Sunday, November 1, 2015

వైరాగ్యము - సన్యాసము

వైరాగ్యము అంటే మమతానురాగముల నుండి భయముతో పారిపోవడము, సోమరిగా, నిర్వీర్యముగా, అర్థరహితముగా జీవించుట కాదు. జీవిత సమస్యల నుండి దూరముగా పారిపోవుట కాదు. నీవు ఎక్కడికి పారిపోయినను నీ సంసారము నీతో పాటే వస్తుంది (సంసారము మానసికము కనుక). వైరాగ్యము అంటే నిష్క్రియా పరమైనది కాదు. వైరాగ్యము అనగానే గుర్తుకు వచ్చేది సన్యాసము. సన్యాసము అనునది సంసార బాధలను భరించలేక వాటినుండి విముక్తి కొరకు స్వీకరించునది కాదు. కర్మ ఫలత్యాగము సన్యాసము. కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయగలుగుట సన్యాసము. జీవిస్తూ జీవించని వాడిగా ఉండుట సన్యాసము. కర్మను చేయుటయందు కుశలత్వము కలిగియుండుట సన్యాసము. తామరాకుపై నీటిబొట్టులాగా సంసారము యందు మెలగగలుగుట సన్యాసము

No comments:

Post a Comment