నిటికి మించి తానే జ్ఞాన స్వరూపుడు అంటే అయన దివ్య దర్శనంతో మాత్రమే మనం సంపూర్ణ దివ్య జ్ఞానాన్ని సంపాదిస్తాము అంటే ఆ భగవంతునిని మన శరీరం అంతరంలో(హృదయంలో) సాధన (ధ్యానం) ద్వార దర్శించడమే.

ఆత్మ :

ఆత్మ :
ఇంతకు ముందు సృష్టి గురించి మరియు పరమాత్మ గురించి తెలుసుకున్నాము. ఇందులో ఆత్మ గురించి వివరిస్తాను.


ఆత్మకు మరియు పరమాత్మకు ఎటువంటి భేదము లేదు (రెండు ఒక్కటే). అదేలగు అంటే ఒక సముద్రము నుండి ఒక నీటి చుక్కను మనము ప్రక్కకు తీస్తే ఆ నీటి చుక్క సముద్రపు నీటికి ఏ విదముగా సమానమో అదేలగు ఆత్మ కూడ పరమాత్మనే.
సృష్టి జరిగిన తరువాత పంచాభుతలతో నిర్మితమైన ఈ సకల చరాచర జీవులలో ఆత్మ ప్రవేసింపబడింది. ఆత్మ యొక్క శక్తీ చేతనే ఈ పంచాభుతలతో నిర్మితమైన ఈ శరీరాలు మరియు సకల చరాచర జీవులు (అంటే జంతువులూ, పక్షులు, సకల ప్రాణులు) అన్నియు పనిచేయుచున్నవి.


సర్వ ప్రాణులయందు వినబడకుండా, చూడబడకుండా, తెలియబడకుండా వుంటూ సర్వాన్ని వింటూ, చూస్తూ, తెలుసుకుంటూ ఉంటున్నవాడే ఆత్మ.
ప్రతి ఒక్కరి శరీరాలలోను ఆత్మ వుంటుంది. కానీ అది ఏమి చేయదు (అంటే ఉదాహరునకు ఒక ఇంట్లో ఒక దీపం వుంటుంది . దీపం యొక్క కాంతితో ఇంట్లో అన్ని పనులు చేసుకుంటు వుంటాము. కానీ ఆ దీపం చేయదు కదా) ఆత్మ యొక్క శక్తీ చేతనే మన శరీరాలు పని చేయుచున్నవి.
ఇంకో ఉదాహరణ ఏమంటే ఒక కారు వున్నది .కారుకు ఇంజను వున్నది . కారు డ్రైవర్ చేత నడుపబడుచున్నది. కారుకు ఇంజిన్ వుండడం వలన డ్రైవర్ కారు నడుపుతున్నాడు . అదే ఇంజిన్ లేకుంటే కారు వెలుతుందా లేదు కదా అంటే కారు (శరీరం) డ్రైవర్ (మనస్సు) ఇంజిన్(ఆత్మ) . ఇంజిన్ ఆదారంగా డ్రైవర్ కారు నడుపుతున్నాడు అదేలగు ఆత్మ యొక్క శక్తీ చేత మనస్సు ఆదారంగా శరీరము పనిచేసుకోనుచున్నది. 
నైనంఛిన్దన్తిశస్త్రాణి, నైనందహతిపావక :
నచైనంక్లేదయన్త్యాపో, నశోషయతిమారుత: ׀׀                                (భగవద్గీత : 2:23)
ఆత్మ నాశనము లేనిది ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయను సమర్ధము కాదు.
అచ్చేద్యో యమదాహ్యొ యం అక్లేద్యో శోష్య ఏవ చ |
నిత్య: సర్వగత: స్థాణు: అచలో యం సనాతన: ||                       (భగవద్గీత : 2:24)
(ఇది) చేదించుటకు, దహించుటకు, తడుపుటకు, ఆర్పుటకును సాద్యము కానిది.ఇది ఎల్లప్పుడూ అంతటను వ్యాపించి ఉండునది, చలింపనిది, స్తిరమైనది, శాశ్వతమైనది.
అవ్యక్తో యమచింత్యో యమ్ అవికర్యోయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||                                    (భగవద్గీత : 2:25)
ఈ ఆత్మ వ్యక్తము కానిది, ఊహింపనలవికానిది, వికారములు లేనిదని తెలుసుకో,
ఆశ్చర్యవత్పస్యతి కస్చిదేనం ఆశ్చర్యపద్వాదతి తథైవ చాన్య: |
ఆశ్చర్యవచ్చెనమన్య: శృనోతి శ్రుత్వాప్యేనం వేద నా చైవ కశ్చిత్ ||                    (భగవద్గీత : 2:29)
ఒకానొకడు ఈ ఆత్మను ఆశ్చర్యముగా చూచును. అట్లే ఇంకొకడు దానిని గూర్చి ఆశ్చర్యమైనదిగా పలుకును. మరొకడు ఈ ఆత్మను ఆశ్చర్యముగా వినును. ఇంకొకడు విని కూడా ఈ ఆత్మను తెలుసుకోలేడు.
దేహీ నిత్యమవద్యో యం దేహే సర్వస్వ భారత |
తస్మాత్ సర్వాణి భూతాని నా త్వం శోచితుమర్హసి ||                        (భగవద్గీత : 2:౩౦)                           
ప్రతి దేహంలోను
 వుండే ఆత్మ చంపుటకు వీలుకానిది. కనుక ఏ జీవిని గూర్చియైన శోకింపకు. 
ఆత్మే – బ్రహ్మ (పరమాత్మ):
ఏష బ్రహ్మైష ఇంద్ర ఏష ప్రజపతిరేతే సర్వే దేవా ఇమాచి చ పఇచ్చమహాభూతాని
పృథివీ వాయురకాస ఆపో జ్యోతింశీత్యేతాని ఇమాని చక్షుద్రమిశ్రాణీవ| బీజని
ఇతరాణి చేతరాణ చాన్డజాని చ జరుజని చ స్వేదజాని ఛోద్భిజ్జాని చాశ్వ గవ:
పురుషాం హస్తినో యత్కించేదం ప్రాణి జంగమం చ పతత్రి చ యచ్చ స్తావరం సర్వం
తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిస్టితం ప్రజ్ఞానేత్రో లోక: ప్రజ్ఞా ప్రతిష్టా ప్రజ్ఞానం బ్రహ్మ ||                (ఐతరేయోపనిషత్ ౩:౩)

