ధ్యానం, ధ్యానం, ధ్యానం ఎందుకు చేయాలి? నా పనులన్నీ పక్కన పెట్టి చేయవలసిన అవసరం నాకేమి ఉంది. ఇప్పుడే నాకు వచ్చిన తొందర ఏముంది. నా వయసు ఇంకా 25+ కదా. ఇప్పుడు బాగా enjoy చేయాల్సిన వయస్సు. బాగా సంపాదించాల్సిన వయస్సు. ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు వాటిని అన్నిటిని పక్కన పెట్టి ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత తొందర ఏమొచ్చింది? పైగా ఇంకా ఎన్నో భోగాలను అనుభవించవలసిన వయస్సు. ఇప్పుడే అన్ని వదులుకొని నా సమయాన్ని వృధా చేసుకోవలసిన అవసరం నాకేమి వుంది. పైగా ధ్యానం లో కూర్చుంటే ఆలోచనల మీద ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇది మన వల్ల అయ్యే పని కాదు. అయిన నాకేమి అంత మించి పోయే వయసేమి రాలేదు కదా. అవును అండి. మీరు అలోచించినవి అన్నియు నిజాలు. పచ్చి నిజాలు.
కాని ధ్యానం ఒకప్పుడు (అంటే పూర్వ కాలంలో) చేసుకునే వాళ్ళు, వాళ్ళంతా అప్పుడు భగవంతుని దివ్య దర్శనాన్ని హృదయంలో దర్శించుకోవడం కోసం. కాని ఈ కాలంలో కూడా ధ్యానం చేసుకుంటున్నారు అయితే ఎప్పుడు అంటే ఆరోగ్యం బాగాలేక doctor దగ్గరికి వెళితే, అప్పుడు doctor గారు చెపితే (లేక) చదువు మీద శ్రద్ధ నిలువలేక ఏకాగ్రత కోల్పోతుంటే (లేక) ఎవరో విదేశస్తులు మనకు సలహాలు ఇస్తే ఎందుకటే ఇప్పుడు మనం అంతా విదేశీ సాంప్రదాయాల మీద ఆధారపడివున్నాము కదా అందుకు ఎవరో చెపితే అప్పటి వరకు మనం దాని మీద concentrate చెయ్యం. ఇవి కూడ నిజాలే. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన. కాని ధ్యానం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు చాలానే వున్నాయి, అవి శారీరకంగా మరియు మానసికంగా, రెండు విధాల ఉపయోగమే.
ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం అంటే ఏమి లేదండి. ఇది చాల సులువైన ప్రక్రియే. అందరూ చెప్పినట్లుగా ఏవేవో ఆసనాలు ఏవేవో నియమాలు ఏమి అవసరం లేదండి. మనకు అనువుగా ఎట్లా కావాలంటే అట్లా కూర్చోవడమే ‘ఆసనం’.నియమాలు అసలేమి లేవండి. మీకు అనువుగా ఎట్లా కావాలంటే చేతులను అట్లా పెట్టుకోండి. మీరు రోజు చేసుకునే కార్యక్రమాలు అన్నియు చేసుకోండి మరియు అన్నీ తినండి. ఇంకో విషయం ఏమిటంటే ధ్యానం అంటే మీరు పద్మహాసనం వేసుకొని కూర్చొని వుంటే మాత్రమే చేసుకోవలసిన పని లేదు. ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు కూడ ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ధ్యానం అంటే పరిపరివిధాల పోయే మన మనస్సును ఒకచోట నిలిపే ప్రక్రియనే (దీనినే యోగం) ధ్యానం అంటారు. ఒకవేళ మనసును ఒకచోట నిలపలేక పోతే దానికి కొన్ని పద్దతులు వున్నాయి. మనసును నిలపాలంటే *జ్ఞానవైరాగ్యాల చేత మరియు *అభ్యాసం(అంటే సాధన) చేత మనస్సును నిలపవచ్చు. మొదట్లో కొద్దిగా కష్టంగా ఉన్న తరువాత ప్రతి రోజు ధ్యానం చేసుకుంటూ వుంటే అదే నిదానంగా ఒక అచేతన స్తితికి వస్తుంది. అయితే క్రమం తప్పకుండా చేసుకోవాలి. మొదట్లో కొన్ని నిముషాలు ఆ తరువాత నిదానంగా సమయాన్ని పెంచలే తప్ప తగ్గియ్యకూడదు సుమా. గుర్తుంచుకోండి. ఎందుకంటే మొదట్లో ఆవేశంలో ఎక్కువసేపు చేసుకొని ఆ తరువాత కొద్దిగా పనుల భారమో లేక ఏవేవో వ్యవహారాల మూలంగా సమయాన్ని తగ్గియ్యడానికి ప్రయత్నిస్తారు. అందుకే మొదటి నుండే ఒక సమయాన్ని fix చేసుకోండి. అవి...
1. ఉదయం లేచిన వెంటనే brush చేసుకొని ఒక గంట సేపు ధ్యానం చేసుకోండి. స్నానం చేసి చేస్తే ఇంకా మంచిదనుకోండి.
2. సాయంత్రం 6 గంటల తరువాత ఒక గంట సేపు ధ్యానం చేసుకోండి.
