Sunday, November 1, 2015

నిరంతరం భగవంతుణ్ణి ఎందుకు స్మరించాలి?

మిత్రులారా! మనం ఏదైనా ఒక చెట్టు నాటాలనుకున్నామనుకో, మొదట ఏ చెట్టు నాటాలి అని Decide చేసుకుంటాము. ఆ తరువాత దాని విత్తనం తెచ్చి భూమిలో నాటి, దానికి ప్రతి రోజు నీళ్ళు పోస్తూ ఉంటూ, దానిని ఏ పశువులు చెట్టును తగలకుండా చెట్టు చుట్టూ కంచె వేస్తాము. అప్పుడు అది కొన్నాళ్ళకు పెద్దదై మనకు ఫలాలను మరియు నీడను ఇస్తుంది. అదేలాగు ఇక్కడ మనం భగవంతునిని తెలుసుకోవాలంటే, మొదట మనం జ్ఞానం ద్వార నేను ఆత్మను మరియు ఈ సమస్తము(కనిపించే సృష్టి అంటే ప్రకృతి మొత్తం) పరమాత్ముడే ఈ విధంగా అయ్యాడు, ఈ కనిపించే ప్రకృతి అంతా తిరిగి నశించి మరల ఆ పరమాత్ముడిగా (అంటే శక్తిగా) మారుతుంది అని తెలుసుకుంటాము. కాని ఇది తెలిసినంత ఆ క్షణమే మనకు సంపూర్ణంగా తెలిసినట్లు కాదు. నిజమైన స్వస్వరూపమైన ఆ దివ్య శక్తిని నీ శరీరపు హృదయంలో ఎప్పుడు దర్శించుతావో, అప్పుడు నీవు పరిపూర్ణుడవు అవుతావు.
ఆ విధంగా పరిపూర్ణతను సాధించాలంటే నీవు నిరంతరం ఆ పరమాత్మునిని స్మరిస్తూ వుంటూ, చేసే ప్రతి పనిని దైవారధనగా భావిస్తూ,A భగవంతార్పణ బుద్దితో అన్ని పనులు చేస్తూ ఉంటే, అప్పుడు నీ మనస్సు నిర్మలమవుతుంది. నీ మనస్సు నిర్మలమైన కొలది నీకు ఆ భగవంతుని తత్త్వం నీకు సంపూర్ణంగా అర్ధమవుతూ ఉంటుంది. నీకు ఆయన తత్త్వం అర్ధమయ్యే కొద్దీ నీ హృదయంలో ఆయనను దర్శించాలనే తపన అధికమవుతుంది. అప్పుడు నీకు ధ్యానంలో నీ మనస్సు శుద్దమైన పరమాత్మవైపే పరుగులు పెడుతుంది.
ఇక్కడ చెట్టు ఉదాహరణ గురించి చెపుతా...మనలక్ష్య సాధన మోక్షం (ఏ చెట్టు నాటాలో) అంటే హృదయంలో భగవంతుని సాక్షాత్కారం. అప్పుడు మనం భగవంతునిని హృదయంలో దర్శించాలి అని మన మనస్సులో దానిని స్థిరపరచాలి (విత్తును భూమిలో నాటడం). మనస్సులో స్థిరపరచిన తరువాత, ప్రతి క్షణం నిరంతరం ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఉండాలి (ప్రతి రోజు చెట్టుకు నీరు పోస్తూవుండడం). నిరంతరం స్మరిస్తూ మరియు చేసే ప్రతి పనిని భాగంతార్పణ బుద్దితో చేస్తూ ఉండాలి, అప్పుడు జరిగిపోయే ఈ ఆగామి కర్మలకు మనం బద్దులం కాము (చెట్టును తాకకుండా దాని చుట్టూ కంచే వేసినట్లు, మనకు ఆ కర్మలు తాకకుండా ఉండేందుకు భగవంతార్పణ బుద్దితో కర్మలు చేయడం).
ఈ విధంగా మనం ప్రతి రోజు నిరంతరం భగవంతునిని స్మరిస్తూ ఉంటూ మరియు ఆన్ని పనులు భగవంతార్పణ బుద్దితో చేసుకుంటూ పోతు ఉంటే, అప్పుడు మన మనస్సు తొందరగా నిర్మలమవుతుంది, శుద్దమవుతుంది, ఆ విధంగా పరిపూర్ణమైనపుడు, మనం ఆ దేవదేవుడిని హృదయంలో తొందరగా దర్శించుకోవచ్చు.

No comments:

Post a Comment