మహాచైతన్యమైన ఆత్మే సృష్టికర్తగాను, ప్రకృతిగాను వున్నది. భూమి, వాయువు, ఆకాశం, జలం, అగ్ని అనే ఐదు మౌలిక మూలకాలుగా అదే వున్నది. అల్పప్రాణులుగాను, బీజాలుగాను వున్నది అదే. అండాల నుండి పుట్టినవి, గర్భకోశం నుండి పుట్టినవి. స్వేదం నుండి ఉద్భవించినవి. విత్తనాల నుండి మొలకేత్తేవి అన్ని అదే.గుర్రాలు, గోవులు, మనుష్యులు, ఏనుగులు ఇలా వున్నవి అన్నియు ఆత్మే. నడిచేవి, ఎగిరేవి, ఇత్యాది అన్ని ప్రాణులు స్తవర జంగామలు అన్నీ ఆత్మే.సమస్తం ఆత్మ మార్గదర్సకంలో నడుచుకుంటాయి .అన్ని ఆత్మలో నెలకొని వున్నాయి. లోకమంతా ఆత్మచే నడిపించబడుతోంది . సమస్తానికి ఆత్మే ఆధారభూతం. మహాచైత్న పదార్థమైన ఆత్మే బ్రహ్మ (పరమాత్మ).  

జీవాత్మ :

జీవాత్మ :

  ఆత్మ (పరమాత్మ) అంటే శాశ్వతమైనది, నిత్యమైనది.
జీవాత్మ అంటే మనిషి పుట్టిన తరువాత శరీరము చేసే కర్మలను అజ్ఞానముతో మరియు అవిద్యతో తనే చేస్తున్నాడు అనుకోని  బందము ఏర్పరచుకొని తన స్వస్వరూపమైన ఆత్మకు బంది అవుతున్నాడు.
అంటే శరీరము చేసే పనులు కర్మానుసారంగా జరుగుతూ వుంటాయి . కానీ మనము వాటిని(కర్మలను) అజ్ఞానముతో, వాటి ఫలితాలను ఆశించి మరల మరల బంధాలను ప్రోగు చేసుకోనుచున్నాము. ఆ విదంగా మనకు మనముగా అవివేకముతో బందీలమవుతున్నాము.
ఈ విదంగా ఏ విదమైన సంబందము లేని నువ్వు(ఆత్మ) ఇక్కడి (ప్రకృతి) బంధాలను(కర్మలను) కలుపుకొని జీవాత్మ గా తయారవుచున్నావు. కాని ఈ జీవాత్మ ఎప్పుడైతే తన స్వస్వరూపమును తెలిసికొని తన హృదయములో సాక్షాత్కరించుకు0టుందో అప్పుడు అది విముక్తి పొంది తన నివాసానికి చేరుకుంటుంది (అదే పరమాత్మ లో ఐక్య0 అవుతుంది)    
నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నా భూయ: !
అజో నిత్య: శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ||             (భగవద్గీత 2:20)
భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఎన్నడైనా ఆత్మకు జన్మగాని, మరణముగాని లేదు. జన్మ లేనిది, నిత్యమూ, శాశ్వతము అయిన ఆత్మ శరీరము చంపబడినను చావదు.
దేహినోస్మిన్యథాదేహే, కౌమారంయవ్వనంజరా
తథాదేహాస్తరప్రాప్తి; ధీరస్తతరనముహ్యతి ||                                       (భగవద్గీత)
జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలి తనము ఏట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే.
అంటే జీవుడు తన స్వస్వరుపమును తెలిసికోనంత వరకు అతను మరల మరల పుడుతుంటాడు . అయితే అది మరల మానవ జన్మే అని మాత్రమూ చెప్పలేము. అందువలన ఇప్పుడు పొందిన మానవ జన్మను సార్ధకపరచుకోవలెను మనము.
కర్మన్యెవాధికారస్తే, మఫాలేషుకదాచనా
మకర్మఫల హేతుర్భు: మాతేసజ్గోస్త్వకర్మణి ||                          (భగవద్గీత)
కర్మలను ఆచరించుట యందు నీకు అదికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణమూ కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.
అంటే ఇక్కడ శ్రీ కృష్ణుడు ఎంత బాగా చెప్పాడో చూడండి. కర్మలను ఆచరించండి కానీ వాటి ఫలితాలను మాత్రము నాకు సమర్పించండి. అప్పుడు మీరు బంద విముక్తులవుతారు అని ఎంతో విపులంగా విషదీకరించాడు.
మమైవా0శో జీవలోకే జీవభూత: సనాతన: |
మన:షష్టనీందరియాణి ప్రకృతిస్థాని కర్షతి ||                             (భగవద్గీత 15:7)
జీవ జగత్తులోని జీవుడు నిశ్చయముగా శాశ్వతమైన నా అంశ(భాగము). మనస్సుతో కలిపి ఆరు (కర్మ) ఇంద్రియములతో భౌతిక ప్రకృతిలో కష్టపడుచున్నాడు.
అంటే ఇక్కడ జీవుడు (కర్మ మరియు ఆత్మ కలిపి) ప్రకృతిలో తను అజ్ఞానముతో ఆపాదించుకున్న కర్మలను చేయుచున్నాడు.
శ్రోతం చక్షు: స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విసయనుపసేవతే ||                         (భగవద్గీత 15:9)
విని, చూసి, స్పర్స, రుచి, వాసన పొంది మనస్సుతో జీవుడు విసయాన్ని అనుభవిస్తున్నాడు. అంటే ఇక్కడ జీవుడు అన్నిటిని అనుభవిస్తున్నాడు అంతేకాని ఆత్మకు ఇవి అన్నియు ఏమి సంబందము లేదు.
ఉత్క్రామన్తం స్తితం వాపి భుంజానం నా గుణాన్వితమ్ |
విముడా నానుపస్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష: ||                        (భగవద్గీత 15:10)
జీవాత్మ శరీరము నందుండి గుణ ప్రభావమున అనుభవించుటగాని, శరీరమును విడుచుటగాని అజ్ఞానులు చూడజాలరు. జ్ఞాని చూడగలడు.
యతంతో యోగినశ్చైనం పశ్య0త్యాత్మన్యవస్తితమ్ |
యతంతో ప్యకృతాత్మనో నైనం పస్యంత్యచేతస: ||             (భగవద్గీత 15:11)
ప్రయత్నించి యోగులు కూడా ఆత్మస్తితులై దీనిని(ఆత్మ) చూడగలరు. ఆత్మానుభూతి లేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించిన దీనిని(ఆత్మ) చూడలేరు.
అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల ఏమిటంటే ఆత్మను ఈ ప్రకృతితో నిర్మితమైనవి(మన కళ్ళు) ఏవియును చూడలేవు. ఆత్మను మన ఈ కళ్ళతో చూడదగినది కాదు . ఆత్మ దర్శనము పొందాలంటే ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రుమద్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబింపజేసి, మనస్సును, బుద్దిని, స్వాదీన మొనర్చుకొని, మొక్షాసక్తుడై యుండునో అట్టివాడు ఆత్మ దర్శనము చేసుకోగలడు(అంటే ద్యానములో కూర్చొని మాత్రమే ఆత్మ దర్శనము చేసుకోగలడు).
ఏషాబ్రాహ్మీస్తితి:పార్థా, నైనాంప్రాప్యవిముహ్యతి
స్తిత్వాస్యామన్తకలేపీ, బ్రహ్మనిర్వాణమ్రుచ్చతీ ||                                  (భగవద్గీత)
ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాదనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.