3. మరల రాత్రి పడుకునే ముందు ఒక అర్ధ గంట సేపు కూర్చొని ధ్యానం చేసుకోండి.
అన్నిటికంటే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే చాల మంది చాల చెప్తూవుంటారు, ధ్యానం చేసుకునేటప్పుడు ఎదో ఒక దేవుని పేరునో లేక ఎదో ఒక మంత్రాన్నో లేక ఓం అనో వుచ్చరించమని చెప్పి వుంటారు. కాని ఇవన్ని ఏమి వద్దు. ధ్యానం చేసుకునేటప్పుడు పాటించవలసినవి.
1. ఆసనం - నీకు అనువుగా ఉండే అట్లు కుర్చోవచ్చు
2. చేతులు - నీ చేతులను నీకు ఎట్లా అనువుగా వుంటే అట్లా పెట్టుకోవచ్చు.
3. మనస్సును ప్రశాంతంగా హాయిగా ఆనందంగా వుంచుకొని ఎటువంటి మంత్రం జపించాకుండా, హృదయంలో దివ్య జ్యోతి వుందని సంపూర్ణ విశ్వాసంతో భావించుకొని హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి కూర్చోవాలి అంతే.
4. మనస్సు విషయాల మీదకు వెళ్ళినప్పుడు దానిని మరల్చి మరల దివ్య జ్యోతి మీద ఏకాగ్రత పెట్టాలి అంతే కాని ఏవో మంత్రాలూ అవి ఇవి ఏమి అవసరం లేదు.
5. ఇట్లా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మరియు రాత్రి మూడు సార్లు సాధన చేస్తే తొందరగా సమాధి స్థితికి వెళ్ళవచ్చు. ఒకసారి సమాధి స్థితికి వెళితే నీ మనస్సుకు సంపూర్ణత ప్రశాంతత మరియు శ్రద్ధ పెరుగుతుంది అప్పుడు మనస్సు విషయ వాంచనల మీదకు మరలదు.
ధ్యానం చేసుకునే పద్దతులు చాలానే వున్నాయి. అందులో
1. శ్వాశ మీద ధ్యాస(ఇది pyramid ధ్యాన కేంద్రం వాళ్ళు చేపిస్తున్నది)
2. మనస్సులో దివ్య జ్యోతి వుందని భావించుకొని హృదయ స్పందన మీద ఏకాగ్రతను నిలుపడం (ఇది రామకృష్ణ మిషన్ ధ్యాన కేంద్రం వాళ్ళు చేపిస్తున్నది).
౩. ఏకాగ్రతగల మనస్సుతో తననాసికాగ్రభాగమునందే (రెండు కనుబొమల మధ్య “భ్రుటి” ) దృష్టిని నిలిపి అంతఃకరణశుద్దికై యోగాభ్యసమును సాధనచేయవలెను – భగవద్గీత మరియు ఏకాగ్రతతో మనసు నిలిపి భ్రూ మధ్యమున ద్రుష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించునురా – వీరబ్రహ్మేంద్ర స్వామి .
ధ్యానం చేయడానికి దాదాపు అందరూ ఈ మూడు పద్ధతులనే అవలంబిస్తుంటారు.ఇంకా చాలానే వున్నాయి. వాటి అన్నిటిలో కంటే ఈ మూడు బాగా ఉంటాయి. ఈ మూడింటిలో కూడా మొదటిదాని కంటే రెండవది మేలు. రెండవదాని కంటే మూడవది మేలు. కాని మూడవది మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా వుంటుంది. రెండవది అయితే ధ్యానం చేయడానికి చాల చాల అనువుగా వుంటుంది. తొందరగా మనస్సు కుదుట పడుతుంది . తొందరగా సమాధి స్థితికి వెళ్ళవచ్చు. ఒకటవ దానితో పోలిస్తే రెండవది మేలు. కావున నా ఉద్దేశ్యం మీరు అందరూ రెండవ దానిని అవలంబింది సాధన చేయడం మొదలుపెట్టండి. ధ్యానం చేసుకునే ముందు ఈ విదంగా మనసులో అనుకొని కూర్చోండి.
“ ఓ పరమాత్మా!
ఈ మనవ జీవితపు యదార్థ లక్ష్యము నీవే ; మేమింకను కోరికలకు బానిసలమై వుండుట వలన ; మా ప్రగతికి ప్రతిబంధకములై వున్నవి ; మమ్ములను ఆ దశకు చేర్చే ; ఏకైక శక్తివి, స్వామివి నీవే.
(ఇది రామకృష్ణ మిషన్ ధ్యాన కేంద్రం వాళ్ళది).
*అయితే ఇప్పుడు జ్ఞానవైరాగ్యాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. జ్ఞానం అంటే ఏమిటో నేను ఇంతకూ ముందే వివరించాను. వైరాగ్యం అంటే అనిత్యమైన వాటి మీద ఒక అసహ్యాన్ని మనసుకు కలుగ జేస్తూ మనసు మార్గాన్ని మరల్చాలి. మరల్చి భగవంతుని మీదకు ద్రుష్టి నిలిపేలా చేయాలి. ఈ విధంగా మనస్సును జ్ఞాన వైరాగ్యాల ద్వార అదుపు చేయవచ్చు.

No comments:
Post a Comment