గుణాలు వాటి స్వభావాలు :

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు గుణాల గురించి చాల బాగ వివరణ ఇచ్చాడు. అదియే “గుణత్రయవిభాగ యోగము”
ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.
త్రివిధాభవతిశ్రద్ధా, దేహినాంసాస్వభావజా
సాత్వికీరాజసీచైనా, తమసీచేతితాంశృణు ||                             (భగవద్గీత)
జీవులకు గల శ్రద్ద, పుర్వజన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా వున్నది.
తత్రసత్త్వంనిర్మలత్వా, ప్రకాశకమనామయమ్ |
సుఖసజ్గేనబద్నాతి, జ్ఞానసజ్గేనచానషు ||                     (భగవద్గీత)
అర్జునా! త్రిగునములలో సత్వగుణము నిర్మలమగుటంచేసి, సుఖ జ్ఞానభిలాషల చేత, ఆత్మను దేహమునందు బంధించు చున్నది.
సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల మరియు జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది.
రజోరాగ్మాతకంవిద్ధి, తృష్ణాసజ్జిసముద్భవమ్ |
తన్నిభధ్గ్నాతికౌన్తేయ, కర్మసజ్గేనదేహినమ్ ||                                    (భగవద్గీత)
ఓ కౌన్తేయ ! రజోగుణము కోరికలయందు అభిమానము అనురాగము పుట్టించి, ఆత్మను బంధించుచున్నది.
రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది.
తమస్త్వజ్ఞానజంవిద్ధి, మోహనంసర్వదేహినామ్
ప్రమాదలస్యనిద్రభి: తన్నిభాద్నాతిభారతా ||                                     (భగవద్గీత)
అర్జునా ! అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులును మొహింపజేయునది .ఆ గుణము, మనుజుచి ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును. 
తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది.


సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.
మనవమనాయో: తుల్యస్తుతుల్య:మిత్రారిపక్షయో:
సర్వారంభపరిత్యాగీ, గుణాతీతస్స ఉచ్యతే ||                                      (భగవద్గీత)
మానవమానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
తేజక్షమద్రుతిశ్సౌచం, అద్రోహూనాతిమానితా
భవన్తిసంపదందైవీం, అభిజాతస్యభారతా ||
డమ్బోదర్పోభిమానశ్చ, క్రోధ:పారుష్యమేవచా
అజ్ఞానంచాభిజతస్యా, పార్థా! సంపదమాసురీమ్ ||                     (భగవద్గీత)
పార్థా ! సహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింప కుండుట, కావరము లేకయుండుట మొదలగు గుణములు  దైవాంశ సంభూతులకుండును. అట్లే డంభము, గర్వము, అభిమానము, క్రోదము, కఠీనపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును .
త్రివిధంనరకస్యేదం, ద్వారంనాశనమాత్మన:
కామ:క్రోధస్థథాలోభ;, తస్మాదేత్త్రయంత్యజేత్ ||                                    (భగవద్గీత)
కామ, క్రోధ,లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేఅతువులు కావున, వాటిని వదలి వేయవలెను.
యజన్తేసాత్వికాచేవాన్, యక్షరక్షాంసీరాజసా:
ప్రేతాన్భూతగణంశ్చాన్న్యే , యజన్తేతామసాజనా: ||                    (భగవద్గీత)
సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులును, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించు చుందురు.
-దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.

గుణాలు వాటి స్వభావాలు – II :

గుణాలు వాటి స్వభావాలు – II : (గుణాలు వాటి స్వభావాల గురించి మొదట విభాగాగాములో కొన్ని తెలుసుకొన్నాము. ఈ రెండవ విభాగములో గుణాల గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము.)
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వ పునః |
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభి: స్యాత్త్రిభిర్గునై: ||              (భగవద్గీత 18:40)
భూమి, ఆకాశం, దేవతలు, లేక ఏ ఇతర లోకలలోనైన  ప్రకృతి నుండి ఉత్పన్నమైన మూడు గుణాలు లేకుండా ఏ ప్రాణి వుండదు.
సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః |
నిబద్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||                                     (భగవద్గీత 14:15)
ప్రకృతిలో సత్వరజస్తమో గుణాలు వున్నవి. ఇవి శాశ్వతమైన జీవుని శరీరంలో బందిస్తున్నవి.
శరీరంలోని పురుషుడు(ఆత్మ) ప్రకృతి లోని ఘటనల వలన సుఖదుఃఖాలను అనుభవించినపుడు పరిస్థితుల ఆధారంగా శరీర తత్వంలోని సత్వ, రజ, తమో గుణాల ప్రభావముల ననుసరించి స్పందించి పనులు చేయుటకు నిశ్చయించుకొనును. ఆ విధంగా త్రిగుణాలు జీవునిని శరీరములలో బంధిస్తున్నాయి .
సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ||                    (భగవద్గీత 14:9)
సత్వ గుణము సుఖములందు, రజోగుణము పనులలోను, తమో గుణము జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలలో బందించును.
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్వం రాజస్తథా ||                                 (భగవద్గీత 14:1౦)
రాజస్తమోగుణాలను అణచి సత్వ గుణము వృద్దిచెందును. అదేవిదంగా సత్వతమోగుణాలను అణచి రజోగుణము, సత్వరజోగుణాలను అణచి తమో గుణము వృద్ది చెందును.శరీర, పరిసర పరిస్థితులను అనుసరించి త్రిగుణాలలో ఎదో ఒక గుణము వృద్ది చెందును.
సర్వద్వారేషు దేహే స్మిన్ ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యద తద విద్యత్ వివృదం సత్వమిత్యుత్ ||                             (భగవద్గీత 14:11)
ఎప్పుడు మనషి చేసే పనులన్నీ జ్ఞానంతో తెజోవంతమై వుంటావో అప్పుడు సత్వ గుణము వృద్దినొంది ఉన్నట్లుగా తెలుసుకొమ్మని చెప్పబడింది.
లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా |
రజస్యేతాని జాయంతే వివ్రుద్దే భరతర్షభ ||                                        (భగవద్గీత 14:1౩)
రజోగుణము అధికమైనపుడు లోభము, అణచలేని కోరిక, పనుల ప్రయత్నము, క్రియాశీలత్వము వృద్దినొందును.
అప్రకాశో ప్రవ్రుత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ||                                   (భగవద్గీత 14:1౩)
తమో గుణము వృద్దినొందగా నిస్తేజం, సోమరితనం, బుద్దిహీనత, మోహం వ్యక్తములగును.
సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమౌహో తమసో భవతో జ్ఞానమేవ చ ||                                 (భగవద్గీత 14:17)
సత్వ గుణమునుండి జ్ఞానము పెంపొందును.రజో గుణము నుండి లోభము, తమో గుణం నుండి బుద్దిహీనత, మోహము, అజ్ఞానము తప్పక ఉత్పన్నమగును.
ఆయు:సత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనః |
రస్యాః స్నిగ్దాః స్థ్హిరా హ్రుద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః ||                                   (భగవద్గీత 17:18)     
ఆయువు, బుద్ది, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతిని వృద్దిపరుచునట్టి రసవంతరములు, పుస్టికారము, దృఢము, మనః ప్రీతిని కలిగించు ఆహారములు సత్వగుణమదికముగా ఉన్నవారికి ఇష్టమైనవి.
కత్వమ్లలవ ణాత్యుష్ణతీక్ష్న్ రూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్ట దుఃఖశోకామయప్రదాః ||                                     (భగవద్గీత 17:9)
చేదు, పులుపు, ఉప్పు, కారం రుచులు మిక్కిలి వేడిగా వున్నట్టివి, ఎండినవి, మంట కలిగించునట్టి ఆహారములు రజోగుణము ఎక్కువగా ఉన్నవారికి ఇష్టము. అవి దుఃఖము, చింత, రోగములు కలిగించును.


యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||                                       (భగవద్గీత 18:20)
తినడానికి బాగా ముందు వండినవి, రుచిలేనివి, చెడు వాసన కలిగి కుల్లినట్టివి, వేరొకరు తిని వదిలినవి, నిషిద్ధ పదార్థాలు తమో గుణం ఎక్కువగా ఉన్నవారికి ఇష్టం.  
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే |
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్వికమ్ ||                                (భగవద్గీత 18:20)
విభజింపబడిన సర్వప్రాణుల యందు అవిభక్తమైన నాశనము లేని ఒకే భావాన్ని (పరమాత్మ) ఏ జ్ఞానముతో చూచునో ఆ జ్ఞానము సాత్విక జ్ఞానమని తెలుసుకో.
ప్రుథక్వేన తు యద్ జ్ఞానం నానాభావాన్ ప్రుధగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్ ||                                      (భగవద్గీత 18:21)
ఏ జ్ఞానము వలన విభిన్న శరీరములలోనున్న భావాన్ని విభిన్న ప్రాణులుగా తెలుసుకొనునో ఆ జ్ఞానము రజోగుణ సంబంధమైనదని తెలుసుకో.      
యత్తు క్రుత్స్న్ వదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ |
అతత్న్వ ర్దవదల్పం చ తత్తామసముదాహృతమ్ ||                              (భగవద్గీత 18:22)
కారణం లేకుండా తత్వార్ధరహితంగా అల్పమైన ఒక పనిలో అదే సర్వస్వమైనట్లు ఆసక్తితో ఏ జ్ఞానము వలన ఉండునో అది తమో గుణ సంబందమైనదిగా చెప్పబడింది.
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయభయే |
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి: సా పార్దా సాత్వికీ ||                         (భగవద్గీత 18:౩౦)
చేయవలసినది, చేయరనిది, చేయుట, చేయలేకపోవుట, భయము, నిర్భయము, బంధ మోక్షాన్ని తెలుసుకొనేది సాత్విక బుద్ధి .
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
ఆయథావత్ ప్రజానాతి బుద్ధి: సా పార్త రాజసీ ||                                 (భగవద్గీత 18:31)
ధర్మాధర్మాలను , చేయదగినది, చేయవలసినదానిని సరిగా తెలుసుకోలేని బుద్దిని రాజస బుద్ది అందురు.
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్ విపరీతంశ్చ బుద్ధి: సా పార్ధ తామసీ ||                      (భగవద్గీత 18:32)
భ్రాంతిచే కప్పబడి అధర్మాన్ని ధర్మంగాను , అన్ని విషయాలను తప్పు అనే విదంగా భావించేది తామస బుద్ధి .
ధృత్యా యయా ధారయతే మనఃప్రాణే0దరియ క్రియాః |
యోగేనావ్యభిచారిణ్యా ధృతి: సా పార్ధ సాత్వికీ ||                                 (భగవద్గీత 18:34)
అంతరాయము లేని యోగాభ్యసముచే మనస్సు, ప్రాణము, ఇంద్రియముల పనులను నియంత్రించు నిశ్చయమును సాత్విక ధృతి అందురు. 
యయా తు ధర్మాకామార్థన్ ధృత్యా ధారయతేర్జున |
ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి: సా పార్ధ రాజసీ ||                                    (భగవద్గీత 18:34)
కానీ ఏ నిశ్చయముతో ధర్మార్ధకామ విసయాలలో ఫలాపేక్ష కలిగివుండునో ఆ నిశ్చయమును రాజస ధృతి అందురు.


యయా స్వప్నం భయం శోకం విషాదం మదనేఅవ చ |
నా విముంచతి దుర్మేధా ధృతి: సా పార్ధ తామసీ ||                              (భగవద్గీత 18:35)
కలలతో కూడిన నిద్ర, భయము, దుఃఖము, మదము, చింతనలు వదలని చెడు బుద్ధి కలవని నిశ్చయమును తామస ధృతి అందురు.
సుఖం త్విదానీం త్రివిధం శృణు మెఅ భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖా౦తమ్ చ నిగచ్ఛతి ||                              (భగవద్గీత 18:36)
యత్తదగ్రే విషమివ పరిణామేమ్రతోపమమ్|
తత్సుఖం సాత్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదాజమ్ ||                          (భగవద్గీత 18:37)
ఇక మూడు విధములగు సుఖములను వినుము. వానిలో అనుభవించుట, దుఃఖా౦తము (మోక్ష మార్గం) పొందుట కూడా జరుగును. ఆరంబమున విసయములేనున్నాను చివరలో బుద్దినుండి పుట్టిన ఆత్మ జ్ఞానము వలన కలిగిన అమ్రుతముతో సమానమైనదట్టిది సాత్విక సుఖ మనబడును.
విషయే౦ద్రియసంయోగాత్ యత్తదగ్రేమ్రతోపమామ్|
పరిణామే విషమివ తత్శుఖం రాజసం స్మ్రుతమ్ ||                    (భగవద్గీత 18:38)
ఇంద్రియార్ధములు ఇంద్రియములతో కలియుట వలన కలుగు సుఖము మొదట అమ్రుతముతో సమానముగను చివర విషమువలెను ఉండును. అట్టి సుఖము రజోగుణముతో కూడినదని భావింపబడును .
యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్యప్రమాదోత్తం తత్తామసముదాహృతమ్ ||                               (భగవద్గీత 18:39)
నిద్ర, సోమరితనము, మోహముల వలన కలిగి మొదటినుంచి చివరి వరకు ఆత్మను అదే సుఖమనిపించే భ్రాంతిలో ఉంచేది తామస సుఖం .
బుద్ధి: జ్ఞానమాసమ్మోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దు:ఖం భావో భయం చాభయమేవ చ ||                                 (భగవద్గీత 10:4)
అహింసా సమతా తుస్టి: తపో దానం యశో యశ : |
భవంతి భావ భూతానం మత్త ఏవ పృథగ్విధా: ||                       (భగవద్గీత 10:5)

బుద్ధి, జ్ఞానము, భ్రాంతి లేకుండుట, క్షమా గుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖము, దుఃఖoము, పుట్టుక, మరణము, భయము, నిర్భయము, అహింస, సమభావము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, మున్నగు వివిధ భావములు జీవులకు నానుండియే  కలుగుతున్నవి.

జన్మలు :

జన్మలు :
మానవ జన్మ దుర్లభమైనది మరియు మహోన్నతమైనది కూడా అదేలగు అంటే, అన్ని జన్మలలోనూ మనవ జన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది.అసలు జన్మలు మూడు రకాలు.
 1) దేవ జన్మ
 2) మానవ జన్మ మరియు
 ౩) జంతు జన్మ.


మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.అందులో అన్ని పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచినపుడు ఆ జీవుడు దేవలోకలలో దేవ జన్మ నేత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమి.కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారము లేదు.అందువల్ల పరమాత్మను పొందడానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు.తన కర్మఫలాల ననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయం కాగానే “క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని (మనవలోకాన్ని) చేరుకోవలసిందే. మరల మరల మనవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే.ఈ దేవా జన్మలో కేవలం మనోబుద్దులు ఉంటాయి కానీ స్థూల శరీరం వుండదు. కనుక భాగాత్సక్షారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవజన్మ.        


ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు జంతువులూ, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, మొదలైన జంతువులుగా జన్మిస్తాడు.ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు. జంతు జన్మలో కర్మలు చేస్తున్నట్లు కన్పించిన, ఆ కర్మలన్ని బుద్దిపరంగా అలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనేవికావు. కేవలం ప్రకృతి ప్రేరణతోనే పరతంత్రంగా చేస్తాయి.కారణం ఈ జంతు జన్మలలో శరీరం మరియు మనస్సు వున్నాయి కానీ బుద్ది మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడ కేవలం కర్మఫాలలు అనుభవించుటయే కానీ పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు.కనుక భాగవత్సాక్షారానికి ఈ జంతు జన్మకూడా ఉపయోగపడదు.


ఇక పుణ్యపాపకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాలు కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు , బాధలు, అవమానాలు అనుభవిస్తాడు.అయతే ఇలా కర్మ ఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మనవ జన్మలోనే వున్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ది  అనే సాదనం వున్న జన్మ ఇది. అదే విధంగా పరమాత్మ నందుకోవదడానికి తగిన కర్మలు చేసే అధికారం , జ్ఞానాన్ని పొందే అవకాశం వున్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు. 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానజన్మను “జంతూనాం నారా జన్మ దుర్లభం” అని శంకరాచార్యులు వారు వివేక చూడామణి గ్రంథంలో తెలియజేయటం జరిగింది. ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్థకం చేసుకోవాలి. అదే మనవ జీవిత లక్ష్యం అంతే ఎదో ఇక్కడ సాధించే పదవులు కాదు మరేవియును మనవ జన్మ లక్ష్యాలు కానే కాదు.


సార్థకం చేసుకోవటమంటే ఏమిటి ? : ఇక్కడ మనం అనుభవించే సుఖాలు (అవి ఏవైనను) తత్కాలితమైనవే గాని నిత్యమైన సుఖాలు కాదు. ఎన్ని సుఖాలు భోగాలు అనుభవించిన ఇంకా ఎదో వెలితి, ఇంకా ఎదో కావాలనే తపన. ఎందుకంటే అవి నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవి అనిత్యమైన, పరిమితమైన వస్తువుల ద్వార వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన శాశ్వతమైన, సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే సాద్యం (లభిస్తుంది).ఏమిటా ఆ నిత్య వస్తువు ? పరిపూర్ణ వస్తువు? శాశ్వత వస్తువు? ఈ సృష్టికి ములాధారమైన ఏకమైన “పరమాత్మ” మాత్రమే (అయన దివ్య దర్శనాన్ని హృదయాలంలో సాక్షాత్కరించుకోవడమే శాశ్వత సుఖం).”నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం” అని “తత్వబోధ” లో శంకరాచార్యుల వారు స్పష్టం చేసారు.అంటే నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వము అనిత్యమైనవే, అని అర్థం.కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం , ఆనందం అందుకోనేవరకు మనవుడుకి తృప్తి వుండదు. అసంతృప్తి తీరదు.అట్టి శాశ్వతానందాన్ని అందుకోవటమే జన్మను సార్థకం చేసుకోవటమంటే. ఆ శాశ్వతనందాన్నే మోక్షం,ముక్తి అన్నారు.అదే విముక్తి (విముక్తి అంటే దేని నుండి విముక్తి? సర్వ బందనాల నుండి విముక్తి).బంధనాలు అంటే కర్మబంధనాలే(కర్మ బంధనాలు అంటే అనంతకోటి జన్మల నుండి మనం చేస్తూ వస్తున్నా కర్మల ఫలాలే ).ఈ బంధనాలున్నంత కాలం మనం ఎదో ఒక జన్మ ఎత్తుతూ వుండాల్సిందే. అలాగాక మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవలసిందే.

కర్మలు :

జన్మలు మరియు కర్మబంధనాలు ఎలా వస్తాయి అన్న వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ జన్మ లేకుండా ముక్తినిపొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవాలి (వదిలించుకోవాల్సిందే). ఐతే వీటిని ఎలా వదిలించుకోవాలి ? అనేది తెలుసుకుందాం.


మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనం చేసేపనులు అన్నీ కర్మలే.ఇలా ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుండి చనిపోయెంతవరకు కర్మలు చేస్తూనే వుంటాడు.ఇలా చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది (కర్మ ఫలితం ప్రకృతి సహజ గుణం).మనం చేసే ప్రతి కర్మ కూడా ఎపుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చియే తీరుతుంది. అవి ఫలితాన్నిచ్చే సమయాన్ని బట్టి కర్మలను ౩ రకాలుగా విభజించారు. అవి 1) అగామి కర్మలు, 2)సంచిత కర్మలు మరియు ౩)ప్రారబ్ద కర్మలు.
అగామి కర్మలు : ఇప్పుడు మనం చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలే. అయతే ఈ కర్మలలో కొన్ని అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చేస్తాయి.కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివటం కోసం కూడబెట్టుకొనివుంటాయి. ఉదాహరుణకు మనం భోజనం చేస్తాం. అది కర్మ.వెంటనే మన ఆకలి తీరుతుంది. ఎవరినైన కోపంతో తిడతాం.అవతలివాడు బలంగలవాడైతే చెంప పగలగొడుతాడు. అది కర్మఫలం.ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితన్నిచ్చేస్తాయి.కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు. ఉదాహరునకు ఎదురుగాలేని వాణ్ణి తిడతాం.వాడిమీద నిందలు వేస్తాం.కానీ వాడు ఎదురుగలేడు గనుక అప్పటికప్పుడు ఫలితం రాదు. దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం,అవన్నీ వెంటనే ఫలితన్నిచ్చేవి కావు, మనం పరీక్షలు వ్రాస్తాం. ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది.ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి.ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే.


సంచిత కర్మలు : ఇంతకూ ముందు జన్మలో చేసి, తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టబడిన కర్మలలో నుండి ఆ జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించినవి పోను, మిగిలినకూడబెట్టబడిన కర్మలను, అదేవిదంగా అంతకుముందు జన్మలలో చేసిన కర్మఫలనుంది ఖర్చు అయినవిపోగా ఒక జన్మనుండి మరొక జన్మకు మోసుకుంటే వచ్చిన కర్మలను సంకుచిత కర్మలు అంటారు.జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన ఈ సంచిత కర్మలు మాత్రం జీవున్ని విడిచి పెట్టకుండా అతడితో ప్రయాణమై వస్తుంటాయి.మనం అద్దె ఇళ్ళలో వుండి మరొక ఇంటికి మారేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వస్తువులను ఎలా ముటగట్టుకొని వేలతామో అలాగే జీవుడు భగవంతుడు ఇచ్చిన అద్దె ఇంటిలాంటి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించినా కర్మఫలాలను ముటగట్టుకొని తగిన మరొక అద్దేకొంపలాంటి శరీరాన్ని వెతుక్కుంటూ వెళతాడు. ఇలా తీసుకువెళ్ళేవే సంచిత కర్మలు.


ప్రారబ్ధ కర్మలు : అనేక సంచిత కర్మలు జీవుడితో కలిసి ప్రయనిస్తాయని చెప్పుకున్నాం.ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో , అప్పుడు అతడి account వున్న సంచిత కర్మల నుండి , ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో , పండుతాయో, ఫలితన్నివ్వటానికి సిద్దంగా ఉంటాయో వాటిని ప్రారబ్ద కర్మలు అంటారు.ఆ ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, తగిన శరీరంతో జీవుడు మళ్ళి ఈ లోకంలో ప్రవేసిస్తాడు.అల వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు శరీరం వుంటుంది.


భగవంతుడు , మనం అజ్ఞానంతో మరియు అవిద్యతో సంపాదించుకొని వున్న ప్రారబ్ద కర్మలను తొలగించుకోవడానికి మనకు (జీవునికి) మరొక శరీరాన్ని ఇస్తుంటే, మనం ఇక్కడ వాటిని వదిలించుకోవడానికి వచ్చి, చేసే కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో వాటికీ తోడూ ప్రోగు చేసుకుంటున్నాము. ఇది గమనించండి.ఇలా ప్రోగు చేసుకోవడం వలన మరల మరల భగవంతుడు మనకు (జీవునికి), నీ కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణిడిగా నా దగ్గరకు రమ్మని అతనికి మరల శరీరాన్ని ఇస్తున్నాడు. మనం ఏ రోజైతే సంపూర్ణంగా అన్ని కర్మలను ఈ స్థూల శరీరంతో సంపూర్ణంగా చేసి వదిలించుకుంటామో, మనం అప్పుడు మాత్రమే మన నివాస స్తానానికి చేరుకుంటాము. అదే పరమపదము , అదియే మన నివాస స్థానము. మనం అనుకున్నట్టుగా వున్న ఈ శరీరము, ఈ భూమిమీద వున్న ఇల్లు నీ నివాస స్థానాలు కాదు. నీ నివాస స్థానము ఈ సృష్టికి మూలకరణము అయిన పరమాత్మునిలో ఐక్యం (అదియే పరమపదము).
“పునరపి జననం పునరపి మరణం .పునరపి జానీ జటరేశయనం” అని శంకరాచార్యుల వారు “భజగోవిందంలో చెప్పినట్లు మళ్ళీ మళ్ళీ చస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్బంలో ప్రవేశించాలి. ఇలా అయతే ముక్తి ఎప్పుడు ? మోక్షం ఎప్పుడు ? శాశ్వతానందం ఎప్పుడ : ఈ జనన మరణాలనుండి విముక్తి చెందినప్పుడే అంటే మళ్ళీ పుట్టుక లేకుండా పోయినప్పుడే .         


మళ్ళీ పుట్టుకలేకుండా పోవాలంటే ఏం చేయాలి : అసలు జన్మ (పుట్టుక) ఎందుకు వస్తుంది : ప్రారబ్ద కర్మ ఫలాలను అనుభవించటానికి వస్తున్నది. ఆ ప్రారబ్దకర్మలే లేకపోతే పుట్టుకే లేదు.ఐతే ఈ ప్రారబ్ద కర్మలు ఎక్కడ నుండి వస్తున్నాయి? సంచితకర్మలలో నుండి పక్వమై వస్తున్నాయి.కనుక ప్రారబ్ద కర్మలు లేకుండా పోవాలంటే సంచిత కర్మలు లేకుండా పోవాలి. అయితే సంచిత కర్మలు ఎలా వస్తున్నాయి ? మనం ముందు జన్మలో చేసిన ఆగామి కర్మలలో నుండి ఫలితాన్నిచ్చినవి పోను మిగిలిన కర్మలె సంచిత కర్మలుగా వస్తున్నవి.కనుక సంచిత కర్మలు చేయకుండా వుండాలి. అంటే అసలు కర్మలే చేయకుండా ఉండాలన్నమాట.


ఐతే కర్మలు చేయకుండా వుండటం ఎవరికైనా సాధ్యమేనా ? ఈ లోకంలో వ్యవహరిస్తూ కర్మ చెయ్యకుండా ఒక్కక్షణం కూడా ఉండలేము.అందుకే “భగవద్గీత” లో భగవానుడు శ్రీ కృష్ణుడు
“నహికశ్చిత్ క్షణమపి జాతుతిష్టత్య కర్మకృత్” అని చెప్పారు .
అంటే జీవించి ఉన్నంత వరకు ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండటం సాద్యంకాదు అని.ఇదే భావాన్ని “ఈశావస్యోపనిసత్” లోని రెండవ మంత్రం స్థిరపరుస్తుంది .


“కుర్వాన్నే వేవా కర్మాణి జిజీవిషేచ్చతగం సమా, |
ఏవంత్వయి నాన్యధోతోస్తి నకర్మలిప్యతేనారే||”
అంటే ఈ లోకంలో కర్మలు చేస్తూనే జీవించాలి.ఇదే నీ కున్న మార్గం.మరొక మార్గం లేదు.కర్మ కళంకాన్నివ్వదు. – అని ఈ మంత్రం భావం.కనుక జీవించినంత కాలం కర్మలు చేస్తూ వుండాల్సిందే.


ఐతే ఎలాంటి కర్మలు చేయాలి ? : జన్మ లేకుండా పోవాలంటే కర్మలు చేయకుండా వుండాలనుకున్నాం.కానీ కర్మలు చేయకుండా వుండడం ఒక్కక్షణం కూడా సాద్యం కాదని, జీవించి ఉన్నంత కాలం కర్మలు చేస్తూ ఉండాల్సిందేననీ తెలుసుకున్నాం.ఐతే ఎలాంటి కర్మలు చేయాలి ?. 


పాపకర్మలు, చెడ్డకర్మలు చేశామా ? కష్టాలు, దుంఖాలు అనుభవించడానికి పశుపక్ష్యాదులుగానో లేక జంతువులుగానో జన్మించాలి. పుణ్యకర్మలు, మంచి కర్మలు చేసామా ? సుఖాలు, భోగాలు అనుభవించటానికి దేవతలగానో జన్మించాలి. అవి ఇవి కలగాపులగంగా చేసామా సుఖాన్ని, దుఃఖాన్ని. భోగాన్ని, మరియు రోగాన్ని అనుభవించడానికి మానవునిగా జన్మించాలి.కనుక ఎలాంటి కర్మలు చేసిన కర్మబందనం తప్పదు.జన్మ తప్పదు. అంటే పుణ్య కర్మలు చేస్తే బంగారు సంకెళ్ళు మరియు పాపకర్మలు చేస్తే ఇనుప సంకెళ్ళు అన్నమాట.రెండు సంకెళ్ళే, రెండును కూడా జీవున్ని బందించేవే. కానీ మనకు కావలసింది విముక్తి వీటన్నిటినుండి సంపూర్ణంగా విముక్తి అదియే ముక్తి , మోక్షం , పరమపదం.


ఈ కర్మలు బంధాలు కాకుండా వుండే ఉపాయం ఏమిటంటే , అగామి కర్మలు చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫలితన్నిచ్చే  కర్మలు చేయవచ్చు. తర్వాత ఎప్పుడో ఫలితన్నిచ్చే విదంగా కర్మలు చేయకూడదు.అంటే ఆగామి కర్మలు సంచితం కాకుండా , కూడబెట్టకుండా చాల చాల జాగ్రత్త పడాలి అంటే బాగావంతర్పణ బుద్దితో మనం పనులు చేయాలి(అంటే మనం దేవుని ముందర నిల్చొని చాట బారడం అంత లిస్టు అప్పచెప్పుతాం ఆ లిస్టు ఏంటో నేను చెప్పనక్కరలేదు అనుకుంట ఎందుకంటే అందరు దాదాపు చేసే పనులివే కదా. దేవుడా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు, అంటే మనం అందరం మొదట భగవంతునిని కోరికలు కోరడం మానివేయాలి జరిగేదంతా మన మంచికే అని మన మనసును స్తిరపరచాలి అన్న మాట).ఇక ప్రారబ్ద కర్మలను అనుభవించి ఖర్చు చేసుకోవాలె తప్ప ప్రోగు చేసుకోకుడకు.వీటిని మనం వదిలించుకోవాలి (ఇవి మనం అజ్ఞానముతో మరియు అవిద్యతో వచ్చిన కర్మలు). మరీ ఈ సంచిత కర్మలు తొందరగా అనుభవించేద్దమ అంటే అవి పక్వానికి రాలేదు .పోనీ జాగ్రత్త పాడుదామ అంటే , ఇప్పుడు జాగ్రత్త పడి ప్రయోజనం లేదు. అవి పాత కర్మలు. మరేమిటి ఉపాయం ? వీటన్నిటిని ఒక్కసరిగా దగ్దం చేయాలి.ఎక్కడ దగ్దం చేయాలి, అదే జ్ఞానగ్నిలో, అంటే మన అజ్ఞానంతో కూడబెట్టుకున్న అన్ని కర్మలను మనం తెలుసుకుంటున్న జ్ఞానాగ్నిలో దగ్దం చేయాలి.అదియే అసలుసిసలైన మార్గం.


ఈ ప్రకారంగా ఆగామి కర్మలు మరియు సంచిత కర్మలు వున్న వాటినన్నిటిని జ్ఞానగ్నిలో దగ్దం చేయాలి. దగ్దం చేసి జాగ్రత్త పడితే కర్మఫలాలంటూ ఇక వుండవు అప్పుడు కర్మ బందనాలు వుండవు, కర్మ బందనలు లేకపోతే జన్మలుండవు ఇదియే మనవ జీవిత లక్ష్యం , మనిసి పుట్టుక సార్ధకత. అదియే మోక్షం, శాశ్వతానందం, ముక్తి. మనం అందుకోవలసిన స్తితి ఇదే, చేరవలసిన స్థానము ఇదే (అదియే మన గమ్యస్థానం).అయితే పైన చెప్పిన పద్దతుల్లో మనం సర్వకర్మ బందనాలనుండి విముక్తం కావాలంటే(జ్ఞానగ్నిలో ధగ్దం చేయాలి)అందుకు గొప్ప సాధన కావాలి. అటువంటి సాధనకు మార్గం చూపేది, ఆ మార్గం వెంట మనసు చేయిపట్టుకొని నడిపించేది, లక్ష్యాన్ని చేర్చేది ఉపనిషతులసారం, బ్రహ్మవిద్యాప్రబోధము, యోగాశాస్త్రము అయిన భగవద్గీత మరియు “హిందూ ధర్మ వేదాలు, ఉపనిషతులు మరియు భగవద్గీత”.     


ఆగామి కర్మలను సంచితం కాకుండా “కర్మయోగం” ద్వార చేయాలనీ , ప్రారబ్ధ కర్మలను అనుభవించి ఖర్చుచేసుకోవటం “భక్తియోగం” ద్వార అని మరియు సంచిత కర్మలను జ్ఞానగ్నిలో దగ్దం చేసుకోవటం జ్ఞానయోగం ద్వార అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఎంతో విపులంగా విషదీకరించాడు.వీటితో పాటు భగవంతుని సాక్షాత్కారం (మన హృదయంలో దర్శించుకోవడం) కూడా ధ్యానయోగం ద్వార అని కూడా ఎంతో విపులంగా వివరించాడు.


అందువలన మనం అందరం చేయవలసిన పని మొదట ఈ అన్ని(కర్మ,భక్తి,జ్ఞాన) యోగాలతో పాటు భగవంతుని సాక్షాత్కారం ఎంతో బృహత్కర్యమైనదని నా ఉద్దేశ్యం,  అందువలన వీటి అన్నిటితో పాటు ముఖ్యంగా ద్యాన యోగంతో ఆ దేవదేవునిని , ఆ భగవంతునిని మన హృదయంలో దర్శనం పొందడం ఎంతో ఉత్తమోత్తమమైనది. అదియే మానవ జీవిత పుట్టుక అసలుసిసలైన లక్ష్యము మరియు మానవ జీవితం యొక్క సార్ధకత. (అదియే ముక్తి, మోక్షము, పరమపదము,